Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
మీ బాస్ టార్చర్ పెడుతున్నారా? ఈ షాకింగ్ విషయాలు తెలుసుకొని ఇలా తప్పించుకోండి
ఆఫీసుల్లో పనిచేసే చాలామంది ఉద్యోగులు వారికే తెలియని అనేక మానసిక సమస్యలతో బాధపడుతుంటారు. సాధారణంగా మనం పనిచేసే ప్రదేశం మన మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. రోజులో 9 గంటల సమయం పాటు ఆఫీసుల్లో ఉద్యోగులు పనిచేస్తుంటారు. మరికొందరు అయితే 12 గంటలు కూడా పని చేస్తుంటారు. అంటే రోజులో బెస్ట్ పార్ట్ అంతా ఆఫీసులో పనికే కేటాయిస్తున్నారు. అలాంటప్పుడు ఆఫీసు వాతావరణం వారికి సహకరించకపోయినా, బాస్ సపోర్టివ్ గా లేకున్నా అది ఉద్యోగుల మానసిక సంతోషంపై దీర్ఘకాలం పాటు తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
ఆఫీసులో బాస్ లో బహిరంగంగా విమర్శించడం,అసమంజసమైన డిమాండ్లు వంటివి.. ఉద్యోగుల ఒత్తిడి, ఆందోళనను పెంచడానికి దారి తీస్తుంది. టార్చర్ పెట్టే బాస్ లు, ఒత్తిడితో కూడిన వాతావరణ పరిస్థితులు మన సామర్థ్యాలను, మన భవిష్యత్తు సంబంధాలను కూడా మార్చగలవు. దీని ఎఫెక్ట్ చాలా ఏళ్ల పాటు ఉంటుంది. అయితే బాస్ వల్లనో,ఇతరుల వల్లనో మీకు ఆఫీస్ లో ఇబ్బందులు ఉంటే జాబ్ మానేసి వెళ్లిపోతే బెటర్ అనుకుంటారు చాలామంది. అయితే అలా వెళ్లినా కూడా చాలా కాలం పాటు ఆ ఆఫీస్ వాతావరణం మీ మానసిక స్థితిపై ప్రభావం చూపెడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని నుంచి బయటపడటానికి ప్రత్యామ్నాయం ఉందని నిపుణులు చెబుతున్నారు.

శాడిస్ట్ బాస్ కింద పనిచేసిన తర్వాత ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం సవాలుతో కూడుకున్నదే కానీ సాధ్యమే. ఇది స్వీయ ప్రతిబింబంతో ప్రారంభమవుతుంది. ఆత్మగౌరవాన్ని పునర్నిర్మించడం అంటే మీ విజయాలు, బలాలపై దృష్టి పెట్టడం, పాజిటివ్ ఉప బలాలను అందించగల సహోద్యోగులు లేదా సలహాదారుల నుండి అభిప్రాయాన్ని కోరడం, చిన్న,సాధించగల లక్ష్యాలను నిర్దేశించడం వంటివి కలిగి ఉండవచ్చు. అలా చేయడానికి గత విజయాలు, సూక్ష్మ విజయాలపై దృష్టి పెట్టాలి.
అలాగే ఒత్తిడి లేని వాతావరణంలో కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోండి. గత అనుభవాల ద్వారా మీ వర్క్ లో ఎవరూ వేలు పెట్టలేని విధమైన నైపుణ్యాలను సృష్టించుకోండి. అదేవిధంగా మీ చుట్టూ ఆరోగ్యకరమైన ప్రొఫెషనల్ రిలేషన్ షిప్స్ మీ చుట్టూ ఉండేలా చూసుకోండి. ఈ కనెక్షన్‌లు భవిష్యత్ లో చాలా ఉపయోగపడతాయి. ఒక వ్యక్తి లేదా పని వాతావరణం మిమ్మల్ని విచ్చిన్నం చేసినట్లయితే.. మీ వర్త్(విలువ) గుర్తుంచుకోండి. భవిష్యత్తులో దాని కోసం నిలబడండి.



Click it and Unblock the Notifications