Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నిద్రలో పడిపోతామన్న ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది ?
బాగా నిద్రపోతూ ఉంటారు. మధ్య రాత్రి అనుకోకుండా.. అసలు మెలకువ రాకుండానే.. సడెన్ గా కిందపడిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. హఠాత్తుగా ఆకాశం నుంచి పడిపోతున్నామా అన్న భయంతో ఉలిక్కి పడిన సందర్భాలు మీకు ఎదురయ్యాయా ? గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా ఈ ఫీలింగ్ బలంగా కలిగి.. చివరికి బెడ్ పై నుంచి కిందకు పడిపోతుంటారు కదూ.

మీరు ఎందుకు ఇలా సడెన్ గా పడిపోతున్నారని.. మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు ప్రశ్నించుకున్నారు ? కానీ దీనికి సమాధానం దొరికి ఉండదు కదూ. చాలా సందర్భాల్లో ఇలా ప్రశ్నించుకుని ఉంటారు. కానీ.. దీనికి కావాల్సిన ఎక్స్ ప్లనేషన్ దొరికి ఉండదు. అలాగే వివరించడం కూడా చాలా కష్టమైన పని.
రోజూ రాత్రి నిద్రలో ఒకే సమయానికి మెలకువ వస్తే దేనికి సంకేతం ?
అయితే నిద్రపోయేటప్పుడు ఆత్మ మన శరీరాన్ని వదిలి వెళ్లిపోయి తిరుగుతూ ఉంటుందని.. అది మళ్లీ తిరిగి వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని కొంతమంది చెబుతుంటారు. ఇలాంటప్పుడు శరీరంలో కుదుపు వచ్చిన ఫీలింగ్ కలిగి.. హార్ట్ బీట్ కూడా పెరుగుతుందట. అప్పుడే.. కిందపడిపోయిన ఫీలింగ్ కలుగుతుందని ఒక నమ్మకం ఉంది.

ఇలాంటి ఫీలింగ్ ని హైప్నిక్ జెర్క్ అని మెడికల్ టర్మ్స్ లో పిలుస్తారు. ఉన్నట్టుండి కండరాల్లో వచ్చే కదలికల కారణంగా లేదా ఏకాగ్రత కోల్పోయినప్పుడు ఇలా నిద్రలో కింద పడిపోవడం, పడిపోతున్న ఫీలింగ్ కలగడం జరుగుతుందట. అప్పుడప్పుడు ఇలాంటి పరిణామాలు ఎదురైతే.. పెద్ద ప్రమాదమేమీ లేదు. కానీ.. రెగ్యులర్ గా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తే.. అది నరాలకు సంబంధించిన వ్యాధికి సంకేతం.
నిద్రలో వచ్చే కలలు.. రియాలిటీకి దగ్గరగా ఉంటాయా ?
ఇలాంటి జెర్క్స్ హార్ట్ బీట్ పెరిగినప్పుడు, శ్వాస అందనప్పుడు, చెమట వల్ల ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో ఫీలింగ్ మాత్రమే కాకుండా.. నిజంగానే కిందపడిపోతుంటారు. సరిపడా నిద్రపోనివాళ్లలో హైప్నిక్ జెర్క్స్ వస్తూ ఉంటాయి. దీనికి చాలా కారణాలుంటాయి. నిద్రపోవడానికి ముందు ఆందోళనగా ఉండటం, ఒత్తిడికి లోనవడం వల్ల లేదా ఎక్కువ మోతాదులో కెఫీన్ తీసుకోవడం వల్ల కూడా.. నిద్రలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి.

నిద్రపోతున్న సమయంలో ఎక్కువగా మన కండరాలు రిలాక్స్ అవుతాయి. అప్పుడు కండరాలు ఎందుకు రిలాక్స్ అవుతున్నాయని మెదడు అయోమయానికి లోనై.. కండరాల్లో ఆందోళన పెంచుతుంది. దీనివల్ల పడిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇలా నిద్రలో ఎక్కువగా పడిపోతున్న ఫీలింగ్ కలగడం, ఎక్కువగా నిద్రలో బెడ్ పైనుంచి కిందకి పడిపోవడం వల్ల.. నిద్రసరిగా పట్టదు. ఎక్కువగా అలసటకు లోనవుతారు. అంతేకాదు.. పడుకోవాలంటే భయపడతారు. దీంతో నిద్రను కోల్పావాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications