Latest Updates
-
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ -
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి! -
తొలి జాబ్‌లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ!
ఇండియన్స్ ఫాలో అయ్యే డిఫరెంట్ హ్యాబిట్స్
ఇండియన్స్ ఏది చేసినా.. వెరైటీగా చేస్తారు. నలుగురిలో ప్రత్యేకంగా ఉంటారు. ప్రతి పనిలోనూ.. కాస్తైనా విభిన్నత ఉంటుంది. భారతీయుల కొన్ని అలవాట్లు ప్రపంచంతో పోల్చితే చాలా స్పెషల్ గా, స్మార్ట్ గా అనిపిస్తాయి. అయితే కొన్ని అలవాట్లు చాలా విచిత్రంగా అనిపించినా.. భారతీయ సంప్రదాయాన్ని, కట్టుబాట్లను వివరిస్తాయి.
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించడతాయని ఇండియన్స్ ఎక్కువగా నమ్ముతారు. అలాగే.. పెళ్లిళ్లు దేవాళయాల్లో, పుణ్యక్షేత్రాల్లో, మంచి ముహూర్తంలో చేయాలని భావిస్తారు. కానీ ఇతర దేశాల్లో అలాంటి పట్టింపులేమీ ఉండవు. ఇలాంటివే మరికొన్ని విషయాల ఇండియన్స్ ని ప్రత్యేకంగా చూపిస్తాయి. అలాంటి విషయాలేంటో ఇప్పుడు చూద్దాం..

పెళ్లి
ప్రతి భారతీయ అబ్బాయి తెల్లగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. నల్లగా ఉండే వాళ్లను చేసుకుంటే.. ఫ్యామీలీలో చెండాలంగా చూస్తారని ఎక్కువమంది అబ్బాయిలు ఫీలవుతారు.

డ్రెస్సింగ్
మన ఇండియన్స్ అమ్మాయిల డ్రెస్సింగ్ అందరిలోనూ ప్రత్యేకంగా ఉంటుంది. ఏ మాత్రం ఎక్స్ పోజ్ అవకుండా.. నిండుగా కవర్ చేసుకుంటారు. ఇంటికి ఎవరైనా వచ్చారు అంటే.. ముందుగా అమ్మాయిలు దుప్పట్టా వేసుకుంటారు. సంప్రదాయంగా కనిపిస్తారు.

పిక్ చేసుకోవడం
తమకు ఇష్టమైన వాళ్లు వస్తున్నా... ఊరికి వెళ్తున్నా స్టేషన్ కి వెళ్లి వాళ్లను దగ్గరుండి ఇంటికి తీసుకురావడం ఇండియన్స్ కు ఉన్న స్పెషల్ హ్యాబిట్. కొంతమందైతే.. ఫ్యామిలీ మొత్తం స్టేషన్ కి చేరుకుని.. వస్తున్న గెస్ట్ లకు వెల్ కమ్ చెబుతారు. వాళ్లను చాలా సంతోషానికి గురిచేస్తారు.

యమ్మీ ఫుడ్
స్ర్టీట్ ఫుడ్స్ ని ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. చాలా మందికి రోడ్ సైడ్ ఫుడ్ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల త్వరగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు.

ఇండియన్ మదర్స్
ప్రతి భారతీయ తల్లులకు ఒక ప్రత్యేక అలవాటు ఉంటుంది. వాళ్ల జీవితంలో హౌస్ వైఫ్ గానే కాకుండా.. కూతుళ్లకు భర్తను వెతికే పనిలో బిజీ ఉంటారు. అల్లుడిని వెతకడం ఒక హాబీగా పెట్టుకుంటారు.. ఇండియన్ మదర్స్.

రిలేషన్
ప్రతి ఇండియన్ టీనేజ్ అబ్బాయి, అమ్మాయి సీక్రెట్ రిలేషన్ షిప్ మెయింటెయిన్ చేస్తుంటారు. ఇంట్లోవాళ్లకు తెలియకుండా రిలేషన్ మెయింటెయిన్ చేసే ఈ జంటలు... అప్పుడప్పుడు ఫ్యామిలీ కళ్లలో కూడా పడుతుంటారు.

పెళ్లి రోజు
పెళ్లిజరగబోయే రోజు ఇండియన్స్ లో ప్రతి ఒక్కరికీ చాలా ఆనందకరమైన, సంతోషకరమైన రోజు. పెళ్లికూతురు అప్పగింతల సమయంలో ఖచ్చితంగా ఏడుస్తుంది. ఇదీ ప్రతి అమ్మాయికి అలవాటు.

గౌరవం
ఇండియన్స్ పెద్దవాళ్ల పాదాలకు దండం పెట్టడం ఆనయితీగా వస్తోంది. పెద్దవాళ్ల ఆశీర్వాదం పొందాలంటే.. వాళ్ల పాదాలకు మొక్కాలి. ఈ పద్ధతి పెద్దవాళ్లకు భారతీయులు ఇచ్చే గౌరవాన్ని సూచిస్తుంది.

పేరెంట్స్ రూల్స్
పిల్లల విషయంలో ఇండియాలో తల్లిదండ్రులు చాలా స్ర్టిక్ట్ గా ఉంటారు. ప్రతి విషయంలో క్లారిటీ కోరుకుంటారు. హాస్టల్ లో ఉన్నా.. ఇంట్లో ఉన్నా.. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయం గురించి తెలుసుకుంటారు. ఆఫీస్ నుంచి పీజీకి ఎంత దూరముంది. రూమ్ లో ఎంతమంది ఉంటారు, ఆఫీస్ లో సహోద్యోగులు ఎంతమంది ఉంటారు.. ఇలా ప్రతి విషయంలో ప్రశ్నలు సంధిస్తూ జాగ్రత్త పడుతుంటారు.

చెడు పదాలు
సెక్స్ అనే పదం ఇంట్లో తల్లిదండ్రుల ముందు వాడటం చాలా పెద్ద తప్పు. వాళ్ల ఎదుట ఎప్పుడూ ఈ పదం వాడకూడదు. ఇండియన్స్ ప్రత్యేకం అని చెప్పడానికి ఇది ఒక హ్యాబిట్.



Click it and Unblock the Notifications