Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మీ రాశిని బట్టి స్లీపింగ్ హ్యాబిట్స్-నిద్రను మెరుగుపరుచుకోవడానికి ఐడియాస్..!
నిద్ర అన్నది ప్రకృతి ఇచ్చిన అతిగొప్ప వరం మరియు ఆరోగ్యకరమైన, దీర్ఘమైన మరియు నాణ్యతగల జీవితం జీవించటం తప్పనిసరి. గాఢనిద్ర పోలేనివారు లేదా నిద్ర పోవటంలో కూడా ఇబ్బందులు ఎడుర్కుంటున్నారంటే వారు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు, రెండింటితో బాధపడుతున్నారన్నమాట. ఇన్సొమ్నియా (నిద్రలేమి) కలిగిన ప్రజలు ఆందోళన, ఒత్తిడి మరియు ఏకాగ్రత లేకపోవడంతో బాధపడుతుంటారు. మనిషి ఆరోగ్యం మీద రాశులు ఎలాంటి ప్రభావం చూపుతాయో అదే విధంగా నిద్ర మీద కూడా ప్రభావం చూపుతాయి. ఒక్కో రాశి వారిలో స్లీపింగ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి. రాశికి అనుగుణంగా వారు ఎలాంటి స్లీపింగ్ హ్యాబిట్స్ ను అలవాటు చేసుకోవాలో చూద్దాం..
రాశులను బట్టి, స్లీపింగ్ హ్యాబిట్స్, నిద్రను మెరుగుపరుచుకోవడానికి ఐడియాస్

మేషరాశి:
వీరు ఎక్కువ సేపు గాఢంగా నిద్రిస్తారు, అయితే వీరు మనస్సులో ఏవైనా ఆందోళనలున్నట్లైతే నిద్రలేమి సమస్యను ఎదుర్కుంటారు.
వీరికి వచ్చే కలలు కూడా వివిధ రాకలుగా ఉంటాయి, వీరి ఆలోచనలు, వారి ప్రెజెంట్ లైఫ్ లో డిప్రెషన్ లేదా టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి ఈ రాశి వారు కూలర్ రూమ్స్ లో సౌకర్యవంతంగా , ఎలాంటి శబ్దాలు లేని చోట్ల నిద్రించాలి.

వృషభం :
వీరు అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం బాగా నిద్రపోవాలి. వీరి అభిరుచికి తగిన విధంగా బెడ్ రూమ్, బెడ్ ను, హిడనిక్ బెడ్ , సాప్ట్ పిల్లోస్, ఎంపిక చేసుకుని నిద్రిస్తారు.
వీరు ఫోన్ కాల్స్ ను ఇష్టపడరు, నిర్లక్ష్యం చేస్తుంటారు, నిద్రించడానికి ముందు ఆర్గ్యుమెంట్స్ చేయస్తుంటారు, వీరు త్వరగా నిద్రిస్తుంటారు, మరుసటి రోజు చాల ఫ్రెష్ గా కనబడుతారు. నిద్రించడానికి ముందు ఈ రాశివారు ఆల్కహాల్ వంటి అలవాటును ఖచ్చితంగా మానుకోవల్సి ఉంటుంది.

మిథున రాశి: :
విశ్రాంతి తీసుకోకుండా నిద్రమేల్కొని ఉండే వారు నిద్రించడానికి ముందు ఫ్రెండ్స్ తో ఛాట్ చేయడానికి ఇష్టపడుతుంటారు.
కంప్యూటర్స్, సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేస్తేనే వీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోగలరు.
ఈ రాశి వారు ఇతరుల గురించి ఆలోచించడం తగ్గించాలి. అలాగే రాత్రుల్లో ఇతరుల గురించి మాట్లాడుకోవడం లేదా, వారి గురించి అనవసరమైన విషయాలను తీసుకోవడం నివారించాలి.

కర్కాటక రాశి : :
వీరు ఇతరులకు సహాయపడే గుణం ఎక్కువగా ఉంటుంది.వారి కుటుంబ సభ్యులకు కూడా సహాయం చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అయితే నిద్రవిషయంలో వీరు ఎక్కువ నిద్ర లేదా నిద్రలేమి సమస్యలను ఎదుర్కుంటారు.
ప్రయాణం సమయంలో లేదా కొత్త ప్రదేశాల్లో వీరు నిద్రపోలేరు. నిద్రపోరు.
వీరు నిద్రను మెరుగుపరుచుకోవడానికి మంచిగా సౌకర్యవంతంగా బెడ్ ను రెడీ చేసుకోవాలి. ఇతరుల బెడ్స్ ను షేర్ చేసుకోకపోవడమే మంచిది.

