శనివారం మీ రాశిఫలాలు (16-05-2020)

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ శార్వరి నామ సంవత్సరం, వైశాఖ మాసం, శనివారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మీ రాశిని బట్టి ఏ వయసులో మీరు వివాహం చేసుకోవాలో తెలుసుకోండి...!

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారు ఈరోజు వారి జీవిత భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి. అబద్ధాలు మాత్రం చెప్పకూడదు. లేదంటే సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో తొందరపడకూడదు. ఆర్థిక విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పనికి సంబంధించి ఒక ముఖ్యమైన వ్యక్తితో మీరు ఫోన్‌లో సంభాషణ చేయవచ్చు. మీరు ఆలోచనాత్మకంగా మాట్లాడటం మంచిది. ఈ రోజు ఆరోగ్య విషయాలు బాగుంటాయి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 7:55 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు సంతోషంగా ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంటుంది. మీ సంబంధంలో మాధుర్యం ​​పెరుగుతుంది. ఈ రోజు ఆర్థిక పరంగా మంచిరోజు అవుతుంది. అయితే మీ ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులకు ఏకాగ్రత కుదరడం కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ధ్యానం చేయాలి. ఈ రోజు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు, జాగ్రత్తగా ఆలోచించండి. వాటి పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఏది మంచి, ఏది చెడు అనే దానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి.

లక్కీ కలర్ : లైట్ ఎల్లో

లక్కీ నంబర్ : 16

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 8:45 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు మీరు స్థిరమైన డబ్బును పొందడం వల్ల పెద్ద ఉపశమనం పొందుతారు.అంతేకాదు వ్యాపారులు ఈరోజు చాలా లాభాలను పొందవచ్చు. పెట్టుబడి పెట్టడానికి ఈరోజు మంచిరోజు. కానీ సరైన సలహాతో మాత్రమే పెట్టుబడి పెట్టండి. మరోవైపు ఈ రోజు కార్యాలయంలో మీ నిగ్రహాన్ని కోల్పోవచ్చు, మీరు మీ కోపాన్ని నియంత్రిస్తే మంచిది. లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఇంటి వాతావరణం బాగుంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో, మీ ధైర్యం కూడా పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చాలా శృంగార సమయాన్ని గడుపుతారు. మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి.

లక్కీ కలర్ : డార్క్ బ్లూ

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఇంటి వ్యవహారాలు మీకు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. అయితే ఆర్థిక పరంగా కొంత మెరుగుదల ఉంటుంది. మీ తండ్రి ఆర్థిక సహాయం పొందవచ్చు. మీరు ఉద్యోగం చేస్తే, మీ యజమానిని సంతోషపెట్టడానికి ఒకేసారి అనేక పనులను పరిష్కరించడానికి ప్రయత్నించకండి. మీరు తప్పులు చేసి ఉండవచ్చు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో మంచి అవగాహన వల్ల ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది. మీకు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

లక్కీ కలర్ : పింక్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 4:45 నుండి రాత్రి 8 గంటల వరకు

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు పనిలో ఏకాగ్రతను పెంచుకునేందుకు ప్రయత్నిస్తే అది మీకు మంచిది. ఈ రోజు మీకు ఆర్థిక పరంగా గొప్ప అవకాశాన్ని తెస్తుంది. మీరు తెలివిగా పని చేస్తే, మీరు ఈ రోజు అదనపు డబ్బు సంపాదించవచ్చు. ఈరోజు ఏదైనా విషయం గురించి మీ మనసులో సందిగ్ధత ఉంటే, మీ మాటలు స్పష్టంగా చెప్పడానికి భయపడకండి. ఈ రోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీ శక్తి కూడా పెరుగుతుంది. మీ బలమైన విశ్వాసం మీకు మంచి విజయాన్ని ఇస్తుంది. మీకు పని భారం తక్కువగా ఉంటుంది. ఈ రోజు మీకు విశ్రాంతి తీసుకోవడానికి చాలా సమయం లభిస్తుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఉత్తమ రోజులలో ఒకటి. ఆర్థిక పరంగా మెరుగుదల ఉంటుంది. నిరుద్యోగులకు ఈరోజు ఒక శుభవార్త వినిపించవచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : ఉదయం 9 నుండి ఉదయం 11 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు సోమరితనం వదిలి పనిపై ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఉద్యోగులు సహోద్యోగులతో కూడా గాసిప్పులు చేయడం మానుకోవాలి. మరోవైపు మీ జీవిత భాగస్వామి యొక్క నిజాయితీని అనవసరంగా అనుమానించవద్దు. ఇది మీ సంబంధంలో చీలికను కలిగిస్తుంది. ఆర్థిక సమస్యల కారణంగా మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆరోగ్యంగా ఉండేందుకు మీరు ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు పనిలో శుభప్రదంగా ఉంటుంది. కమ్యూనికేషన్‌లో మీ నైపుణ్యం మరియు మీ తెలివి ద్వారా మీరు ఈ రోజు పెద్ద ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈరోజు ఆర్థిక పరంగా మీకు కొంత మెరుగుదల ఉంటుంది. అయితే మీరు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయాలి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు మీ చేతిలో నుండి సులభంగా జారిపోవచ్చు. సాయంత్రం కొన్ని శుభవార్తలు వింటారు.

లక్కీ కలర్ : డార్క్ ఎల్లో

లక్కీ నంబర్ : 18

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 5 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పెండింగులో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఈరోజు మీకు ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీ ఖర్చులు పెరగడంతో, మీరు ఆకస్మికంగా డబ్బును నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. మీ వివాహ జీవితంలో మీ జీవిత భాగస్వామికి కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి. కుటుంబంలో శాంతి వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు బాగానే ఉంది.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 5

లక్కీ టైమ్ : సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారికి ఈ రోజు మీ జీవిత భాగస్వామి సహాయంతో మీ ముఖ్యమైన పని పూర్తవుతుంది. మీ ప్రియమైన వారి యొక్క సున్నితత్వం మరియు అనుకూలత మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తాయి. మీకు ఈరోజు పనిభారం ఒత్తిడిని కలిగిస్తుంది మరియు కోపాన్ని తెప్పిస్తుంది. మీరు మంచి అనుభూతి చెందుతారు. కొన్ని సందర్భాల్లో మీకు అదృష్టం రాదు. ప్రతిదీ మీకు వ్యతిరేకంగా జరుగుతోందని మీరు భావిస్తారు. ఈ రోజు మీరు మీ ప్రణాళికల్లో చివరి నిమిషంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. అనవసరంగా చింతిస్తూ మీ విలువైన సమయాన్ని వృథా చేయకండి.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 3

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారు ఈరోజు మరింత కష్టపడాలి. మీరు పని విషయంలో ఈరోజు విశ్రాంతి తీసుకోవాలి. వ్యాపారులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈరోజు కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామితో కొంత అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీరు సహనంతో పని చేస్తే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి ఉదయం 8:45 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో గొడవ పెరగొచ్చు.ఇలాంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకరినొకరు చాలా ప్రేమిస్తున్నారని మీకు బాగా తెలుసు. కొన్ని ముఖ్యమైన పనులు చాలా అడ్డంకులు ఉన్నప్పటికీ ఈ రోజు పూర్తవుతాయి. ఆర్థిక పరంగా ఈరోజు అదనపు ఆదాయం లభిస్తుంది. యోగ చేయడం ద్వారా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యం విషయంలో కూడా చాలా శ్రద్ధ పెట్టాలి.

లక్కీ కలర్ : ఆరెంజ్

లక్కీ నంబర్ : 22

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగుకు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.

Story first published: Saturday, May 16, 2020, 6:00 [IST]
Desktop Bottom Promotion