Latest Updates
-
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్! -
ఈ ఐదు లక్షణాలు ఉంటే మీ భర్త బంగారమే.. మరి మీవారిలో ఈ గుణాలు ఉన్నాయా.? -
కర్ణాటక స్పెషల్ వాంగి బాత్ పొడి..ఒక్కసారి చేస్తే 4 నెలలు నిల్వ..బోర్ కొట్టించే కూరలు కూడా అమృతమైపోతాయ్.. -
కృష్ణాష్టమి స్పెషల్: చిన్ని కన్నయ్యకి ఎంతో ప్రీతికరమైన అటుకుల లడ్డూ.. చక్కెర లేకుండా భలే రుచిగా.! -
పుట్టుకతోనే అదృష్టవంతులు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజ యోగం ఉన్న రాశులు ఇవే!
మిమ్మల్ని వెంటాడే.. భయం, ఆందోళన నుంచి బయటపడే సింపుల్ టిప్స్..!!
ఏదో ఒకసారి.. మనమందరం భయపడుతూ ఉంటాం. లేదా.. ఆందోళన చెందుతూ ఉంటాం. లేదా.. ఏదో ఒక వస్తువు లేదా ఒక విషయంలో మనల్ని భయం వెంటాడుతూ ఉంటుంది. దీనివల్ల మానసికంగా.. సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. భయం కలిగి ఉండటం వల్ల.. మన మానసిక స్థితి.. చాలా విభిన్నంగా మారుతుంది.
మీ భయాన్ని పోగొట్టే కొన్ని సింపుల్ టిప్స్ ఇప్పుడు వివరించబోతున్నాం. ఈ సింపుల్ టిప్స్ ఎంతగా భయపడేవాళ్లకైనా సహాయపడతాయి. కొన్ని సింపుల్ స్టెప్స్ ద్వారా భయం, ఆందోళన నుంచి తేలికగా బయటపడవచ్చు. ఇప్పుడు చెప్పబోయే టిప్స్ మీకు సహాయపడతాయి.

బయటకు వెళ్లడం
భయం, ఆందోళన ఏ సమయంలో వస్తుందని చెప్పడం చాలా కష్టం. కాబట్టి.. ప్రశాంతంగా ఉండటం, కాసేపు బయటకు వెళ్లడం, భయంకు సంబంధంలేని పనులు చేయడం వంటి పనుల ద్వారా.. మీరు చాలా రిలాక్స్ అవవచ్చు.

శ్వాస పీల్చడం
ఒకవేళ మీ అరచేతుల్లో చెమట పడుతోంది, లేదా మీ గుండె వేగంగా కొట్టుకుంటోంది అంటే.. ఇలాంటప్పుడు.. ప్రశాంతంగా ఉండాలి. భయం పోయేంతవరకు.. రిలాక్స్ గా ఉండాలి. గట్టిగా శ్వాస వదలాలి.

భయంతో పోరాడటం
భయాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి లేదా.. అది మిమ్మల్ని మరింత ఎక్కువ భయపెడుతుంది. మీరు దేనికి భయపడినా.. దాంతో పోరాడే ప్రయత్నం చేయాలి. అలా చేయడం వల్ల.. నెమ్మదిగా మీ భయం తగ్గిపోతుంది. అలా చేయకపోతే.. అది మీ బుర్రను తినేస్తుంది.

ఊహించుకోవడం
రేపు లేదని ఊహించుకోవాలి. మీకున్న భయాన్ని ఇవాళే ఫేస్ చేయాలని గట్టిగా నమ్మాలి. ఇవాళ భయాన్ని జయించకపోతే.. చనిపోవడం మంచిది. కాబట్టి.. చాలా ధైర్యంగా భయంతో పోరాడండి.

పర్ఫెక్ట్ గా ఉండాలనుకోకండి
బ్యాడ్ డేస్, సెట్ బ్యాక్స్ జీవితంలో ఖచ్చితంగా ఎదురవుతాయి. జీవితం చాలా విభిన్నంగా, మనం ఊహించని విధంగా ఉంటుందని గుర్తుంచుకోండి. అనుకోకుండా సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా.. ఎదుర్కోండి. అలాగే.. ఎవరూ పర్ఫెక్ట్ కాదని.. గుర్తుంచుకోండి. కాబట్టి భయంగా అనిపించినప్పుడు.. బయటపెట్టడంలో తప్పు లేదు.

మాట్లాడటం
మీకున్న భయం గురించి మాట్లాడటం వల్ల చాలా రిలాక్స్ అవవచ్చు. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ భయం గురించి మాట్లాడండి. వాళ్లు మిమ్మల్ని మరింత కాన్ఫిడెంట్ గా ఉండేలా సహాయపడతారు. సలహా ఇస్తారు.

బేసిక్స్
ఆల్కహాల్, డ్రగ్స్ మీ భయాన్ని పోగొట్టడానికి ఏ మాత్రం ఉపయోగపడవు. కాబట్టి.. భయం, ఆందోళన ఉన్నప్పుడు.. ఇలాంటివి ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకండి. ఇవి మీకు ప్రశాంతతను ఇవ్వలేవు. వీటికి బదులు.. త్వరగా నిద్రపోవడం, నడవడం వంటి అలవాట్లు.. మీ ఆలోచనలను ప్రశాంతంగా మారుస్తాయి.



Click it and Unblock the Notifications