Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
శనివారం మీ రాశిఫలాలు (13-06-2020)
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
ఈ దారాన్ని ధరిస్తే శత్రువుల నుండి రక్షణే కాదు... దేవుని ఆశీర్వాదమూ లభిస్తుందట....!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. ఉద్యోగులకు ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. వ్యాపారులకు ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మెరుగైన అవకాశం ఉంటుంది. మీరు మీ ఖర్చులను నియంత్రించాలి. మీ కుటుంబంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్య పరంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ : 9
లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:15 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు పని విషయంలో అనేక సమస్యలు ఉండొచ్చు. మీరు పనులన్నింటినీ పూర్తి చేయడంలో విఫలమవుతారు. ఉద్యోగులపై సీనియర్లు కోపంగా ఉంటారు. వ్యాపారులు ఈరోజు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు తొందరపడకూడదు. ఆర్థిక పరంగా ఈరోజు బాగానే ఉంటుంది. ఖర్చులను కూడా కంట్రోల్ లో ఉంచుతారు. అయితే మీరు నిరుపేదలకు సహాయం చేయడానికి అవకాశం వస్తే, దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచి రోజు అవుతుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 2
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:15 నుండి రాత్రి 10:10 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారికి ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో గొప్ప సమయంగా భావిస్తారు. ఈరోజు మీ ఆందోళనలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు కొన్ని ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీరు పెద్దలను గౌరవించాలి. ఈరోజు మీ స్నేహితుడి నుండి కొన్ని ముఖ్యమైన సలహాలను స్వీకరిస్తారు.
లక్కీ కలర్ : రెడ్
లక్కీ నంబర్ : 31
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 7 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22
ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో గందరగోళంగా ఫీలవుతారు. మీరు ఇలాంటి సమయంలో ధ్యానం చేయాలి. దీని వల్ల మీకు శాంతి లభిస్తుంది. అంతేకాదు క్లిష్ట పరిస్థితులలో కూడా ధైర్యంగా పని చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుటుంది. అయితే మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీరు పొదుపుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీరు తెలివిగా వ్యవహరిస్తే, మీరు ఇబ్బందులను నివారించవచ్చు. త్వరలోనే మీ పనులన్నీ పూర్తవుతాయి.
లక్కీ కలర్ : పర్పుల్
లక్కీ నంబర్ : 11
లక్కీ టైమ్ : ఉదయం 6:45 నుండి మధ్యాహ్నం 1:25 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22
ఈ రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితులలో కూడా ధైర్యంగా పని చేస్తారు. మీరు పూర్తి విశ్వాసంతో అతి పెద్ద సమస్యను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ ఆదాయం బాగుంటుంది. మీకు ఇతర కుటుంబ సభ్యులతో కూడా మంచి సంబంధం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ ఎల్లో
లక్కీ నంబర్ : 14
లక్కీ టైమ్ : సాయంత్రం 4:05 నుండి రాత్రి 9 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని పరంగా పవిత్రంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. అయితే కొంత ఎక్కువ పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు పెద్ద ప్రయోజనాలు లభిస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మీరు అవివాహితులైతే, ఈ రోజు మీ కోసం మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు. అయితే, మీరు నిర్ణయం తీసుకోవడంలో తొందరపడకండి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : నారింజ్
లక్కీ నంబర్ : 20
లక్కీ టైమ్ : ఉదయం 8:40 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు బిజీగా ఉంటుంది. మీరు మీ పనికి అంకితమవుతారు. మీరు ప్రతి పనిని సహనంతో, ప్రశాంతమైన మనస్సుతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా మీ సమస్యలు పెరుగుతాయి. అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవిత భాగస్వామి యొక్క మానసిక స్థితి సరిగ్గా ఉండదు. మీరు ఏదైనా వివాదస్పద సమస్యపై చర్చించకపోవడమే మంచిది. మీ మధ్య విభేదాలు ఉండొచ్చు. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : క్రీమ్
లక్కీ నంబర్ : 5
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 7 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీకు ఒత్తిడి కారణంగా మీరు ఒక సువర్ణావకాశం ఉండొచ్చు. ఉద్యోగులకు సీనియర్ల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఏదైనా సమస్య ఉంటే మీకు సకాలంలో అన్ని సహాయం లభిస్తుంది. వ్యాపారులకు ఈరోజు పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీ కుటుంబ జీవితంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో పరస్పర ప్రేమ పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ పింక్
లక్కీ నంబర్ : 4
లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు ఇంట్లో లేదా కార్యాలయంలో బాధ్యతలు బాగా పెరగొచ్చు. మీరు ఈరోజు సాధారణం కంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. ఆఫీసులో మీ ఉత్తమమైన పనితీరును చూసి మీ సీనియర్లు బాగా సంతోషిస్తారు. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ను నడిపించడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీరు మీ ఉత్తమమైనదాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తే మంచిది. ఈ రోజు వ్యాపారులకు చాలా ముఖ్యమైనది. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ : 38
లక్కీ టైమ్ : ఉదయం 7:55 నుండి ఉదయం 10:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది. మీ కుటుంబ సభ్యులలో ప్రేమ మరియు ఐక్యత చూసి మీరు సంతోషంగా ఉంటారు. పని విషయంలో ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటే, భయపడకండి. ఎందుకంటే త్వరలో మీకు పెద్ద ప్రయోజనం వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు మరింత ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. మీరు కష్టపడి పని చేస్తే త్వరలో మీకు సరైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
లక్కీ కలర్ : బ్రౌన్
లక్కీ నంబర్ : 19
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీలో ఉత్సాహం కలగాలంటే మీకు ఇష్టమైన వాటిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అలాగే ఈరోజు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మీ నాలుకను అదుపులో పెట్టుకోవాలి. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారులకు ఈరోజు మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మీకు మీ తల్లిదండ్రుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ తోబుట్టువులతో మీ సంబంధం కూడా మంచిగా ఉంటుంది. బహుశా మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు.
లక్కీ కలర్ : బ్లూ
లక్కీ నంబర్ : 10
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:20 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే చివరికి మీరే గెలుస్తారు. అందుకే మీకు హాని కలిగించే వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది. పనికి సంబంధించిన నేటి ప్రయాణం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా మీరు కోరుకున్న ఫలితం రావాలంటే మీరు చాలా కష్టపడాలి. మీ వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది.
లక్కీ కలర్ : లైట్
లక్కీ నంబర్ : 29
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