సింహ రాశి :
నిద్రించడానికి కూడా బద్దకంగా ఫీలవుతారు మరియు వీరుఎప్పుడైతే రిలాక్స్డ్ గా పీలవుతారో అప్పుడే నిద్రపోతారు, సెక్యూర్ గా భావిస్తారు .
రోజంతా జరిగిన విషయాలను బెడ్ రూమ్ లోకి వెళ్ళడానికి ముందు అన్నీ వదిలేస్తారు, చాలా విశ్రాంతిగా నిద్రపోతారు .

కన్య:
వీరు ఎక్కువగా ఆలోచిస్తారు, ప్లానింగ్ మరియు ఎక్కువ బాధపడటం, అలోచంచడం వల్ల నిద్రను పాడు చేసుకుంటారు.
నిద్రలేమి సమస్యలు కారణంగా కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఏర్పడుతాయి. ఫ్యూచర్ గురించి లేదా గడిచిపోయిన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తాు. కాబట్టి వీరు మెడీటేట్ చేయడం వల్ల మంచిగా నిద్రపడుతుంది.

తుల రాశి:
తులరాశి వారు అన్నింటిలో బ్యాలెన్స్డ్ గా ప్లాన్ చేసుకుంటారు.
వ్రుషభరాశి వలే, వీరికి కూడా మంచి ఎన్విరాన్మెంట్ అవసరం అవుతుంది, మంచి నిద్ర పొందుతారు, హెల్తీగా నిద్రపొందుతారు.

వృశ్చికం:
వీరు రాత్రిల్లో గుడ్డగూబల్లాంటి స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వారు రాత్రంతా పనిచేయడం, లేదా చదవడం, చాటింగ్చేయడం లేదా బ్రౌసింగ్ చేయడం వల్ల తర్వాత రోజు ఉదయం అసౌకర్యంగా ఉంటుంది. అయితే ముందుకు నిద్ర హ్యాబిట్ ను మార్చుకుంటారు, మిడిల్ ఏజ్ లో ఆరోగ్యాన్ని మెయింటై చేసుకుంటారు. మెడిటేషన్ చేయడం వల్ లనిద్ర మెరుగుపడరతుంది.

ధనస్సు రాశి :
ఈరాశి వారికి ఎప్పుడూ ప్రయాణం చేయాలని ఉంటుంది. అందుకే వీరి మనస్సు కూడా ఎప్పుడూ చురుకుగా ఉంటుంది..
ఈ అలవాటు వల్ల నిద్రలేమి సమస్యను ఎదుర్కుంటారు. వీరు ప్రయాణాలు గురించి ఖచ్చితంగా ఒక్కక్క ట్రిప్ కు ఎక్కువగ్యాప్ తీసుకోవాలి, ట్రావెలింగ్ గురించి తక్కువగా ఆలోచించాలి.

మకరం:
ఈ రాశి వారు నిద్రవిషయంలో ఏమాత్రం రాజీ పడరు. వీరు టైమింగ్స్ మెయింటైన్ చేస్తారు .రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం చేస్తుంటారు. వీరు నిద్రించడానికి ఎలా రిలాక్స్ అవ్వాలో తెలుసుకోవాలి.

కుంభం:
ఈ రాశి వారు నిద్రలేమి సమస్యలను ఎదుర్కుంటారు. వీరు ఎప్పుడూ ఇతరులు ఏమనుకుంటారో అని అలోచిస్తుంటారు, ఇంకా, భవిష్యత్తులో ఏం చేయాలి. ఏంజరుగుతుందని ఆలోచిస్తారు. వీరికి ఒక్కట పరిష్కారం గాడ్జెట్స్ కు దూరంగా ఉంటూ, యోగ, మెడీటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల బాగా నిద్రపడుతుంది.
ఈ రాశి వారికు కలలు కనడం లేదా ఊహించుకోవడం సెల్ప్ హీలింగ్ లేదా నెగివిటిని తొలగిస్తుంది

మీనం :
వీరు చాలా ఊహాలోకంలో విహరించే స్వభావం కలిగి ఉంటుంది,నిద్రలో వచ్చే కలను , పగటిపూట వచ్చే కలలను కూడా ఇష్టపడుతుంటారు.
వీరు ఆధ్యాత్మికత కారణంగా వీరికి వచ్చే కలలను అంచనా వేసుకుంటారు, వాటిలో వీరు ఉపయోగపడే వాటి గురించి తెలుసుకుంటారు .వీరి శరీరం మరియు మనస్సు ఎప్పుడు కోరుకుంటుందో అప్పుడు మాత్రమే నిద్రపోతారు.



Click it and Unblock the Notifications