Latest Updates
-
బ్రేకప్ అయినా జ్ఞాపకాలతో తీరని వేదన.. మాజీ లవర్‌ను మరిచిపోవడం ఎలా.? -
ప్రొటీన్స్, ఫైబర్ గని..మీ పొట్టను కరిగించే గ్రీన్ దోశ..ఎలా చేసుకోవాలంటే -
ఎదిగే పిల్లల కోసం చింతాకు పప్పు.. రాయలసీమ స్టైల్లో ఇలా చేస్తే వావ్ అవ్వాల్సిందే.! -
ఈ ఆయిల్‌తో మసాజ్ చేస్తే నెల రోజుల్లోనే చిక్కటి కనుబొమ్మలు మీ సొంతం.! -
ఫ్యాట్ తక్కువ, ఎనర్జీ ఎక్కువ.. గుంటూరు స్పెషల్ వంకాయ ఇగురు పప్పు.! -
ఎండలో ఫేస్ ట్యాన్ అవుతుందా?.. ఈ నాలుగు పప్పులతో మెరిసే చర్మం మీ సొంతం.! -
శని గ్రహంశాపమా, వరమా? -
ఎలాంటి సాస్‌లు లేకుండా గోబీ 65.. ఇలా చేస్తే ఇక స్ట్రీట్ ఫుడ్ జోలికే వెళ్లరు.! -
చిన్న అబద్ధాలు నమ్మకాన్ని ఎలా నెమ్మదిగా కూల్చేస్తున్నాయి -
రామ్ చరణ్ ఫేవరెట్ ఇదే..చేపల పులుసు ఇలా చేస్తే తిరుగులేని టేస్ట్!
హ్యాపీ భోగి 2026..ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు ఇలా విషెస్ చెప్పండి
మకర సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు 'భోగి'. కేవలం ఒక పండుగగానే కాకుండా, మన సంస్కృతిలో, జీవనశైలిలో భోగికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భోగి అంటేనే అనుభవించడం లేదా సుఖపడటం అని అర్థం. ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంట ఇంటికి చేరడంతో, రైతులు ఆనందంగా, లక్ష్మీకళతో తులతూగే సమయం ఇది.
భోగి రోజు తెల్లవారుజామునే లేచి వేసే భోగి మంటలు కేవలం చలిని పోగొట్టుకోవడానికి మాత్రమే కాదు. దీని వెనుక ఒక బలమైన తాత్విక చింతన ఉంది. ఇంట్లో ఉన్న పాత వస్తువులను, పనికిరాని చెక్కలను, పిడకలను అగ్నిదేవుడికి సమర్పిస్తారు. అంటే మనలోని బద్ధకాన్ని, పాత ఆలోచనలను, అజ్ఞానాన్ని, పీడలను తొలగించుకుని.. కొత్త ఉత్సాహంతో, కొత్త వెలుగులతో జీవించడానికి స్వాగతం పలకడమే ఈ మంటల పరమార్థం.

ఏడాది జనవరి 14న భోగి పండుగ జరుపుకుంటున్న సందర్భంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు ఆకట్టుకునే విషెస్ ఎలా పంపించాలో ఇక్కడ చూడండి.
భోగి విషెస్ ఇలా చెప్పండి
-మీ జీవితంలోని చీకట్లన్నీ భోగి మంటల్లో కాలి బూడిదై, మీ ఇంట కొత్త వెలుగులు ప్రసరించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు 2026 భోగి శుభాకాంక్షలు.
-చెడును త్యజించి, మంచిని స్వీకరించడమే భోగి అంతరార్థం. ఈ భోగి మీ ఇంట సిరిసంపదలు కురిపించాలని ఆశిస్తూ.. భోగి పండుగ శుభాకాంక్షలు.
-భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాల సంక్రాంతి, కమ్మని కనుమ..ఈ పండుగలు మీ ఇంట ఆనందాల పంటలు పండించాలని కోరుకుంటూ..హ్యాపీ భోగి 2026.
-భోగి మంటల వెచ్చదనం, రంగవల్లుల అందం, గొబ్బెమ్మల వైభవం.. అన్నీ కలిసి మీ జీవితాన్ని ఆనందమయం చేయాలి. భోగి శుభాకాంక్షలు.
-ఈ 2026 భోగి పర్వదినాన.. మీ కష్టాలన్నీ మంటల్లో కాలిపోవాలని, సుఖసంతోషాలు మీ సొంతం కావాలని కోరుకుంటున్నాను.
-ఇంటి ముందు రంగుల ముగ్గులు, ఇల్లంతా పండుగ నవ్వులు. భోగి పండుగ తెచ్చే మీకు సకల భోగభాగ్యాలు.
-మనస్పర్ధలు, ద్వేషాలు భోగి మంటల్లో వేసేద్దాం..ప్రేమ, ఆప్యాయతలను గుండెల్లో నింపుకుందాం. అందరికీ భోగి శుభాకాంక్షలు.
-సూర్య భగవానుని ఆశీస్సులతో, ఈ భోగి మీ జీవితంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలకాలి. శుభ భోగి.
-ధన, ధాన్య, పశు, క్షేత్ర లాభాలతో మీ ఇల్లు కళకళలాడాలని కోరుకుంటూ.. మీకు భోగి పండుగ శుభాకాంక్షలు.
-గంగిరెద్దుల సవ్వడి, హరిదాసుల కోలాహలం.. తెలుగు లోగిట మొదలయ్యింది సంక్రాంతి సంబరం. ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు.
-పాత ఆలోచనలను కాల్చేద్దాం, కొత్త ఆశయాలకు ఊపిరి పోద్దాం. ఈ భోగి మీకు విజయాన్ని చేకూర్చాలి.
-2026 భోగి మంట సాక్షిగా.. మీ లక్ష్యాల వైపు అడుగులు వేయండి, విజయాలు మీ సొంతం చేసుకోండి.
-నిరాశను భోగి మంటల్లో వేయండి, ఆశను మీ శ్వాసగా మార్చుకోండి. హ్యాపీ భోగి.
-గడిచిన కాలం జ్ఞాపకం, రాబోయే కాలం స్వాగతం. ఈ భోగి మీకు తెవాలి అంతులేని సంతోషం.
-చలిని తరిమే భోగి మంటలా.. మీలోని బద్ధకాన్ని, భయాన్ని తరిమికొట్టండి. మీకు మీ కుటుంబానికి భోగి శుభాకాంక్షలు.
-ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభానికి నాంది. పాత సంవత్సరపు బాధలను మరిచి, కొత్త ఉత్సాహంతో ముందుకెళ్దాం. భోగి శుభాకాంక్షలు.
-మీలోని ప్రతికూల ఆలోచనలన్నీ భోగి మంటల్లో ఆహుతైపోవాలి..సానుకూల దృక్పథంతో ఈ ఏడాది సాగాలి.
-భోగి అంటే మార్పు.. భోగి అంటే గెలుపు.. ఈ పండుగ మీకు మంచి మార్పును, గొప్ప గెలుపును ఇవ్వాలి.
-చిన్నారులకు భోగి పళ్ళు, పెద్దలకు గౌరవ మర్యాదలు.. మన తెలుగు వారి సంప్రదాయాలు. అందరికీ భోగి శుభాకాంక్షలు.
-రేగుపళ్ళతో రత్నాల్లాంటి పిల్లలని ఆశీర్వదిద్దాం. చిన్నారులందరికీ భోగి శుభాకాంక్షలు.

-తీపి జ్ఞాపకాలు, కమ్మని మాటలు.. ఈ భోగి మీ కుటుంబంలో నింపాలి నవ్వుల పువ్వులు.
-బంధుమిత్రుల రాకతో, పిండివంటల ఘుమఘుమలతో మీ ఇల్లు స్వర్గధామం కావాలి. భోగి శుభాకాంక్షలు.
-దూరంగా ఉన్నా మనసు దగ్గరగా.. విదేశాల్లో ఉన్నా మన సంస్కృతికి దగ్గరగా.. ఎన్నారై మిత్రులకు భోగి శుభాకాంక్షలు.
-అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అందరూ కలిసి ఆనందంగా గడిపే పండుగ ఇది.
-భోగి మంటలు.. చలి గంటలు.. సంక్రాంతి పంటలు.. మీ ఇంట సిరి గంటలు..హ్యాపీ భోగి.
-పాత సామాన్లకే కాదు.. పాత గొడవలకి కూడా గుడ్ బై చెప్పేద్దాం.. ఈ భోగికి వెల్కమ్ చెబుదాం.
-భోగి మంటల వెలుగు.. మన తెలుగు వారి వెలుగు.. జగమంతటా నిలవాలి మన తెలుగు వెలుగు.
-రేగుపళ్లు తలపై పోస్తే.. నరదిష్టి పారిపోద్ది. భోగి మంట వేస్తే.. దరిద్రం వదిలిపోద్ది. హ్యాపీ భోగి.
-డూడూ బసవన్నల దీవెనలు.. హరిదాసుల కీర్తనలు.. మీకు అందించాలి సకల శుభాలు. హ్యాపీ భోగి.
-మీకు, మీ కుటుంబానికి భోగ భాగ్యాలు కలగాలని కోరుకుంటూ.. హ్యాపీ భోగి.



Click it and Unblock the Notifications