బుధవారం మీ రాశిఫలాలు (05-02-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి అత్యంత అనుకూలమట...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఈరోజు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు మీ భాగస్వామితో కొన్ని విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఉంది. వివాహితులకు సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో అనుకూలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : వైట్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ముఖ్యమైన రోజు. మీరు ఈరోజు ఆర్థిక పరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు వాటిని ఆచరణాత్మకంగా తీసుకోవాలి. వివాహితులకు శృంగార జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ మధ్య సాన్నిహిత్యం బాగా ఉంటుంది. కార్యాలయంలో మీకు ఇచ్చిన పనిని పూర్తి చేయడానికి మీరు కృషి చేస్తారు. ఆరోగ్య పరంగా బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 9

లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 3 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే అనవసరంగా మీరు వివాదాల్లో చిక్కుకుంటారు. ప్రేమ విషయంలో సమస్యలను అధిగమిస్తారు. వివాహితులు ఈరోజు మీ జీవిత భాగస్వామి ద్వారా ఓ కొత్త శుభవార్తను వింటారు. ఈరోజు మీ ప్రియమైన ఇంటి వాతావరణం ఆనందంగా ఉండే అవకాశం ఉంది. మీరు కుటుంబ సభ్యులతో ఆనందించండి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా బాగా ఉంటుంది.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : ఉదయం 9:35 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారు ఈరోజు చాలా సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ప్రతి సమస్యకు పరిష్కారం కనుగోనేందుకు ప్రయత్నిస్తారు. ఈ రోజు, మీరు మీ నిర్ణయాలను చాలా ఆలోచనాత్మకంగా తీసుకుంటారు. ఈ రోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. పని విషయంలోనూ చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ సీనియర్ల సహాయంతో మీ పనిలో పురోగతి సాధిస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 7

లక్కీ టైమ్ : ఉదయం 5 నుండి మధ్యాహ్నం 2:55 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు చాలా కఠినంగా ఉంటుంది. ఈరోజు మీకు ఎవరితో అయినా ఆర్థిక పరంగా గొడవలు రావచ్చు. ఈ విషయం మిమ్మల్ని చాలా కాలం బాధపెడుతుంది. వ్యాపారులకు ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఈరోజు మీ పనులన్నీ చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలి. సహోద్యోగులతో కూడా మంచి సమన్వయంతో ఉండేందుకు ప్రయత్నించండి. మీ వ్యక్తిగత జీవితంలో పరిస్థితి ఒత్తిడితో ఉంటుంది.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:40 నుండి రాత్రి 7 గంటల వరకు

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారిలో ఈరోజు వ్యాపారవేత్తలు తొందరపడి పెట్టుబడి వంటి నిర్ణయాలను తీసుకోకూడదు. ఉద్యోగులు ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు ఏదైనా ముఖ్యమైన పని అప్పగించినట్లయితే, దానిని నిజాయితీగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. మీరు దీన్ని చేయకపోతే, మీ ప్రతిష్ట దెబ్బతినవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. మీ కుటుంబసభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 10

లక్కీ టైమ్ : ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ ఇంటి వాతావరణం సరిగ్గా ఉండదు. వివాహితులకు ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది. మీ భాగస్వామి యొక్క మానసిక స్థితి కూడా మంచిగా ఉండదు. పని విషయంలో ఈరోజు మీకు ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఈరోజు పూర్తి నిజాయితీతో పని చేస్తారు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

లక్కీ కలర్ : గ్రీన్

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : సాయంత్రం 4 నుండి రాత్రి 10 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో బాగా ఉంటుంది. ఈ రోజు మీరు కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు వ్యాపారవేత్తలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ రోజు మీరు పనికి సంబంధించిన సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో శాంతి ఉంటుంది. మీ తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలను వింటారు.

లక్కీ కలర్ : డార్క్ రెడ్

లక్కీ నంబర్ : 25

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని పట్ల శ్రద్ధ ఎక్కువగా చూపుతారు. అయితే ఇతర విషయాల్లో మీరు ఈరోజు బాగా ఆనందిస్తారు. మీరు పూర్తి ఉత్సాహంతో మరియు ఆత్మవిశ్వాసంతో పని చేస్తారు. దీని ఫలితంగా మీరు త్వరలో కొంత గొప్ప విజయాన్ని సాధిస్తారని భావిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ఈరోజు ప్రేమలో ఉన్న జంటలకు ప్రత్యేకంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండండి.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 30

లక్కీ టైమ్ : సాయంత్రం 4:55 నుండి రాత్రి 11 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈరోజు వ్యక్తిగతంగా అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ వైవాహిక జీవితంలో కూడా సాధారణంగా ఉంటుంది. పని విషయంలోనూ మిశ్రమంగా ఉంటుంది. ఆఫీసులో మీ సహోద్యోగులతో సమన్వయం కూడా సరిగ్గా ఉండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకునేందుకు అవకాశం లభిస్తుంది. అదనపు ఆదాయం కూడా సంపాదించగలరు. అయితే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 6:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు మంచి మానసిక స్థితిలో ఉంటారు. ఎందుకంటే మీరు ఈరోజు మీ పనిని త్వరగా పూర్తి చేయగలుగుతారు. మీరు మీ స్నేహితులు మరియు కుటుంబసభ్యులతో గొప్ప సమయం గడుపుతారు. చాలా కాలం తరువాత మీరు కొంతమంది పాత స్నేహితులను కలవడం ద్వారా చాలా మంచి అనుభూతి చెందుతారు. మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది. మీరు మీ వివాహ జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆనందిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఉండొచ్చు.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 21

లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి రాత్రి 7:40 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీ ప్రయత్నాలు ఫలించడంతో మీరు సంతోషంగా ఉంటారు. మీ స్నేహితులతో కొంత సరదాగా గడుపుతారు. వ్యాపారవేత్తలకు ఈరోజు కష్టంగా ఉండొచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

పని విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 45

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి రాత్రి 8:20 గంటల వరకు

Story first published: Wednesday, February 5, 2020, 6:45 [IST]
Desktop Bottom Promotion