ఈ దీపావ‌ళికి మ‌ర్చిపోలేని ఫొటోలు దిగాలంటే...

By: sujeeth kumar
Subscribe to Boldsky

పండుగ కోలాహ‌లం మొద‌లైపోయింది. ఇప్ప‌టికే అంతా షాపింగ్‌ల‌క‌నీ, స్వీట్ షాపుల చుట్టూ తిరిగొచ్చి ఉండొచ్చు. ఇంటిని చ‌క్క‌గా అందంగా అలంక‌రించుకొని ఉంటారు. మంచి మంచి ఫొటోలు దిగి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట‌ర్ ల‌లో పెడుతూ ఉంటారు.

మ‌ధురమైన‌ క్ష‌ణాల‌ను తీపి గుర్తులుగా ప‌దిల‌ప‌ర్చుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌యం. మ‌న ప్రియ‌మైన వారితో క‌లిసి చూడ‌చ‌క్క‌ని ఫొటోలు దిగితే ఆ సంతోష‌మే వేరు. మంచి విజువ‌ల్స్‌, దీపాల కాంతులు చుట్టూ ఉంటాయి కాబ‌ట్టి మనం ఫొటోల్లో మ‌రింత అందంగా క‌నిపిస్తాం.

దీపావ‌ళి రోజు సుర్యాస్త‌మ‌యం త‌ర్వాత చ‌క్క‌నైన ఫొటోలు క్యాప్చ‌ర్ కావాలంటే కొంచెం క‌ష్టమే. స‌రైన గ్యాడ్జెట్ లేదా ఫొటో తీసే నైపుణ్యం లేక‌పోతే ఫ్యామిలీ ఫొటోల‌న్నీ మ‌బ్బుగా వ‌స్తాయి. దీపావ‌ళి ఆల్బ‌మ్ నిండా మ‌చ్చ‌లు మ‌చ్చ‌లుగా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

'అప్పో ఫోన్'కెమెరాకు ఫుల్ ఫిదా అయిపోతున్నయంగ్ స్టూడెంట్స్..!!

Let This Diwali Be Glittering And Picture Perfect

ఒప్పో ఎఫ్‌3

మ‌రి ఈ పండుగ‌కు అంద‌మైన ఫొటోలు మీ సొంతం కావాలంటే ఒప్పో ఎఫ్‌3 స‌రైన గ్యాడ్జెట్ ఫోన్‌. ఈ ఫోన్‌ స్టైలిష్‌గాను ఉంటుంది. రెడ్ క‌ల‌ర్ వేరియంట్ లో వ‌చ్చిన ఈ ఫోన్ దీపావ‌ళికి ప‌ర్‌ఫెక్ట్ మ్యాచ్ అని చెప్ప‌వ‌చ్చు.

ఒప్పో ఎఫ్‌3 రెడ్ క‌ల‌ర్ ఫోన్ కు డ్యుయ‌ల్ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. 16 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ను ఇవి క‌లిగి ఉండ‌డం విశేషం. ఫ్యామిలీ పోర్ట్‌రేయిట్‌ను తీయ‌డంలో ఈ ఫోన్ చాలా బాగా పనికొస్తుంది. అంతేకాదండోయ్‌! ఇన్ బిల్ట్ గా ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్ ఫీచ‌ర్‌, ఇంకా లైటింగ్ కి త‌గ్గ‌ట్టుగా ఫోక‌ల్ మోడ్‌ను మార్చుకోవ‌చ్చు కూడా.

Let This Diwali Be Glittering And Picture Perfect

ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజీతో ఈ ఫోన్ వ‌స్తోంది. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 128 జీబీ దాకా మెమ‌రీ సామ‌ర్థ్యాన్ని పెంచుకోవ‌చ్చు. కాబ‌ట్టి ఫొటోలు తీసేట‌ప్పుడు మెమ‌రీ గురించి చింతించాల్సిన ప‌నేలేదు.

ఎంత మంచి ఫోన్ ఉన్నా ఫొటోలు తీయ‌డం నిజంగా ఒక క‌ళే. దీపాల పండుగ‌నాడు ఒక ప్రొఫెష‌న‌ల్ ఫొటోగ్రాఫ‌ర్‌లా ఎలా ఫొటోల‌ను క్యాప్చ‌ర్ చేయ‌వ‌చ్చో మేము కొన్ని టిప్స్ చెబుతాం. మీ సోష‌ల్ మీడియా సైట్స్‌లో ఈ ఫొటోలు పంచుకొని మ‌రింత ఆనందించండి.

