Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
2016లో ఏ రాశి వాళ్లకు ఏ కలర్ అదృష్టం తీసుకొస్తుంది ?
ఇయర్ ఎండ్ అవుతోంది అంటే.. కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోందో అని ఆత్రుతగా ఉంటుంది. మన కెరీర్, లవ్, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుందో.. తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం. 2016 ఎంటర్ అవడానికి ఇక కొద్ది సమయమే ఉంది. కొత్త సంవత్సరాన్ని.. ఆనందంగా, మొమరబుల్ గా వెల్ కమ్ చెప్పడానికి ప్రతి ఒక్కరూ రెడీగా ఉన్నారు కదూ.. !!
కలర్స్ ప్రతి ఒక్కరిపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయని మనందరికి తెలుసు. ప్రతి ఒక్కరూ తమకంటూ.. ఓ ఫేవరేట్ కలర్ ని ఎంచుకుంటారు. అలాగే.. దాన్నే లక్కీ కలర్ గా కూడా భావిస్తారు. ఏదైనా తమకు ఇష్టమైన పనిచేయాలన్నప్పుడు ఫేవరేట్ కలర్ ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు రాబోయే కొత్త సంవత్సరంలో.. మీ రాశిని బట్టి మీకు ఎలాంటి కలర్ సూట్ అవుతుందో తెలుసుకోండి.. న్యూ ఇయర్ అన్నింటిలో సక్సెస్ అవండి.

మేషరాశి - రెడ్
మేషరాశి వాళ్లకు రెడ్ కలర్ బాగా కలిసిసొస్తుంది. మార్స్ ని సూచించే ఈ రంగు.. ఈ రాశి వాళ్లకు చాలా సక్సెస్ లు తీసుకొస్తుంది. న్యూ ఇయర్ లో.. వర్క్ ఆఫర్స్ మీ తలుపు తడుతాయి.

వృషభము - పింక్
వృషభరాశివాళ్లకు వీనస్ తో లింక్ ఉంటుంది. ఈ రాశి అందాన్ని, స్థిరత్వాన్ని తెలుపుతుంది. వృషభ రాశివాళ్లకు 2016లో పింక్ బాగా కలిసొస్తుంది.

మిథునము - ఎల్లో
మిథున రాశి వాళ్లకు ఎల్లో కలర్ కలిసొస్తుంది. వీళ్లకు ఎల్లో లక్కీ కలర్. ఈ రంగు వీళ్లకు చాలా మార్పులు తీసుకొస్తుంది. ఈ కొత్త సంవత్సరంలో మిథున రాశి వాళ్ల లక్ష్యాలు నెరవేరుతాయి.

కర్కాటకం - వైట్, క్రీమ్
కర్కాటక రాశి ఆడంబరాన్ని తెలుపుతుంది. ఏదైనా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు వైట్ లేదా క్రీమ్ కలర్ దుస్తులు ధరించడం వల్ల.. పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి.

సింహం - పర్పల్, ఆరంజ్
సింహ రాశి వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి.. వీళ్లకు బ్రైట్ కలర్స్ సరిపోతాయి. 2016లో వీళ్లకు పర్పల్, ఆరంజ్ కలర్స్ గుడ్ లక్ తీసుకొస్తాయి.

కన్య - గ్రీన్
కన్యారాశి వాళ్లకు 2016లో గ్రీన్ కలర్ చాలా అదృష్టం తీసుకొస్తుంది. న్యూఇయర్ లో గ్రీన్ కి కన్యారాశి వాళ్లు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల అందరితోనూ చాలా సామరస్యంగా ఉంటారు.

తుల - లావెండర్, బేబీ బ్లూ
తులారాశి ప్రేమ, ప్రశాంతత, సామరస్యాన్ని సూచిస్తుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆత్రుతగా ఉండకూడదు. బేబీ బ్లూ, లావెండర్ కలర్స్ ఎంపిక చేసుకుంటే.. చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు.

వృచ్చికం - బ్లాక్, రెడ్, మెరూన్
వృశ్చిక రాశివాళ్లకు 2016 సంవత్సరంలో రెడ్, బ్లాక్, మెరూన్ కలర్స్ అదృష్టం తీసుకొస్తాయి. ఈ రంగులకు దగ్గరగా ఉండటం వల్ల.. చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు.

ధనుస్సు - డార్క్ బ్లూ
ధనుస్సు రాశివాళ్లు డార్క్ బ్లూ కలర్ ఎంచుకోవడం వల్ల గుడ్ లక్ తోపాటు, హై ఎనర్జీ కూడా పొందుతారు. వీళ్లలో ఉండే ఆధ్మాత్మికత, సంతోషంగా గడిపేతత్వంతో ఆనందాన్నిస్తాయి. అలాగే.. ఇతరులలో నమ్మకం కుదుర్చుకుంటారు.

మకర - గ్రే
మకర రాశి వాళ్లకు కలిసొచ్చే రంగు గ్రే. వీళ్లు ఏ పనిలో అయినా.. సక్సెస్ కోరుకుంటూ ఉంటే.. అలాంటి సమయంలో గ్రే కలర్ ఎంచుకోవడం మంచిది.

కుంభం - బ్లూ కలర్
కుంభ రాశివాళ్లకు 2016లో బ్లూ కలర్ కి సంబంధించిన లేత రంగులు మంచిది. వచ్చే సంవత్సరం ఈ రాశి వాళ్లు బ్లూ కి దగ్గరగా ఉండే రంగులు ఎంచుకుంటే.. మంచి ఫలితాలు పొందుతారు.

మీనం - సీ గ్రీన్, సీ బ్లూ
సెన్సిటివ్ మనస్తత్వం కలిగిన మీనరాశి వాళ్లకు సీ గ్రీన్, సీ బ్లూ లేదా లేత రంగులు మంచిది. కొత్త సంవత్సరంలో శుభఫలితాలు పొందాలంటే.. మీనరాశి వాళ్లు ఇలాంటి రంగులు ఎంచుకోవాలి.



Click it and Unblock the Notifications











