Latest Updates
-
పాత కాలం నాటి నెల్లూరు స్టైల్ మినుముల పచ్చడి.. అసలుసిసలైన రుచి అంటే ఇదే.! -
వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ ఎక్కడ పెట్టాలో తెలుసా! -
బంగాళదుంపతో జలేబీ.. ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ చేస్తే అస్సలు వదలరు! -
నోటి దుర్వాసనతో మాట్లాడాలంటే ఇబ్బంది.. దంతాల ఆరోగ్యాన్ని కాపాడే హోం మేడ్ టూత్ పేస్ట్.! -
ముఖం ఉబ్బిందా? మెడ నల్లబడిందా? ఫ్యాటీ లివర్ కు ఇవే తొలి సంకేతాలు! -
వృద్ధాప్యంలోనూ యవ్వనంగా కనిపించాలనే ఆరాటం.. బ్యూటీపార్లర్ నిర్వాకానికి టోటల్ ఫ్యామిలీ షాక్.! -
Viral Video: ఇన్ స్టాగ్రామ్ లో పరిచయంతో పెళ్లి..శోభనం రోజు చూస్తే అబ్బాయి! -
5 నిమిషాల్లో అద్భుతమైన బ్రేక్ ఫాస్ట్.. మీ పిల్లలు లొట్టలేసుకుంటూ తినే చీజ్ గార్లిక్ శాండ్ విచ్ -
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.!
ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇండియన్స్ చేసే ఫన్నీ థింగ్స్
ఇంటికి చుట్టాలు వచ్చారంటే... ఇండియన్స్ లో పట్టలేని ఆనందం వచ్చేస్తుంది. ఫుల్ హైరానా పడిపోతూ.. హడావుడి చేసేస్తూ.. ఇంటినంతా గోళగోళగా క్రియేట్ చేస్తారు. ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే... చిన్నపిల్లలకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. కొత్తవాళ్లు ఇంటికి వస్తే అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని పద్ధతులు నేర్పిస్తారు.
భారతీయుల ఇంటికి కొత్తవాళ్లు వచ్చారంటే చాలు వాళ్లను కళ్లలో పెట్టుకుని చూసుకుంటారు. ఇంటికి వచ్చిన అతిథులకు ఏ లోపం జరగకుండా.. ప్రతీది సమకూర్చుతారు. సకల మర్యాదలు చేస్తూ అపురూపంగా చూసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో బంధువులు వచ్చినప్పుడు చేసే పనులు చూస్తే నవ్వు వస్తుంటుంది. చాలా గమ్మత్తుగా.. ఆశ్యర్యంగా అనిపిస్తాయి. అలాంటి విషయాలేంటో మీరే చూడండి.

పిల్లలకు ట్రైనింగ్
భారతీయుల సంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన అతిథులకు ఎలా స్వాగతం చెప్పాలి అనే దానిపై పిల్లలకు బాగా ట్రైనింగ్ ఇస్తారు. కొత్తవాళ్లు, బంధువుల ముందు సరైన పద్ధతిలో ప్రవర్తించాలని.. అల్లరి చేయకుండా క్రమశిక్షణతో ఉండాలని ముందుగానే సూచిస్తారు.

రకరకాల పిండివంటలు
అతిథులు వస్తున్నారంటే.. ఇంట్లో పండగ వాతావరణమే. నోరూరించే వంటలతో.. రెస్టారెంట్ మెనూ డైనింగ్ టేబుల్ కు చేరాల్సిందే. రకరకాల పిండివంటలు.. స్వీట్స్, స్నాక్స్ తో విందు భోజనం రెడీ అయిపోతుంది.

టపాకాయలతో స్వాగతం
బంధువులు వచ్చిన ఆనందంలో కొన్ని సందర్బాల్లో చేసే పనులు భలే గమ్మత్తుగా అనిపిస్తాయి. అలాంటిదే ఇది. అతిథులు ఇంటికి చేరుకున్నారంటే.. ఆ సందడే వేరు. క్రాకర్స్ పేల్చుతూ.. వాళ్లకు వెల్ కమ్ చెప్పేస్తారు. వాళ్లు రావడం తమకు ఎంత ఆనందంగా ఉందో చెప్పకనే చెప్పేస్తారు.

విదేశాల నుంచి అతిథులు వస్తే
ఇక విదేశాల నుంచి అతిథులు వచ్చారంటే... భారతీయుల్లో పట్టలేని ఆనందం. వాళ్లను ప్రత్యేకంగా చూసుకుంటారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లపై చూపించే అభిమానం, ఆప్యాయత మరింత భిన్నంగా.. ఉంటుంది. వాళ్లకు ఇబ్బంది కలిగించేలా.. విదేశీ విషయాలను అడుగుతుంటారు.

జ్ఙాపకాలు
భారతీయుల ఇంటికి వచ్చి వెళ్లే అతిథులకు చాలా అరుదైన జ్ఙాపకాలు జీవితాంతం మదిలో మెదులుతాయి. ఎందుకంటే.. ఇంటికి వచ్చిన బంధువులను ఆనందంగా చూసుకోవడమే కాదు.. వెళ్లేటప్పుడు వాళ్లకు కానుకలు ఇచ్చి పంపుతారు. బంధువులు వెళ్లిపోవడం బాధగా అనిపించినా.. చిరునవ్వుతో వీడ్కోలు చెబుతారు. మీరు కూడా.. ఈ సారి ఇండియన్స్ ఇంటికి గెస్ట్ గా వెళ్లండి. ఈ విధంగానే ఆహ్వానించి.. అభిమానిస్తారో లేదో చూసి.. ఎంజాయ్ చేయండి.



Click it and Unblock the Notifications
