Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
ఎన్ని కష్టాలు వచ్చినా వీళ్లను మాత్రం సహాయం అడగవద్దు..!
జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోక తప్పదు. కొన్ని సందర్భాల్లో జేబులో ఒక్క రూపాయి కూడా వుండదు. ఎప్పుడూ చేయిచాచి అడగకున్నా కూడా ఎందుకో అడగాలనే తలంపు వస్తుంది. డబ్బును అడిగి తరువాత తిరిగి ఇవ్వచ్చు అనే ఆలోచన వస్తుంది. మనకు దగ్గరగా ఎవరు వుంటే వారికి డబ్బు సహాయం అడగడానికి వెనకాడం. డబ్బు ఎవరు ఇచ్చి ఆదుకుంటారా అని వేయికళ్లతో వెతుకుతూ వుంటాం. చివరగా ఎవరైనా డబ్బు ఇచ్చే వాళ్లు కనబడితే కళ్లు మూసుకొని వారి వద్ద నుంచి డబ్బును తీసుకోవడానికి సిద్ధపడతాము. డబ్బు ఇచ్చే ది ఎవరి, ఏ వృత్తి చేస్తారు, ఎలాంటి అలవాట్లు వున్నాయ్ లాంటివి ఏమీ గమనించకుండా డబ్బును తీసుకుంటాము.

ఎటువంటి దారుణ పరిస్థితులు వచ్చినా 5 మందిని సహాయం కోరవద్దు అని హిందూ శాస్త్రం మనకు చెబుతోంది. కురుక్షేత్ర యుద్ధంలో ఎవరిని సహాయం అడగవచ్చు, ఎవరిని అడగలేమనేదానిపై భీష్మ పితామహుడు మనకు వివరించి వున్నాడు. దీనికి భీష్మపితామహుడు స్పందించి ఎన్ని సమస్యలు వచ్చినా ఆకలితోనైనా వుండవచ్చు గానీ 5 మందిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహాయం అడగవద్దని చెబుతాడు. ఒకవేళ ఈ ఐదు మందిని సహాయం అడిగితే జీవితం అల్లకల్లోలమవుతందని చెప్పాడు.
ఎంత ప్రాణం పోయినా సరే మన శత్రువులను మనం సహాయం అడగవద్దు. శతృవులు మనకు సహాయం చేసినా కూడా వారు ఎప్పుడైనా మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా శత్రువుల దగ్గర చేయి చాచి అడగవద్దు. ఆకలితోనైనా వుండవచ్చు కానీ శత్రవును సహాయం కోరరాదు.
దొంగలను కూడా సహాయం అడగవద్దు. దొంగలను ఎప్పుడు సహాయం అడిగినా సరే మనం ప్రమాదంలో ఇరుక్కుంటాం. వారి సొమ్ము, ధనం మన వద్ద వుంటే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దొంగ దగ్గర సహాయం తీసుకోవడం కూడా మంచిది కాదు.

వ్యభిచారం చేసే వారి దగ్గర కూడా సహాయాన్ని అర్జించకూడదు. వాళ్ల దగ్గర అప్పుగా కూడా సహాయాన్ని తీసుకోకూడదు. ఒక వేల అలాంటి వాళ్ల దగ్గర సహాయం తీసుకుంటే అక్రమ సంబంధం వుందనే అనుమానం ఇతరులకు వచ్చే అవకాశం వుంది. బయట ఆడవాళ్లు వీళ్ల దగ్గర సహాయం తీసుకున్న మంచిగా వున్న ఆడవారికి చెడ్డపేరు వస్తుంది. మంచిగా వున్న ఆడవాళ్లకి వ్యభిచారులతో సంబంధం వుందేమోనని కొందరు అనుకునే అవకాశం వుంది. వ్యభిచారం చేసే వారితో సహవాసం చేసినా మన జీవితం కష్టాలపాలౌతుంది.
గర్విష్టులైన దాయాదుల వద్ద కూడా సహాయం అడగవద్దని శాస్త్రం చెబుతోంది. వారి మనకు సహాయం చేసినా అందరికీ చెప్పుకుంటారు. సహాయం అడిగిన వారిపై వీరు తప్పుడు ప్రచారాలను చేస్తారు. ఆకలితోనైనా వుండవచ్చు కానీ గర్విష్టులైన దాయాదులను సహాయం అడగవద్దు.
తాగుబోతుల వద్ద చేయి చాచి అడగవద్దు. తాగుబోతుల నుంచి కూడా సహాయం తీసుకోవద్దు. తాగుబోతులను సహాయం అడిగితే మన గురించి అందరి దగ్గరా వాగేస్తుంటారు. తాగుబోతులను నమ్మడం, వారిని సహాయం అడగడం అంత మంచిది కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఈ ఐదు మంది దగ్గర అస్సలు సహాయం అడగవద్దు.



Click it and Unblock the Notifications