Let This Diwali Be Glittering And Picture Perfect

వెలుగుల దివ్వెల‌ను...

వెలుగులీనే దీప‌కాంతుల‌ను అద్భుత‌మైన చిత్రాలుగా తీసేందుకు మొత్తం ఫొటో బ్యాక్ గ్రౌండ్‌లో దీపాల వ‌రుస ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించేందుకు ఇలా చేయండి... ఫోన్‌ను నిల‌క‌డ‌గా ఉంచి ఫొటో తీయండి లేదా టైమ‌ర్ ఆప్ష‌న్ ఉంటే ఉప‌యోగించండి. దీని వ‌ల్ల ఫొటోలు బ్ల‌ర్ కాకుండా చ‌క్క‌గా వ‌స్తాయి. చీక‌ట్లోనూ ఫొటోలు బాగా రావాలంటే కెమెరాలో నైట్ మోడ్ ఆన్ చేసుకోండి.

Let This Diwali Be Glittering And Picture Perfect

ట‌పాసుల కాంతుల‌ను తీసేందుకు...

మిరిమిట్లు గొలిపే ట‌పాసుల కాంతుల‌ను చ‌క్క‌గా ఫొటోలు తీయాలంటే కెమెరాలోని ఫ్లాష్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టెడీ పోశ్చ‌ర్ పెట్టుకొని పాయింట్ అండ్ షూట్ మోడ్ లో కూడా ఫొటోలు తీయ‌వ‌చ్చు. లేదా కెమెరా సెట్టింగ్స్‌లో ఉండే బ‌ర‌స్ట్ మోడ్‌ను ఆన్ చేసుకొని త‌క్కువ వెలుతురు(లో లైట్) సెట్టింగ్స్‌పైన ఆధార‌ప‌డ‌వ‌చ్చు. అయితే ఏ ర‌కంగా ఫొటో తీసినా మ‌తాబుల కాంతులు వెద‌జ‌ల్లేప్పుడు స‌మ‌యం చూసుకొని క్లిక్ మ‌నిపించాలి.

అప్పో గుడ్ న్యూస్:''సెల్ఫీ ఎక్స్ పర్ట్ ''బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా..?

Let This Diwali Be Glittering And Picture Perfect

సెల్ఫీల‌ను మ‌రింత అందంగా

అంద‌రూ క‌లిసిన‌ప్పుడు ఓ సెల్ఫీ. మంచి మ‌ధుర‌మైన క్ష‌ణాల‌కోసం సెల్ఫీ. అంద‌రి మొహాలు క‌న‌బ‌డేలా సెల్ఫీ తీస్తే ప్ర‌త్యేక‌తేముంది. అందుకే బ్యాక్‌గ్రౌండ్‌లో దీపావ‌ళి అలంక‌ర‌ణ‌, లైటింగ్ వ‌చ్చేలా తీస్తే మీ సెల్ఫీ ఫొటోలకు మ‌రింత శోభ సంత‌రించుకుంటుంది. అయితే సెట్టింగ్స్‌లో ఫిల్ ఫ్లాష్ ఫీచ‌ర్ అని ఒక‌టుంటుంది. దాన్ని ఆన్ చేసుకుంటే మ‌రింత కాంతివంతంగా కనిపిస్తాం. వెన‌క లైటింగ్ ఉంటే ప్ర‌కాశ‌వంతంగా వ‌స్తుంది.

ఇప్ప‌టికే మీ మ‌దిలో ర‌క‌ర‌కాల ఐడియాలు వ‌చ్చి ఉంటాయి. దీపావ‌ళికి ఏ ర‌కంగా ఫొటోలు తీస్తే అద్భుతంగా ఉంటాయో అనే ఆలోచ‌న‌లు నింపుకొని ఉన్నారు క‌దా! అయితే ఇంకెందుకు ఆల‌స్యం.. మీ చుట్టుప‌క్క‌ల‌, వీధుల్లో, షాపుల్లో మీకు న‌చ్చిన ప్ర‌దేశాల్లో చిత్రాల దీపాల పండుగ చేసుకోండి.

English summary

Let This Diwali Be Glittering And Picture Perfect | Diwali | OPPO

Festive frenzy is beginning to catch onto everybody around, from shopping lists, to sweets or house decors, social media is buzzing with pictures of preps for the big festivity. Here are some tips that will help take mesmerizing Diwali pictures and make it a highlight of your social accounts. Check them out!
Subscribe Newsletter