Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హిందూ శాస్త్రం ప్రకారం.. ఇలాంటి ఆడవారిని వివాహం చేసుకోవద్దు..!
హిందూ శాస్త్రం ప్రకారం పెళ్లి చేసుకునే ముందు లేదా పెళ్లి సంబంధానికి వెళ్లే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కారణాలు వుంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని శాస్త్రం చెబుతోంది. పండితులు చెప్పిన ఆ విషయాలు ఏంటి. ఏ కారణాలు వుంటే అమ్మాయిని ఇంటి కోడలిగా తెచ్చుకోవద్దో తెలుసుకుందాం.
శాస్త్రం ప్రకారం ఈ లక్షణాలు, పరిస్థితులు వున్న అమ్మాయిన కోడలిగా తెచ్చుకోవద్దు
శాస్త్రంలో వున్న విషయాలనే పండితులు చెబుతున్నారు. ఆడపిల్లను ఇంటి కోడలిగా తెచ్చుకునేటప్పుడు కొన్ని స్థితులను బట్టి చూసి అ లక్షణాలు వుంటే ఆడపిల్లను ఇంటి కోడలిగా తెచ్చుకోవద్దని శాస్త్రం చెబుతోంది. ఆడపిల్ల వారి ఇంట్లో ఉన్నాదం వుంటే అలాంటి ఇంటి నుంచి ఆడపిల్లను తెచ్చుకోవద్దని అంటున్నారు. ఇలా చేయడం వల్ల కొడుకు, వంశం రెండూ పాడైపోతాయ్.
ఈశ్వరుడు కూడా వద్దని చెప్పే కొన్ని సంకేతాలు వుంటాయ్. అలా సంకేతాలు వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయిని తెచ్చుకోవద్దని శాస్త్రం చెబుతోంది. వరుడు తండ్రి పిల్ల ఇంటికి వెళ్లినప్పుడు ఆ అమ్మాయి నిద్రపోతూ వుంటే ఆమెను కోడలిగా తెచ్చకోవద్దని శాస్త్రం చెబుతోంది. ఇంట్లో లేకుండా ఎక్కడికైనా వెళ్లినా, మగపిల్లలతో ఎక్కువ స్నేహం చేసినా అటువంటి ఆడపిల్లలను ఇంటికి కోడలిగా తెచ్చుకోవద్దు.
అత్తవారింట్లో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా అయినా వున్నదా లేదా అని చూసుకోవాలని శాస్త్రం చెబుతోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడవలసి వుంటుందని పండితులు చెబుతున్నారు. మర్యాదలు, పద్ధతులు పాటించే వంశమా లేదా అని కూడా చూసుకోవాలని శాస్త్రం చెబుతోంది.
పెళ్లి సంబంధానికి వెళ్లినప్పుడు ఎవ్వరికి అమ్మాయి ఎలా వున్నా వివాహం చేసుకునే వ్యక్తికి అమయిని చూడగానే మనసు రంజింపజేయాలి. అలా వున్నప్పుడు ముందుకు వెళ్లమని శాస్త్రం చెబుతోంది.

అబ్బాయి వయసుకన్న అమ్మాయి వయసు తక్కువగా వుండాలి. అబ్బాయికన్న అమ్మాయికి బుద్ధి బలం 23 రెట్లు ఎక్కవని శాస్త్రం చెబుతోంది. కాబట్టి అమ్మాయి వయసు తక్కువగా వుంటే ఇద్దరూ అన్యోన్యంగా వుంటూ కాపురం బాగా సాగుతుందని పండితులు చెబుతున్నారు.
ఇక చాణక్యుడు చెప్నిన విషయాలను గమనిస్తే. పూజలు, వ్రతాలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలిసిన, వాటిని పాటించే అమ్మాయిని చేసుకుంటే పండగలు, శుభకార్యాల సమయంలో ఇళ్లు కళకళలాడుతూ వుంటుంది. కాబట్టి దైవ భక్తి లేని అమ్మాయిని అస్సలు వివాహం చేసుకోవద్దని అంటాడు.
అత్యాశ కలిగిన స్త్రీలకు కూడా దూరంగా వుండాలని చాణ్యకుడు చెబుతున్నారు. ఇలాంటి మహిళలు తమ స్వార్ధం కోసం ఎంతకైనా తెగిస్తారని, తమ సంతోషం కోసం ఎన్ని అబద్ధాలనైనా ఆడుతారని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు.
బద్దకం కలిగిన అమ్మాయిని కూడా కోడలిగా తెచ్చుకోవద్దని హిందూ శాస్త్రం చెబుతోంది. అలాంటి స్త్రీలను చేసుకుంటే సుఖమపమని, ఏది కావాలన్నా వారు చేయడానికి ముందుకురారని చాణక్యుడు చెబుతున్నాడు.
చిన్న చిన్న విషయాలకు కూడా గొడవపడే అమ్మాయిలను వివాహం చేసుకోవద్దని శాస్త్రం చెబుతోంది. మర్యాద లేని మనస్తత్వం కలిగిన అమ్మాయి వల్ల ఎప్పుడూ గొడవలు జరుగుతాయని, దీని వల్ల భర్త జీవితంలో సంతోషం లేకుండా వుంటుందని శాస్త్రం చెబుతోంది.
అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే స్త్రీని కూడా కోడలిగా తెచ్చుకోవద్దని చాణక్యుడు హెచ్చరిస్తున్నాడు. అమ్మాయి ఎంత అందంగా వున్నా మంచి కుటుంబానికి చెందినది కాకపోతే అలాంటి స్త్రీని వివాహం చేసుకోవద్దని చాణక్యుడు చెబుతున్నాడు.



Click it and Unblock the Notifications