Latest Updates
-
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త!
భారతీయులను సంబరపెట్టే సమ్ థింగ్ స్పెషల్ థింగ్స్
ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా.. సంతోషంగా గడిపేవాళ్లు ఇండియన్స్ అని మీకు తెలుసా. అవును మీరు విన్నది నిజమే. ఆర్థికంగా.. సామాజికంగా ఎలా ఉన్నా.. కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా సరదాగా గడిపేస్తారు. చిన్న చిన్న సంఘటనలతోనే బోలెడంత సంతోషం వెతుక్కుంటారు మన భారతీయులు.
ముఖంపై చెదరని చిరునవ్వుతో.. ఎప్పుడూ.. ఆనందంగా కనిపిస్తుంటారు ఇండియన్స్. ఎదుటివారు పలకరించినా.. కొత్త వాళ్లతో కమ్మునికేట్ కావాల్సివచ్చినా.. ముఖంపై చిరునవ్వు మాత్రం చెదరదు. ఆ చిన్న నవ్వు చాలు.. ఎదుటివారిని ఆకర్షించడానికి. డబ్బే శాశ్వతం కాదు అన్న నియమాన్ని పాటిస్తున్నారు కాబట్టి.. ఇండియన్స్ ఎప్పుడు సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. చిన్న చిన్న విషయాలతోనే తృప్తి చెందుతూ.. ఆనందపడే.. సిల్లీ విషయాలేంటో మీరే చూడండి.

యోగా
యోగా ఇప్పుడు భారతీయులందరినీ ఆకర్షిస్తోంది. కానీ యోగాని అలవాటుగా మార్చుకోకపోయినా.. ఉదయాన్నే సూర్య నమస్కారాలతో భానుడికి వెల్ కమ్ చెబుతున్నారు. యోగాసనాలతో మెదడుకు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు.

ఆయిల్ మసాజ్
మసాజ్ లను ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తలారా ఆయిల్ తో మసాజ్ లు చేసుకుంటూ సేద తీరుతున్నారు. ఈ ప్రక్రియ వల్ల కేవలం.. మెదడుకు రిలాక్సేషనే కాదు.. శారీరకంగానూ.. ఎన్నో ప్రయోజనాలున్నాయి.

టీ
ఇండియన్స్ కి ఛాయ్ ఎంత ఇష్టమంటే.. ప్రధాని కూడా ఛాయ్ వాలా ప్రోగ్రామ్ పెట్టేంత. రోడ్ సైడ్ ఉండే చిన్న టీ కొట్టులో టీ తాగడం మహా మజాగా ఫీలవుతారు. ఒక వైపు స్ట్రాంగ్ టీ తాగుతూ.. మరో వైపు దమ్ కొడుతూ.. మస్త్ గా ఎంజాయ్ చేసేస్తారు.

గడ్డిలో గెంతుతూ
పచ్చదనం.. ప్రకృతి వెచ్చదనం అంటే.. పట్టలేని సంతోషం మన భారతీయులకు. కుటుంబసమేతంగా ఏదైనా విహారానికి వెళ్తే చాలు.. పచ్చని లాన్ లోనే ఆడుతూ.. పాడుతూ.. కాసేపు గడ్డిలో కూర్చుని ఎంజాయ్ చేస్తారు. కొంచెం కొంచెం కొరుకుతున్నట్టు ఉండే లాన్ లో వాక్ చేస్తూ అపారమైన అనుభూతిని పొందుతారు.

చిటపట చినుకుల్లో అలా.. అలా..
చిటపట చినుకులు పడుతుంటే.. కేరింతలు కొడుతూ.. ఎగిరి గంతులేస్తారు ఇండియన్ ఫెల్లోస్. చిన్నా పెద్దా తేడా లేకుండా.. అందరూ.. వర్షంలో తడుస్తూ.. ఆనందంలో మునిగితేలుతుంటారు.

ఖాళీ వీధులు
ఇండియా పొల్యూట్ అయింది. ఎప్పుడూ రద్దీగా ఉంటాయి రోడ్లన్నీ. అలా బిజీ బిజీగా ఉండే ప్రాంతాలు ఒక్కసారిగా.. ఖాళీగా కనిపిస్తే.. వావ్ అని సర్ ప్రైజ్ ఫీలవ్వాల్సిందే. ఇలాంటి సందర్భాల్లోనూ ఇండియన్స్ చాలా హ్యాపీగా ఫీలవుతారు.



Click it and Unblock the Notifications