For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ దారాన్ని ధరిస్తే శత్రువుల నుండి రక్షణే కాదు... దేవుని ఆశీర్వాదమూ లభిస్తుందట....!

|

హిందూ ధర్మం ప్రకారం ప్రతి సంప్రదాయానికి ఒక అర్థం కచ్చితంగా ఉంటుంది. అందుకే వాటి వ్యవహారాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇలాంటివి ఆచరించడం వల్లనే తమకు మంచి జరుగుతుందని చాలా మంది నమ్ముతారు.

ముఖ్యంగా చెడు ఫలితాలు తమ మీద పడకూడదని హిందువులలో చాలా మంది రకరకాల వాటిని నమ్ముతూ ఉంటారు. అందులో ఒకటి దారాన్ని ధరించడం. చాలా మంది హిందువులు పూర్వ కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు మెడ, నడుము, చేయి, కాలితో పాటు శరీరంలోని ఇతర భాగాలలో ఎర్రని, నల్లని, పసుపు, తెల్లని రంగుల దారాలను ధరిస్తూ ఉంటారు.

ఈ దారాలను ఎందుకు ధరిస్తారో చాలా మందికి తెలియదు. ఈ దారాలు ధరించడం వెనుక చాలా ప్రయోజనాలున్నాయని అతి కొద్ది మందికే తెలుసు. ఇవి ధరించడం వల్ల చెడు ఫలితాల నుండి రక్షణ లభిస్తుందని లేదా ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

అయితే ఈ దారాలను బయటకు కనిపించకుండా ధరిస్తారు. దీనికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఇంతకీ ఏయే రంగు దారం ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

అష్ట కష్టాలు నుండి అష్టైశ్వర్యాలు ప్రసాదించు అద్భుత స్తోత్రమే ''అష్టలక్ష్మీ స్తోత్రం''!!

తెల్లని దారం..

తెల్లని దారం..

తెలుపు అనేది 'శుక్రుడు' యొక్క చిహ్నం. దీనిని సాధారణంగా ఉపనయన వేడుకలో ఉపయోగిస్తారు. తెల్లని దారం పవిత్రతకు చిహ్నం. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, బ్రాహ్మణుల వంటి ఉన్నత వర్గానికి చెందిన ప్రజలు దీనిని ధరిస్తారు. ఈ వేడుక బ్రాహ్మణ కుటుంబంలోని పురుషుల కోసం ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇది యువకుడిని మగవాడిగా మార్చడాన్ని సూచిస్తుంది. కొందరు క్షత్రియులు, వైశ్యులు కూడా తెల్ల దారాన్ని ధరిస్తారు.

ఎర్రని దారం..

ఎర్రని దారం..

హిందువులలో చాలా మంది ఎర్రని దారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిని పూజ కర్మల ద్వారా స్త్రీ, పురుషులు ఇద్దరూ ధరిస్తూ ఉంటారు. ఇది అంగారక గ్రహాన్ని సూచిస్తుంది. కుడి మరియు ఎడమ మణికట్టు మీద చిన్న పూజ తర్వాత ఈ ఎర్రని దారాన్ని ధరించిన పురుషులు మరియు మహిళలను వరుసగా మనం చూడవచ్చు. అయితే వివాహిత మహిళలు ఎడమ చేతుల్లోనే ఈ దారాన్ని ధరించాలి.

ఎర్రటి నూలు దారం..

ఎర్రటి నూలు దారం..

ఎర్రటి నూలు దారం దీర్ఘాయువును సూచిస్తుంది. అలాగే శత్రువుల నుండి రక్షణను కూడా సూచిస్తుంది. అందుకే దీనిని రక్షణ దారంగా భావిస్తారు. అంతేకాదు ఈ దారాన్ని ధరించడం వల్ల దేవుని ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. దీన్ని ధరించడం వల్ల ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తాయని చాలా మంది హిందువులు నమ్ముతారు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇలా చేస్తే కోరుకున్న కొలువులు గ్యారంటీ...!

నల్లని దారం..

నల్లని దారం..

హిందూ మతంలో ముఖ్యమైన దారాలలో నల్ల రంగు దారం ఒకటి. దీన్ని ఎక్కువగా చిన్నపిల్లల నడుముకు కడుతూ ఉంటారు. పెద్దలు ఎడమ మణికట్టుకు కట్టుకుంటారు. మరికొందరు దీంతో ఏదైనా లాకెట్ చేయించుకుని లేదా ఇతర వస్త్రాన్ని ధరిస్తారు. చేతబడి లేదా మాయమంత్రాలు చేసే వ్యక్తుల కుడి కాలు మీద కూడా మనం నల్లటి దారాన్ని చూడొచ్చు.

చెడుకు దూరంగా..

చెడుకు దూరంగా..

నల్లని దారాన్ని కట్టడం వల్ల పిల్లల వద్దకు చెడు దరి చేరకుండా ఉంటుంది. అంతేకాదు ఇది ప్రజలను దుష్టశక్తుల నుండి లేదా అవనసరమైన ప్రమాదాల నుండి రక్షణ ఉంటుంది. నల్ల దారం ప్రతికూల శక్తిని గ్రహిస్తుందని, ఇది మనలోని నిరాశవాదాన్ని తొలగిస్తుందని చాలా మంది నమ్ముతారు.

దక్షిణభారతంలోని ఆ దేవుడిని దర్శస్తే.. కంటిచూపు కచ్చితంగా తిరిగొస్తుందట...!

ఆరెంజ్ లేదా కుంకుమ దారం..

ఆరెంజ్ లేదా కుంకుమ దారం..

కుంకుమ లేదా నారింజ రంగుంలో ఉండే దారం అంటే అగ్ని, గ్రహాలు, సూర్యుడు మరియు ఇతర విశ్వ మూలకాల రంగు. కుంకుమ పువ్వు హిందువులకు అత్యంత పవిత్రమైన రంగుగా పరిగణించబడుతుంది. ఈ రంగు కాంతి కోసం అన్వేషణను సూచిస్తుంది. నిజం మరియు మోక్షం కోసం తమ ఇళ్లను విడిచిపెట్టిన సన్యాసులు కుంకుమ రంగు ధరిస్తారు.

ఆధ్యాత్మిక వ్యాప్తికి..

ఆధ్యాత్మిక వ్యాప్తికి..

ఈ రంగు బృహస్పతితో ఆధ్యాత్మికతను వ్యాప్తి చేయడానికి కూడా సహాయపడుతుంది. పేరు, కీర్తి, బలం మరియు శ్రేయస్సు ఇవ్వడానికి మరియు చెడు కళ్ళ నుండి వ్యక్తిని రక్షించడానికి ప్రజలు కుంకుమ లేదా నారింజ వస్త్రాన్ని ధరిస్తారు.

పసుపు తాడు..

పసుపు తాడు..

హిందూ ధర్మం ప్రకారం పసుపు రంగు చాలా పవిత్రమైనది. ఇది విష్ణువుకు చిహ్నం. ఇది ఒకరి జీవితంలో సృజనాత్మకత మరియు హేతుబద్ధమైన సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఒక వ్యక్తి పసుపు దారం ధరించినప్పుడు, అది ఒక వ్యక్తిపై ఏకాగ్రత, కమ్యూనికేషన్ మరియు విశ్వాసాన్ని పెంచుతుంది. ఇది వివాహానికి చిహ్నం కూడా. భర్త దీర్ఘాయువు కోసం మహిళలు పసుపు తాడును ధరిస్తారు.

శుభకార్యాలకు

శుభకార్యాలకు

పసుపు స్వచ్ఛత మరియు మంచి ఆరోగ్యం యొక్క రంగు. వివాహాలు లేదా ఇంటి ప్రదర్శన వంటి శుభ సందర్భాలలో ఈ రంగు చాలా ముఖ్యమైనదని ప్రజలు నమ్ముతారు. హిందువుల వివాహాలలో అదృష్టానికి చిహ్నంగా పసుపును ఎక్కువగా ఉపయోగిస్తారు.

English summary

significance of Wearing sacred thread in hinduism

Hinduism has many colored sacred threads which serve for different purposes and resolve issues. These holy threads are a miracle. Learn how.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more