Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
Karnataka Polls 2023: కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన మహిళా ఎమ్మెల్యేలు వీరే
మహిళలు ప్రతి రంగంలోనూ సత్తా చాటుతున్నారు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు పొందుతున్నారు. అయితే రాజకీయాల్లో మాత్రం మహిళల స్థానం ఇప్పటికీ నామమాత్రమే. చెప్పుకోదగ్గ స్థానాల్లో పోటీ కూడా చేయలేని పరిస్థితి. గెలుపోటముల గురించి పక్కన పెడితే కనీసం పోటీలో కూడా ఉండటం లేదు. తాజాగా జరిగిన కర్ణాటకలోనూ కేవలం పదుల సంఖ్యలోనే మహిళలు పోటీ చేస్తూ విజయం సాధిస్తున్నారు.
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 11 మంది మహిళలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వారి పేర్లు, నియోజవర్గం, ఏ పార్టీ నుండి పోటీ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. జొల్లే శశికళ అన్నాసాహెబ్:
జొల్లే శశికళ అన్నాసాహెబ్ నిప్పాని నియోజకవర్గం నుండి గెలుపొందారు. బీజేపీ తరఫున పోటీ చేసిన జొల్లే శశికళ అన్నాసాహెబ్ 72,952 ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. జొల్లే శశికళ గత ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. తన సిట్టింగ్ స్థానాన్ని మరోసారి దక్కించుకున్నారు.
2. మంజులా.ఎస్:
మంజులా.ఎస్ మహదేవపురా నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మంజులా.ఎస్.. లక్షా 61 వేలకు పైగా ఓట్లు సాధించి విజయం సాధించారు.
3. భగీరథి మురుల్యా:
భగీరథి మురుల్యా సులియా నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ మహిళా రైతు ఈ ఎన్నికల్లో 67 వేలకు పైగా ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ తరఫున పోటీ చేసి శాసనసభకు వెళ్లనున్నారు.
4. రూప కళ ఎమ్:
రూప కళ.ఎం కోలార్ గోల్డ్ ఫీల్డ్ నియోజవర్గం నుండి పోటీ చేశారు. కాంగ్రెస్ తరఫున ఎన్నికల బరిలో నిలిచిం రూప కళ.. 81 వేలకు పైగా ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి అయిన రూపకళ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకున్నారు.
5. కనీజ్ ఫాతిమా:
కనీజ్ ఫాతిమా ఉత్తర గుల్బార్గా స్థానం నుండి పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి 80 వేలకు పైగా ఓట్లు సాధించి విజయం సాధించారు. తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకున్నారు.
6. లతా మల్లిఖార్జున్:
లతా మల్లిఖార్జున్ హరపనపల్లి నియోజవర్గం నుండి గెలుపొందిన స్వతంత్ర్య అభ్యర్థి. 70 వేలకు పైగా ఓట్లు సాధించి ఎమ్మెల్యే గెలిచారు.
7. లక్ష్మీ ఆర్. హెబ్బాల్కర్:
లక్ష్మీ ఆర్. హెబ్బాల్కర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బెల్గామ్(రూరల్) నియోజవర్గ స్థానం నుండి పోటీ చేశారు. 78 వేలకు పైగా ఓట్లు సాధించి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకున్నారు.
8. సౌమ్య రెడ్డి:
జయనగర్ నియోజవర్గానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు సౌమ్య రెడ్డి. అయితే మొదట సౌమ్య రెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. 294 ఓట్ల మెజారిటీ సాధించినట్లు ప్రకటించారు. పోస్టల్ బ్యాలెట్లపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోసారి లెక్కించగా.. కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్య కంటే బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తికి 16 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అలా జయనగర్ లో బీజేపీ అభ్యర్థి సీకే రామమూర్తి ఎన్నికయ్యారు.
9. నయన మోతమ్మ:
నయన మోతమ్మ ముదిగెరె స్థానం నుండి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన నయన.. 21 వేలకు పైగా ఓట్లు సాధించి విజయబావుటా ఎగురవేశారు.
10. శారదా పూర్యనాయక్:
షిమోగా రూరల్ స్థానం నుండి జేడీఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. 48 వేలకు పైగా ఓట్లు సాధించి ఈ ఎన్నికల్లో విజయం సాధించారు.
11. కారెమ్మ:
దేవదుర్గ నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు కారెమ్మ. జేడీఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన కారెమ్మ 61 శాతానికి పైగా ఓట్లు సాధించి గెలుపొందారు.



Click it and Unblock the Notifications
