Latest Updates
-
ఆవకాయ, నిమ్మకాయ బోర్ కొట్టిందా? అయితే ఈ వెరైటీ బంగాళదుంప ఊరగాయ ట్రై చేయండి! -
మైదా లేకుండా సమోసాలను మించిన రుచితో ఉల్లి కచోరీ.. ఇలా చేస్తే ఎన్ని తిన్నా బోర్ కొట్టదు.! -
సాయంత్రం వేళ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించాలి?అష్టైశ్వర్యాలు తెచ్చే అద్భుతమైన మార్గం.. -
చేతి గోళ్లు ఇలా ఉంటే కిడ్నీల ఆరోగ్యానికి వార్నింగ్.. మీకూ ఇలా ఉందా.? -
ఈ పద్ధతిలో అల్లం చట్నీ చేస్తే.. ఎవరైనా సరే నాలుగు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి సొరకాయ దోశ..అప్పటికప్పుడు ఈజీగా చేసుకోండిలా.. -
మంచి భర్త కోసం ఉపవాసం చేస్తున్నారా.. కానీ శివారాధనలో అమ్మాయిలు చేసే పొరపాట్లు ఇవే.! -
కుజ- చంద్రుల కలయికతో మహాలక్ష్మి రాజయోగం.. ఎనలేని సంపద సిద్ధించే ఈ రాశుల్లో మీరు ఉన్నారా.! -
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.!
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి?
మన శరీరానికి అవసరమైన ఐరన్, ప్రోటీన్లు, క్యాల్షియం, పొటాషియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లను ఆకు కూరలు, తాజా కూరగాయలు సమృద్ధిగా అందిస్తాయి. అయితే మనం ఆరోగ్యానికి మేలు చేస్తాయని కొంటున్న కూరగాయలు కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో లాభాల కోసం కొందరు వ్యాపారులు పచ్చని కూరగాయల వెనుక విషపూరిత రసాయనాలను దాచి విక్రయిస్తున్నారు.

త్వరగా పెరగడానికి, ఫ్రెష్ గా నిగనిగలాడుతూ కనిపించడానికి ప్రమాదకరమైన పురుగుమందులు, రంగులు వాడుతున్నారు. ఇలాంటి వాటిని తింటే ఆరోగ్యం సంగతి దేవుడెరుగు, రోగాల బారిన పడటం ఖాయం. మరి ఈ రసాయనపు కూరగాయలను ఎలా గుర్తించాలో ఇక్కడ చూడండి.
రసాయనాలు ఉన్న కూరగాయలను గుర్తించే సింపుల్ చిట్కాలు
అతిగా మెరుస్తున్నాయా? అప్రమత్తం అవ్వండి: టమాటా, క్యాప్సికమ్, వంకాయ, ఆపిల్స్, దోసకాయ వంటివి సహజత్వానికి విరుద్ధంగా, అతిగా మెరుస్తూ కనిపిస్తే వాటిని పక్కన పెట్టేయండి. అవి తాజాగా కనిపించడానికి వాటిపై వ్యాక్స్ (మైనం) లేదా ఇతర రసాయనాలతో పాలిష్ చేసి ఉండవచ్చు.
అన్నీ ఒకేలా ఉంటే అనుమానించాల్సిందే: సహజంగా పండే కూరగాయల రంగు, పరిమాణంలో కచ్చితంగా మార్పులు ఉంటాయి. కానీ బుట్టలో ఉన్న టమాటాలు, క్యాప్సికమ్ అన్నీ ఒకే సైజులో, ఒకే రంగులో అచ్చు గుద్దినట్టు ఉంటే వాటిని రసాయనాలతో పండించారని లేదా కెమికల్స్ వాడారని అర్థం చేసుకోండి.
సీజన్ కాని సీజన్‌లో వద్దు: ఏ కాలంలో పండే కూరగాయలు ఆ కాలంలోనే రుచిగా, ఆరోగ్యంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏడాది పొడవునా అన్నీ దొరుకుతున్నాయి. ఇలా ఆఫ్ సీజన్ లో వచ్చే కూరగాయలను నిల్వ చేయడానికి, పాడవకుండా ఉంచడానికి గ్రోత్ రెగ్యులేటర్స్ వాడుతారు. వీటిని ఎంచుకోకపోవడమే మంచిది.
అసాధారణ పరిమాణం ఉంటే ప్రమాదమే: సొరకాయ, బీరకాయ లేదా బెండకాయలు సాధారణం కంటే మరీ పెద్దవిగా కనిపిస్తే వాటి జోలికి వెళ్లకండి. వాటి సైజు పెంచడానికి హార్మోన్ ఇంజెక్షన్లు, అధిక ఎరువులు వాడటమే దీనికి కారణం.
వాడిపోకుండా రోజుల తరబడి ఉంటున్నాయా?: సహజంగా పండిన కూరగాయలు రెండు మూడు రోజుల్లోనే వాడిపోతాయి. కానీ మీరు తెచ్చిన కూరగాయలు రోజుల తరబడి అలాగే తాజాగా ఉంటున్నాయంటే, వాటిపై ప్రిజర్వేటివ్స్ లేదా మైనపు పూత ఉందని నిర్ధారించుకోవచ్చు.

చేతికి రంగు అంటుకుంటుందా?: కొన్ని కూరగాయలు కోసినప్పుడు లేదా కడిగినప్పుడు మీ చేతికి ఎరుపు, ఆకుపచ్చ, ఊదా రంగులు అంటుకుంటే, వాటికి కృత్రిమ రంగులు వేశారని అర్థం. వాటిని అస్సలు తినకండి.
రసాయనాల ప్రభావం తగ్గాలంటే ఇలా చేయండి
-కూరగాయలపై ఉన్న రసాయనాలు, పురుగుమందుల అవశేషాలు పోవాలంటే, వాటిని ఉప్పు లేదా కల్లుప్పు వేసిన నీటిలో అరగంట పాటు నానబెట్టండి. తర్వాత రెండు మూడు సార్లు శుభ్రమైన నీటితో కడగాలి.
-నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి, అందులో కూరగాయలను 15 నిమిషాలు ఉంచి కడగడం వల్ల చాలా వరకు కెమికల్స్ తొలగిపోతాయి.
-దోసకాయ, సొరకాయ, క్యారెట్, బీట్‌రూట్ వంటి వాటిని తప్పనిసరిగా పైన తొక్క తీసిన తర్వాతే వండుకోవాలి.
స్మార్ట్ షాపింగ్: కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి
ఎల్లప్పుడూ మీ చుట్టుపక్కల దొరికే, ఆయా సీజన్లలో పండే స్థానిక కూరగాయలకే ప్రాధాన్యం ఇవ్వండి. వీలైనంత వరకు సేంద్రియ (ఆర్గానిక్) పద్ధతుల్లో పండించినవి ఎంచుకోండి. అందం కోసం వెంపర్లాడకండి..అతిగా మెరిసే కూరగాయలకు దూరంగా ఉండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications