For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి అత్యంత అనుకూలమట...!

|

ఈ ప్రపంచంలో ఎవ్వరికైనా తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే కుతుహాలం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే చాలా మంది మనలో దిన ఫలాలు, వారఫలాలు, మాస ఫలాలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. వారి రాశి చక్రాలకు సంబంధించిన గ్రహాలను బట్టి మార్పులను గమనించి ఏయే రాశి వారికి ఎలా ఉంటుందో అంచనా వేస్తారు. ఇలా రాశి ఫలాల అంచనా వేయడం వల్ల తమకు వస్తున్న సమస్యలను, వాటిని అధిగమించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించవచ్చు.

మనకు రాబోయే అడ్డంకులను అధిగమించేందుకు, అందుకు అనుగుణంగా వ్యవహరించవచ్చు. కాబట్టి 2020 సంవత్సరంలో, ఫిబ్రవరి నెలలో మీ రాశి ఫలాలను చూడటం ద్వారా మీ భవిష్యత్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి..! ఇలాంటి అంచనాలన్నీ వేద జ్యోతిష శాస్త్రంపై ఆధారపడి ఉంటాయి. మీ జీవితానికి సంబంధించి ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలను గురించి తెలుసుకోండి . మరి ఆలస్యం చేయకుండా ఫిబ్రవరి మాసంలో ఏయే రాశుల వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం...

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

ఈ రాశి వారు ఈ నెలలో ఆర్థిక విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరంగా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. అధిక ఖర్చులు మీపై ఒత్తిడిని పెంచుతాయి. వ్యాపారులకు ఈ నెలలో మంచి అవకాశం లభిస్తుంది. మీరు గందరగోళంలో ఉంటే గనుక మీ తండ్రి నుండి సరైన మార్గదర్శకత్వం పొందుతారు. మీకు నమ్మకం వచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ జీవితం పెరుగుతుంది.

రాశిచక్ర మూలకం: భూమి

రాశి చక్ర గ్రహం: శుక్రుడు

లక్కీ నంబర్లు : 12, 27, 33, 49, 51, 66

లక్కీ డేస్ : ఆదివారం, బుధవారం, శుక్రవారం, మంగళవారం

లక్కీ కలర్స్: వైట్, ఎల్లో, బ్లూ, డార్క్ గ్రీన్, ఆరెంజ్

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారి ఈ నెల మెరుగ్గానే ఉంటుంది. పనిలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మీ పనితీరు ఎంతగానో ప్రశంసించబడుతుంది. మీ పని పట్ల ఉన్నతాధికారులు చాలా సంతృప్తి చెందుతారు. ఈ సమయంలో మీరు దాని ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు ఈ నెలలో మీకు కావలసిన ట్రాన్స్ ఫర్ పొందవచ్చు. మీరు ఉద్యోగ మార్పు చేయాలనుకుంటే మీకు మంచి ఆఫర్ రావచ్చు. ఆర్థిక పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో చాలా సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. మీరు వివాహం చేసుకుంటే, ఈ నెల మీకు గొప్పగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఈ నెలలో పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండవు.

రాశి చక్ర మూలకం: గాలి

రాశిచక్ర గ్రహాలు: బుధుడు

లక్కీ నంబర్లు : 9, 16, 24, 33, 47, 52

లక్కీ డేస్ : బుధవారం, సోమవారం, గురువారం, శనివారం

లక్కీ కలర్స్: స్కై బ్లూ, రోజ్, క్రీమ్, పర్పుల్, ఆరెంజ్

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈనెల మిశ్రమంగా ఉంటుంది. మీకు కొన్ని విషయాల్లో ఆందోళన ఉంటుంది. అయితే మీరు ధైర్యంగా ఉండాలి. మీరు మీ ప్రణాళిక ప్రకారం వెళితే మీకు కచ్చితంగా ప్రయోజనం లభిస్తుంది. అవసరమైతే మీరు మీ సహోద్యోగుల నుండి సహాయం కూడా ఆశించవచ్చు. వ్యాపార వ్యక్తులకు ఈనెల మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా కొంత కష్టంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఈ నెల ఆఖరులో మీరు ఒక యాత్ర చేయవచ్చు. మీరు ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతానికి వెళ్లొచ్చు.

రాశిచక్ర మూలకం: నీరు

రాశిచక్ర గ్రహాలు: చంద్రుడు

లక్కీ నంబర్లు : 5, 12, 28, 34, 45, 55

లక్కీ డేస్ : మంగళవారం, ఆదివారం, సోమవారం, శనివారం

లక్కీ కలర్స్: స్కై బ్లూ, బ్రౌన్, మెరూన్, రెడ్, గ్రీన్

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

ఈ రాశి వారికి ఈ నెలలో రొమాన్స్ పరంగా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు ఈ నెలలో ఒకరి వైపు ఆకర్షించబడవచ్చు.అయితే, ప్రేమ ప్రతిపాదన చేయడానికి ముందు, వారి మనస్సులో ఏముందో తెలుసుకోండి. ముందుగానే విషయం చెప్పడానికి తొందరపడకండి. మీరు ఇది వరకే ఎవరితో అయినా ప్రేమలో ఉంటే పెళ్లి చేసుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి సమస్యలు ఏవైనా ఉంటే వాటికి పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు కూడా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ నెలలో మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది.

రాశిచక్ర మూలకం: అగ్ని

రాశిచక్ర గ్రహాలు: సూర్యుడు

లక్కీ నంబర్లు : 7, 17, 28, 31, 43, 57

లక్కీ డేస్ : శుక్రవారం, మంగళవారం, బుధవారం

లక్కీ కలర్స్: మెరూన్, రెడ్, రోజ్, డార్క్ బ్లూ, ఎల్లో

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈ నెలలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ముఖ్యంగా శృంగార పరంగా ఈ నెల, మీరు చాలా సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే మీ భాగస్వామితో మంచి అవగాహన కారణంగా పరిస్థితులు సాధారణంగా మారిపోతాయి. మీరు మీ వివాహ జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందిస్తారు. ఈ సమయంలో, మీరు మీ దూకుడు స్వభావాన్ని తగ్గించుకోవాలి. వ్యాపారులకు ఈ నెలలో మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ఆర్థిక పరంగా కూడా బలంగానే ఉంటుంది. ఆర్థిక పరమైన సమస్యలేమీ ఉండవు.

రాశి చక్ర మూలకం: అగ్ని

రాశి చక్ర గ్రహాలు: సూర్యుడు

లక్కీ నంబర్లు : 5, 21, 30, 44, 59, 64

లక్కీ డేస్ : మంగళవారం, శుక్రవారం, శనివారం, సోమవారం

లక్కీ కలర్స్: బ్రౌన్, ఎల్లో, డార్క్ రెడ్, బ్లూ

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారు ఈ నెలలో పని విషయంలో చాలా ఆందోళన చెందుతారు. మీరు విజయం సాధించాలనుకుంటే, మీరు మరింత కష్టపడాలి. భవిష్యత్తులో మీరు తప్పులు జరగకుండా గతం నుండి గుణపాఠాలు నేర్చుకోవాలి. గ్రహాలు ఈ నెలలో మారుతున్నందున వాటి ప్రభావం మీపై ప్రతికూలంగా పడుతుంది. దీని వల్ల మీ పనులన్నీ పెండింగులో పడిపోతాయి. ఆర్థిక పరంగా ఈ నెల మంచిగానే ఉంటుంది. వైవాహిక జీవితం బాగా ఉంటుంది. కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి ఆప్యాయత మరియు మద్దతు పొందడం ద్వారా, మీరు మిమ్మల్ని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు.

రాశిచక్ర మూలకం: భూమి

రాశిచక్ర గ్రహాలు: మెర్క్యూరీ,

లక్కీ నంబర్లు : 4, 9, 18, 25

లక్కీ డేస్ : ఆదివారం, మంగళవారం, శుక్రవారం, గురువారం, బుధవారం

లక్కీ కలర్స్: లేత పసుపు, క్రీమ్, ఆకాశం, ఆకుపచ్చ, మెరూన్

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈ నెల పనిలో మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదు గ్రహాల కదలిక వల్ల మీకు పెద్ద పురోగతి కూడా రావచ్చు. ఈ నెల మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. ఈ నెలలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి.వ్యాపారులకు ఈ నెల చాలా ముఖ్యమైనది. మీరు మీ కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగా ఉంటుంది. మీ మధ్య మంచి సమన్వయం మరియు బలమైన నమ్మకం మీ వివాహ జీవితాన్ని సంతోషంగా చేస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది.

రాశి చక్ర మూలకం: గాలి

రాశి చక్ర గ్రహాలు: శుక్రుడు

లక్కీ నంబర్లు : 6, 14, 25, 39, 47, 56, 61

లక్కీ డేస్ : శుక్రవారం, బుధవారం, సోమవారం, ఆదివారం

లక్కీ కలర్స్: రెడ్, గ్రీన్, రోజ్, బ్లూ, వైట్

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ప్రయత్నాలు కొన్ని సఫలమవుతాయి, మరోవైపు మీరు వైఫల్యాలను కూడా ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా నిరాశ ఎదురుకావచ్చు. ఆర్థిక పరిమితుల కారణంగా మీరు ఎక్కువ సమయం ఒత్తిడికి లోనవుతారు. అయితే ముఖ్యమైన పనులను నిర్వహించడంలో మీరు విజయవంతమవుతారు. పని విషయంలో కొంత ఒత్తిడి పెరగవచ్చు. ఆరోగ్య పరంగా ఈ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

రాశి చక్ర మూలకం: నీరు

రాశి చక్ర గ్రహాలు: అంగారకుడు మరియు ఫ్లూటో

లక్కీ నంబర్లు : 2, 15, 26, 37, 49, 56

లక్కీ డేస్ : సోమవారం, బుధవారం, మంగళవారం, ఆదివారం

లక్కీ కలర్స్: ఆరెంజ్, పర్పుల్, బ్రౌన్, డార్క్ రెడ్

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈ నెలలో ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతారు. మీరు నిర్లక్ష్యంగా ఉంటే సమస్య తీవ్రంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ట్రాన్స్ ఫర్లు సాధారణంగా అవుతాయి. వ్యాపారులు ఈ నెలలో మంచి ఫలితాలను పొందవచ్చు.మీ వ్యాపారాన్ని మరింతగా పెంచడానికి మీరు ఈ నెలలో కృషి చేస్తారు. విద్యార్థులకు ఈ నెలలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. కుటుంబంలో కొన్ని గొడవలు జరుగుతాయి. కుటుంబంతో విభేదాలు లోతుగా ఉంటాయి. మీరు మానసికంగా బాధపడతారు. జీవిత భాగస్వామితో సంబంధంలో కూడా విభేదాలు రావచ్చు. ఆర్థిక పరంగా అకస్మాత్తు సంపద వస్తుంది.

రాశి చక్ర మూలకం: అగ్ని

రాశి చక్ర గ్రహాలు: బృహస్పతి

లక్కీ నంబర్లు 1, 7, 15, 23, 34, 45, 54

లక్కీ డేస్ : ఆదివారం, శనివారం, గురువారం, మంగళవారం

లక్కీ కలర్స్: ఎల్లో, మెరూన్, డార్క్ గ్రీన్, బ్లూ

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

ఈ రాశి వారికి ఈనెలలో అంతా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులు పోటీదారులకు ఈ నెలలో గట్టి పోటీ ఇస్తారు. ఈ నెలలో ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఆనందం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో చాలా సరదాగా గడుపుతారు. తల్లిదండ్రులతో సంబంధాలు బాగుంటాయి. రియల్ ఎస్టేట్ వారికి పెండింగులో ఉన్న ఓ కేసులో విజయం లభిస్తుంది.

రాశి చక్ర మూలకం: భూమి

రాశి చక్ర గ్రహాలు: శని

లక్కీ నంబర్లు : 8, 16, 24, 38, 45, 50, 66

లక్కీ డేస్ : బుధవారం, సోమవారం, శనివారం, ఆదివారం

లక్కీ కలర్స్: వైట్, రోజ్, స్కై బ్లూ, బ్రౌన్

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈ నెలలో పని విషయంలో మంచిగా ఉంటుంది.ఈ నెలలో చాలా సందర్భాల్లో అదృష్టం కలసి వస్తుంది. కాబట్టి మీ పురోగతికి బలమైన అవకాశం ఉంది. మీరు ఉపాధి కోసం చూస్తున్నట్లయితే, మీరు ఈ నెలలో మంచి ఉద్యోగం పొందవచ్చు. మీరు ఇప్పటికే ఉద్యోగం చేస్తుంటే, పదోన్నతి పొందవచ్చు, అలాగే జీతం పెరుగుదల వంటి వార్తలను కూడా వింటారు.మరోవైపు, మీ ప్రత్యర్థులు ఈ సమయంలో చురుకుగా ఉంటారు. మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీరు వ్యక్తిగత జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు రావచ్చు.

రాశి చక్ర మూలకం: గాలి

రాశి చక్ర గ్రహాలు: యురేనస్, సాటర్న్

లక్కీ నంబర్లు : 9, 13, 23, 36, 48, 59, 62

లక్కీ డేస్ : శుక్రవారం, బుధవారం, శనివారం, సోమవారం

లక్కీ కలర్స్: ఎల్లో, మెరూన్, క్రీమ్, పర్పుల్, ఆరెంజ్

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ నెలలో విద్యార్థులకు చాలా ముఖ్యమైనది. విద్యార్థులు తమ ప్రయోజనాలను పొందడానికి చాలా కష్టపడతారు. అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. బలమైన విశ్వాసంతో ప్రతి సవాలును సులభంగా ఎదుర్కోగలుగుతారు. మీరు ఉన్నత విద్యను పొందడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుంటే, మీరు నెల మధ్యలో విజయం సాధించవచ్చు, ఇది మిమ్మల్ని చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంచుతుంది. అయితే పని విషయంలో మీరు చాలా ఆందోళన చెందుతారు. ఆత్మవిశ్వాసంతో ఆలోచనాత్మకంగా అడుగు వేయండి. పరిస్థితులు అన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి. కుటుంబ జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది.

రాశి చక్ర మూలకం: నీరు

రాశి చక్ర హాలు: నెఫ్ట్యూన్, బృహస్పతి

లక్కీ నంబర్లు : 4, 12, 20, 31, 44, 58, 60

లక్కీ డేస్ : ఆదివారం, శుక్రవారం, బుధవారం, శనివారం

లక్కీ కలర్స్: స్కై బ్లూ, రోజ్, బ్లూ, ఎల్లో, డార్క్ రెడ్

English summary

Febrauary 2020 Monthly Horosocope in Telugu

For some zodiac signs, the month of February will be auspicious and for others it will be inauspicious. However, there is only one way to find out what the stars have in store for you, that is by reading your monthly horoscope.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more