Latest Updates
-
ఇతరుల ప్రేమను చూసి మొదలైన పోలికలు.. చివరకు బంధాలను ఎలా కూల్చేస్తున్నాయి -
గోంగూర రొయ్యల కూరను ఇంట్లోనే అచ్చం హోటల్ రుచితో ఇలా చేసుకోండి.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు! -
పెళ్లై ఏళ్లు గడిచినా పాత ప్రేమ మర్చిపోలేకపోతున్నారా? ఇందులో తప్పేం లేదు కానీ జాగ్రత్త -
పిజ్జా, బర్గర్లు దీని ముందు పరార్.. నోట్లో ఇట్టే కరిగిపోయేలా ఆలూతో ఎగ్ బజ్జీ.! -
కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి? మీ జీవితంలో జరిగేదంతా దీనివల్లేనని శాస్త్రాలు చెబుతున్నాయా? -
వెజ్ లవర్స్ కోసం సోయాతో టిక్కా మసాలా.. వీటిని యాడ్ చేస్తే వేరే లెవెల్ టేస్ట్.! -
ఈ ట్రెడిషనల్ ఫ్యామిలీ రెసిపీతో పనీర్ పరాఠా ఇలా చేస్తే.. ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు! -
జూన్ 2, 2026: ఈ రాశుల వారికి ధన యోగం.. అదృష్టం తలుపు తడుతోంది, సిద్ధంగా ఉండండి! -
అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, కెరీర్లో ఊహించని సక్సెస్ మీదే! -
గణపతి అష్టోత్తర శతనామావళి మహిమ తెలుసా? ఈ 108 పేర్లు జపిస్తే విఘ్నాలు తొలిగిపోతాయి
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి!
ఒకప్పుడు ఇంటి గడప దాటని ఆడబిడ్డ.. నేడు అంతరిక్షంలో ఆత్మవిశ్వాసంతో అడుగుపెడుతోంది. అమ్మగా ప్రాణం పోస్తుంది.. భార్యగా సగభాగం పంచుకుంటుంది.. సోదరిగా అండగా నిలుస్తుంది.. కూతురిగా ఇంట మహాలక్ష్మిలా వెలుగుతుంది. సృష్టిలో ఆమె పోషించని పాత్ర లేదు, ఆమె స్పృశించని రంగం లేదు.
ఆకాశంలో సగం అంటారు కానీ, నిజానికి ఈ భూఖండం నిలబడి ఉన్నదే ఆమె సహనం మీద. అలాంటి అద్భుతమైన సృష్టికి నీరాజనాలు పలికే రోజే అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8). ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకునే మార్చి 8.. క్యాలెండర్ లో కేవలం ఒక తేదీ మాత్రమే కాదు. అది మహిళలు తమ హక్కుల కోసం, సమానత్వం కోసం, ఓటు హక్కు కోసం చేసిన సుదీర్ఘ పోరాటానికి సజీవ సాక్ష్యం.

ఏటా ఒక్కో థీమ్ తో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2026కు సంబంధించి "Give To Gain" అనే థీమ్ తో జరుపుకుంటారు. మహిళల పట్ల ఔదార్యం చూపడం, వారికి సరైన మార్గదర్శకత్వం వహించడం, వనరులను పంచుకోవడం ద్వారా లింగ సమానత్వాన్ని మరింత వేగవంతం చేయడమే ఈ క్యాంపెయిన్ ప్రధాన ఉద్దేశం.
ఆదివారం(మార్చి 8)అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ చుట్టూ ఉన్న మహిళలకు, తల్లులకు, సోదరీమణులకు, స్నేహితురాళ్లకు విషెస్ ని ఎలా అందంగా చెప్పాలో ఇక్కడ చూడండి.
సాధారణ ఉమెన్స్ డే విషెస్ ఇలా చెప్పండి
-సృష్టికి మూలం, జీవానికి ఆధారం..ఈ ప్రపంచాన్ని నడిపించే అద్భుత శక్తి మహిళ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
-ఓటమిని అంగీకరించని ధైర్యం, కన్నీటిని దాచుకునే గంభీరం మహిళ సొంతం. హ్యాపీ ఉమెన్స్ డే 2026.
-పదిమందికి వెలుగునిచ్చే సూర్యుడికైనా, పుట్టుకనిచ్చేది ఓ మాతృమూర్తే. మహిళలకు వందనం.
-ఇంటిని స్వర్గంగా మార్చే నైపుణ్యం, దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే నాయకత్వం మహిళదే. 2026 మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
-నీ అడుగులో అడుగులేస్తేనే సమాజం ముందుకెళ్తుంది. నీవు లేనిదే సృష్టి లేదు. హ్యాపీ ఉమెన్స్ డే 2026.
-ప్రతి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అంటారు..కానీ నేటి మహిళ ఆ విజయానికి ముందు నిలబడుతోంది.
-భరిస్తే భూదేవి, అడ్డుకుంటే కాళిక... మహిళ అబల కాదు, సకల కళా సబల. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
-కరుణకు మారుపేరు, త్యాగానికి చిరునామా..ప్రపంచంలోని ప్రతి మహిళకూ పాదాభివందనం. హ్యాపీ ఉమెన్స్ డే 2026.
-నింగిలోని తారలకంటే, నీ కళ్లలోని ఆత్మవిశ్వాసం ఎంతో ప్రకాశవంతమైనది. హ్యాపీ ఉమెన్స్ డే.
-కష్టాలను చిరునవ్వుతో జయించే అద్భుతమైన మంత్రం తెలిసిన ఏకైక ప్రాణి మహిళ. హ్యాపీ ఉమెన్స్ డే 2026.
-ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న నేటి మహిళామణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
-ఒక మహిళ తనను తాను నమ్మితే, ప్రపంచాన్నే శాసించగలదు. ఉమెన్స్ డే శుభాకాంక్షలు.
-నీ సహనానికి హద్దు లేదు, నీ ప్రేమకు వెల కట్టలేము. హ్యాపీ ఉమెన్స్ డే.
-నువ్వు కేవలం ఒక ఇల్లాలివి మాత్రమే కాదు, రేపటి తరానికి మార్గదర్శివి. హ్యాపీ ఉమెన్స్ డే.
-చదువుకున్న మహిళ... ఇంటికే కాదు, ఈ దేశానికే వెలుగు. హ్యాపీ ఉమెన్స్ డే.

కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఇలా చెప్పండి
-నా ప్రాణం, నా సర్వస్వం అయిన నా కన్నతల్లికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
-నా సగభాగం మాత్రమే కాదు, నా జీవితానికి అర్థం నేర్పిన నా ధర్మపత్నికి హ్యాపీ ఉమెన్స్ డే.
-నా కష్టసుఖాల్లో తోడుంటూ, నాపై ఎప్పటికీ ప్రేమను కురిపించే నా ప్రియమైన సోదరికి శుభాకాంక్షలు.
-నా ఇంట వెలిసిన మహాలక్ష్మికి, నా భవిష్యత్తు ఆశకు..హ్యాపీ ఉమెన్స్ డే నా చిట్టితల్లి.
-నా ప్రతి అడుగులో అండగా నిలిచిన నా బెస్ట్ ఫ్రెండ్ కు ఉమెన్స్ డే శుభాకాంక్షలు.
-అమ్మగా అనురాగం, భార్యగా భాగస్వామ్యం, అక్కగా అండ..ఇలా నా జీవితంలో ప్రతి పాత్రను పోషిస్తున్న మహిళలందరికీ వందనాలు.
-నా జీవితంలో ఆనందాన్ని నింపిన ప్రతి అద్భుతమైన మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
-నువ్వు నా జీవితంలో ఉండటం నా అదృష్టం. హ్యాపీ ఉమెన్స్ డే మై డియర్.
-ఏ బంధంలోనైనా ప్రాణం పోసేది మహిళే. నా కుటుంబంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు.
-నీ ప్రేమ, నీ త్యాగం వెలకట్టలేనివి. థ్యాంక్ యు ఫర్ ఎవ్రీథింగ్. హ్యాపీ ఉమెన్స్ డే.
-నీ చిరునవ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నా ప్రియమైన స్నేహితురాలికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
-నా విజయానికి పునాది వేసిన నా కుటుంబంలోని ప్రతి మహిళకు కృతజ్ఞతలు.
-బాధ్యతలను మోస్తూ కూడా ముఖంలో చిరునవ్వు చెరగని నా కన్నతల్లికి పాదాభివందనం.
-ప్రేమ, క్షమ, సహనం..ఈ మూడు పదాలకు నిజమైన అర్థం నా భార్య. హ్యాపీ ఉమెన్స్ డే.
అందమైన కోట్స్
-మహిళలు సమాజానికి కేవలం సగం కాదు, సమాజాన్ని నడిపించే పూర్తి బలం.
-మహిళలను పూజించడం కాదు, వారిని గౌరవించడం నేర్చుకో.
-ఒక దేశం అభివృద్ధి చెందాలంటే, ముందుగా ఆ దేశంలోని మహిళలకు స్వేచ్ఛ ఉండాలి.
-ఆడపిల్ల పుట్టిందని బాధపడకు... ఆమే నీకు రేపటి భవిష్యత్తును ఇస్తుందని గర్వపడు.
-మహిళల పట్ల ఏ సమాజం గౌరవంగా ఉంటుందో, ఆ సమాజం అత్యున్నత శిఖరాలను చేరుకుంటుంది.
-శరీర బలం కన్నా, మానసిక బలం గొప్పది. ఆ విషయంలో మహిళను మించిన వారు లేరు.
-సృష్టిలోకెల్లా అత్యంత సున్నితమైనది, అత్యంత కఠినమైనది మహిళ మనసే.
-మహిళ హక్కుల కోసం పోరాడటం అంటే, మానవ హక్కుల కోసం పోరాడటమే.
-అందమైన ముఖం కంటే, ఆత్మవిశ్వాసం ఉన్న మహిళకే ప్రపంచం తలవంచుతుంది.
-మహిళ ఎదుగుదలను అడ్డుకోవడం అంటే, సృష్టి గమనాన్ని ఆపడమే.
-ఒక మగవాడికి చదువు చెబితే ఒక వ్యక్తికే పరిమితం, అదే ఒక మహిళకు చదువు చెబితే ఒక కుటుంబానికి, దేశానికి వెలుగు.
వాట్సాప్ స్టేటస్ లో పెట్టేందుకు
-వనిత లేనిదే లోకం లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
-సృష్టికి మూలం మహిళ. ప్రతీ మహిళకు హ్యాపీ ఉమెన్స్ డే.
-నా తోటి మహిళలందరికీ శుభాకాంక్షలు.
-ఆడజన్మ ఓ వరం. ప్రపంచంలోని మహిళలందరికీ వందనాలు.
-కన్నీటిని జయించి ముందుకు సాగుతున్న ప్రతి మహిళకూ సెల్యూట్.
-సకల గుణ సంపన్నురాలికి, అపర అన్నపూర్ణకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు.
-ఏ ఆటంకాలు ఎదురైనా గెలుపు వైపు అడుగులేస్తున్న మహిళలకు శుభాకాంక్షలు.
-అబల కాదు ఆమె అనంత శక్తి... అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.



Click it and Unblock the Notifications