గుర్మీత్ రామ్ రహీమ్ గారి విలాసమైన జీవిత శైలి, మరిన్ని వాస్తవాలు :

By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ఈరోజు పంచకులలో జరుగుతున్న అల్లకల్లోలానికి గందరగోళానికి, తనకు తానే దేవుడిగా ప్రకటించుకున్న "గుర్మీత్ రామ్ రహీమ్" కు కృతజ్ఞతలు.

ముందస్తు ప్రణాళికతో అతని అనుచరులు ప్రజలను హతమార్చడం వల్ల అక్కడ గందరగోళమైన, భయానకమైన వాతావరణాన్ని సృష్టించబడటం వల్ల అక్కడ పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారుతున్నాయి.

బ్రతికున్న పాములను తినే మొనగాడు !

'గురురామ్ రహీం సింగ్' ఎవరన్నది ఇప్పుడు దేశం మొత్తం తెలిసింది. డేరా అధినాయకుడిగా, నటుడిగా, గాయకుడిగా, రచయితగా, దర్శకుడిగా, అలాగే సామాజిక సంస్కర్తగా ఉన్నప్పుడు అతను ఆలస్యంగా వార్తల్లో నిలిచేవాడు.

స్వయం ప్రకటిత దేవుడిగా చెప్పుకున్న అతని గూర్చి మరి కొన్ని నిజాలను తెలుసుకుందాం.

అతని కుటుంబం గురించి :

అతని కుటుంబం గురించి :

గురు రామ్ రహిమ్ సింగ్ - ఆగష్టు 15, 1967 సంవత్సరంలో రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో జన్మించారు. ఆయన "నాసిబ్ కౌర్, మఘర్ సింగ్" దంపతుల ఏకైక సంతానం. పంట పొలాల్లో ట్రాక్టర్ని నడుపుతూ (పంటను దున్నటంలో) తన తండ్రికి సహాయంగా ఉండేవాడు. 'హర్జిత్ కౌర్ను' పెళ్లి చేసుకున్న ఇతనికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారి పిల్లలందరి పేర్ల చివర 'ఇన్షాన్' అని ఉపయోగిస్తారు.

వివాదాల్లో అతని గూర్చి :

వివాదాల్లో అతని గూర్చి :

2002 లో, అప్పటి ప్రధాని అయిన "అటల్ బిహార్ వాజపేయికి" ఒక అజ్ఞాత సాధ్వి లేఖను వ్రాశారు. అందులో: ఆమె, అతడి నుండి లైంగిక దాడిని ఎదుర్కొన్నట్టుగా ఆరోపించింది. ఈ విషయంపై, పంచకుల కోర్టుకు 'తాను లైంగిక సంబంధం కలిగి ఉండటానికి మానసికంగా, శారీరకంగా సరిపోనని' ఈ వివాదాస్పద దేవుడు చెప్పాడు. దీనికి తోడుగా "డేరా ప్రధాన అధికారి" - అతను శారీరక సంబంధాలకు సరిపోడని ఒక ప్రకటనను విడుదల చేసింది.

మీ భార్య యొక్క ప్రైవేట్ పార్ట్స్ గురించి పురుషులు తప్పకుండా తెలుసుకోవల్సిన రహస్యాలు

మాస్ కాస్ట్రేషన్స్ :

మాస్ కాస్ట్రేషన్స్ :

అతని ఆవరణలోనే మాస్ కాస్ట్రేషన్స్ పై (బీజగ్రంధులు తొలగించుకోమని) ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. కొన్ని నివేదికల ఆధారంగా, తన వద్ద ఉన్న 400 మంది అనుచరులను - అతనికి బానిసలుగా చేయడం కోసం - తమని తాము గా కాస్ట్రేట్ చేసుకోమని ఒత్తిడి చేశాడు. దీనిపై 2012 లో, అందులోని ఒక బాధితుడు పంజాబ్, హర్యానా హైకోర్టుల నుండి సహాయం కోరాడు. అలా కేసు దాఖలు చేసిన వ్యక్తి అతని వద్ద 14 సంవత్సరాలు అనుచరుడిగా కొనసాగాడు.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అతని పేరు కూడా ఉంది :

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అతని పేరు కూడా ఉంది :

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అతను 16 టైటిల్స్ ని కలిగి ఉన్నాడు. అందులో

లార్జెస్ట్ ఫింగర్ పెయింటింగ్, లార్జెస్ట్ వెజిటబుల్ మొజాయిక్, చాలామంది ప్రజలు పరిశుభ్రమైన చేతులు కలవారిగా, అలాగే అతిపెద్ద మానవ సమూహం ఉన్నవారిగా ఇంకా మరెన్నో గిన్నిస్ వరల్డ్ రికార్డ్లు ఉన్నాయి.

అతను VVIP స్థితిని కలిగి ఉన్నాడు :

అతను VVIP స్థితిని కలిగి ఉన్నాడు :

దేశంలో ప్రస్తుతం VVIP స్థాయిలో ఉండి, 'Z లెవెల్' సెక్యూరిటీ ని కలిగిన 36 మంది ప్రముఖులలో 'గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్' ఒకరు. ఎందుకంటే హర్యానా, రాజస్థాన్, పంజాబ్ వంటి రాజకీయ నాయకులకు అతను బాగా తెలిసిన ప్రముఖుడు కావడం చేత.

అతను సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రసిద్ధి చెందాడు :

అతను సామాజిక మాధ్యమాల్లో కూడా ప్రసిద్ధి చెందాడు :

అతను 2,00,000 పైగా అభిమానులను కలిగి ఉన్నారు. ట్విట్టర్లో ఏకంగా 3.74 మిలియన్ల అభిమానులు అతనిని ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ రికార్డుల ప్రకారం, ఈ సంఖ్య "శ్రీ శ్రీ రవి శంకర్" (2.26 మిలియన్), యోగా గురు "రామ్దేవ్" (938,000) కంటే మరింత ఎక్కువగా ఉంది. అలాగే అతని ఫేస్బుక్ ఖాతాలో 683,192 మంది అతన్ని అనుసరిస్తూ ఉండగా - 673,278 మంది ప్రజలు అతని పేజీని లైక్ చేసిన వారు ఉన్నారు.

అత్యధిక కార్ల సముదాయంగా అతను ఆశ్రమం కలదు :

అత్యధిక కార్ల సముదాయంగా అతను ఆశ్రమం కలదు :

అతని ఆశ్రమం అత్యధిక కార్ల సముదాయం కలిగిన స్టూడియోగా ఉన్నది. ప్రమాదంలో నష్టం వాటిల్లిన కార్లను ఇక్కడ రిపేర్ చేయబడి మళ్లీ సరికొత్త బ్రాండ్ లాగ మార్చబడతాయని, ఈ అధ్యయనం పేర్కొంది. ఒకటి లేదా రెండు కూడా కాదు, ఏకంగా డజన్ల కొద్దీ లగ్జరీ కార్లు అతని వద్ద ఉన్నాయి. ఇటువంటి కొన్ని విషయాలు భారతదేశంలో అరుదుగా కనిపిస్తాయి.

English summary

Things That You Need To Know About Gurmeet Ram Rahim's Life

This is how Gurmeet Ram Rahim was leading a lavish life, take a look here to know more.
Story first published: Thursday, August 31, 2017, 11:00 [IST]
Subscribe Newsletter