Latest Updates
-
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
మీ ఫేవరేట్ కలర్ మీ క్యారెక్టర్ గురించి ఏం చెబుతోంది ?
ప్రతి ఒక్కరికి ఫేవరేట్ కలర్ ఉంటుంది. దాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. ఫేవరేట్ కలర్ కి రిలేటెడ్ గా ఉండే షేడ్స్ నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. కనీసం కొంచెమైనా.. ఫేవరేట్ కలర్ ప్రతి డ్రెస్ లో ఉండేలా చూసుకుంటారు కొంతమంది. ఒక్కసారి మీ వార్డ్ రోబ్ తిరగేయండి.. చాలా వరకు ఎక్కువగా మీ ఫేవరేట్ కలర్ డ్రెస్ లే ఉంటాయి. దాన్నే లక్కీగా ఫీలయ్యే వాళ్లు కూడా ఉంటారు.
కొన్ని సందర్భాల్లో ఫేవరేట్ కలర్ కి చాలా వ్యాల్యూ ఇస్తాం. ఇంటి రంగులు కూడా అదే కలర్ లో ఉండేలా చూస్తాం. అలాగే బెడ్ షీట్స్, వస్తువులు, కిచెన్ ఐటమ్స్ ఇలా ప్రతి ఒక్కదాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫేవరెట్ కలర్స్ దే ఉంటుంది. అయితే మీరు ఇష్టపడే కలర్ మీ వ్యక్తిత్వం గురించి చాలా విషయాలు చెబుతుంది. మనల్ని ఎక్కువగా ఏ కలర్ ఎట్రాక్ట్ చేస్తుందో.. దాన్ని బట్టి క్యారెక్టర్ ని అంచనా వేయవచ్చట. చాలా ఫన్నీగా ఉంది కదూ. నిజమే.. మీ ఫ్రెండ్స్ ఫేవరెట్ కలర్ అడిగి తెలుసుకుని.. వాళ్ల క్యారెక్టర్ ఎలా కనెక్ట్ అయిందో తెలుసుకోండి.
వ్యక్తిత్వాన్ని బట్టే ఒక్కోవ్యక్తి రంగును ఫేవరెట్ కలర్‌గా సెలక్ట్ చేసుకుంటారు. అందుకే రంగులు వ్యక్తిత్వంతో పాటూ అభిప్రాయాలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఒక వ్యక్తి ధరించే దుస్తుల రంగును బట్టి వారేంటో అంచనా వేయొచ్చు. అదెలాగో చూసేద్దాం..

రెడ్ కలర్
రెడ్ కలర్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్లు చాలా దూకుడు స్వభావం కలిగి ఉంటారు. ఎమోషనల్ గా చాలా స్టేబుల్ గా ఉంటారు. భావోద్వేగాలు ఎలా కంట్రోల్ చేసుకోవాలో వాళ్లకు బాగా తెలుసు. లైఫ్ వాళ్లకు నచ్చినట్టు లేకపోతే.. ఈజీగా అసహనానికి గురవుతారు. అప్ సెట్ అవుతారు.

ఆరంజ్ కలర్
ఆరంజ్ ని ఫేవరెట్ కలర్ గా భావించేవాళ్లు చాలా జాలీగా ఉంటారు. లోతైన ఆలోచనలు, సీరియస్ డిస్కషన్స్ ని ఇష్టపడరు. వీళ్లు ఫ్రెండ్స్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే చాలా ఆప్యాయంగా ఉంటారు. వైవాహిక జీవితంపై అంత ఆసక్తి ఉండదు. కానీ ప్రేమ చూపిస్తారు.

ఎల్లో కలర్
పసుపు రంగుని ఇష్టపడే వాళ్లు చాలా ప్రణాళికాబద్ధంగా, శ్రద్ధగా, రిజర్డ్వ్ గా ఉంటారు. గొప్పగా కలలు కంటారు, కోరికలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ల కలలు నెరవేర్చుకోవడానికి ఎనర్జీ సరిపోదు. దీంతో నిస్సహాయతకు లోనవుతూ ఉంటారు. ప్లానింగ్, ఆర్గనైజింగ్ థాట్స్ ఎల్లో కలర్ ఇష్టపడే వాళ్ల స్ర్టెంగ్త్స్.

గ్రీన్
మొండిపట్టుదల కలిగి ఉంటారు గ్రీన్ ఇష్టపడేవాళ్లు. జీవితంలో వచ్చే ఎలాంటి మార్పులనైనా తట్టుకోగలుగుతారు. సామాజిక కార్యకలాపాలపై వీళ్లు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థికంగా బాగుంటారు. జీవితంలో ముందుకు వెళ్లడానికి సపోర్ట్ అవసరమవుతుంది.

బ్లూ
బ్లూ ఇష్టపడేవాళ్లు ప్రశాంతంగా ఉంటారు. లవింగ్ నేచర్ వీళ్లది. లోలోపల ఆలోచించే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. బ్లూ ఇష్టపడేవాళ్లు చాలా తెలివిగలవాళ్లు. వీళ్లు చాలా సున్నిత మనస్తత్వం కలిగినవాళ్లు, కానీ ఎమోషన్స్ బాగా కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఇతరులతో ఈజీగా ప్రేమలో పడుతారు. తన కుటుంబం, జీవితం హ్యాపీగా, అందంగా ఉంటడానికి చాలా కష్టపడతారు.

పర్పల్
పర్పల్ కలర్ ఇష్టపడేవాళ్లు కళాత్మకంగా, సృజనాత్మకంగా ఆలోచిస్తారు. తమ భావాలను వ్యక్తపరిచే తత్వం ఉంటుంది. ప్రశాంతతను కోరుకుంటారు అలాగే.. ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఒకవేళ పర్పల్ ఇష్టపడేవాళ్లు కళాకారులు కాకపోతే.. ఆర్ట్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆధ్యాత్మికత గురించి చర్చించడానికి, తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

పింక్
పింక్ ఇష్టపడేవాళ్లు చైల్డిష్ గా, రొమాంటిక్ గా ఉంటారు. చిన్నపిల్లలు ఇష్టపడేవాటికి ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతారు. బొమ్మలు, రెడ్ షూస్, రెడ్ నెయిల్ పెయింట్స్ ని ఎక్కువగా ఇష్టపడతారు. ఒత్తిడిని తగ్గించే గుణం వీళ్లలో ఉంటుంది.

బ్రౌన్
బ్రౌన్ ఇష్టపడేవాళ్లు చాలా కష్టపడి పనిచేస్తారు. జీవితంలో ఏదో సాధించాలనుకుంటారు. వాస్తవికంగా, ప్రాక్టికల్ గా ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో స్వార్థంగా ఆలోచిస్తారు. జీవితంలో విజయం గురించే ఎక్కువ ఆలోచిస్తారు.. దీనివల్ల లైఫ్ లో ఫన్ పార్ట్ మిస్ అవుతారు.

బ్లాక్
నల్లటి మేఘంలా గంభీరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బ్లాక్ ఇష్టపడేవాళ్లు. ఆధిపత్యం చెలాయించడాన్ని వ్యతిరేకిస్తారు. తమ దగ్గరకు వచ్చే సరికి అదే ఆధిపత్యాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని దూరదృష్టితో ఆలోచిస్తారు.

వైట్
సున్నిత మనస్కులు. సహజసిద్ధమైన వైఖరితో, ఏ విషయమైనా స్పష్టమైన అవగాహనను కలిగి ఉంటారు. జటిలమైన సమస్యలను కూడా చిటికెలో పరిష్కరించగలరు. ఇష్టమైన రంగే కాదు వీరి దుస్తులు కూడా ఎక్కువగా తెలుపు రంగులో ఉండడానికే ఇష్టపడతారు.



Click it and Unblock the Notifications











