Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
మీ రాశిని బట్టి ఏ వయసులో మీరు వివాహం చేసుకోవాలో తెలుసుకోండి...!
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఇలాంటి కళ్యాణ వైభోగం వంటి కార్యక్రమం కోసం అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఎన్నో కలలు కంటూ ఉంటారు.
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఇలాంటి కళ్యాణ వైభోగం వంటి కార్యక్రమం కోసం అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఎన్నో కలలు కంటూ ఉంటారు. అయితే కొంత మంది తొందరపడి తప్పుడు వ్యక్తులతో వివాహం చేసుకుంటూ ఉంటారు. ఇది ఆత్మహత్యతో సమానం అని, అసలు ఇంతకీ స్త్రీ, పురుషులకు వివాహం ఏ సంవత్సరంలో సరైనది? వారి జీవిత భాగస్వామి ఎలా ఉంటారు? అనే ప్రశ్నలు చాలా మంది మదిలో మెదులుతూ ఉంటాయి.

అయితే ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం జ్యోతిష్యశాస్త్రంలో దొరుకుతుందని పండితులు చెబుతున్నారు. మీ రాశి చక్రాన్ని బట్టి మీరు ఏ వయసులో వివాహం చేసుకుంటే మీ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవితాన్ని మరింత ఆనందమయంగా మారుస్తుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు వారి జీవితంలో ప్రతిదీ చాలా వేగంగా చేయాలని కోరుకుంటున్నారు. అందువల్ల వీరి జీవితంలో వివాహం కూడా జరగాలని భావిస్తారు. వీరు 25 లేదా 26 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకునేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

వృషభ రాశి..
ఈ రాశి వారు శృంగార పరంగా ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. అయితే వీరు ఎట్టి పరిస్థితుల్లో తొందరపడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. సరైన వారిని తమ జీవితంలో ఎంచుకునేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు. అయితే వీరు 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే... వీరికి కావాల్సిన ప్రేమ లభిస్తుంది.

మిధున రాశి..
ఈ రాశి చక్రం వారు ప్రేమ వివాహాన్ని ఇష్టపడతారు. అయితే వీరి ప్రేమ అవసరం ఏంటో వీరికి తెలియదు. అందుకే కొంత అవగాహన వచ్చాక వివాహం చేసుకోవడం మంచిది. ఈ రాశి వారు 28 లేదా 30 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంటే, వీరి ప్రేమ జీవితానికి మంచిది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు కుటుంబంపై ఆధారపడి ఉంటారు. అందుకే వీరు శాశ్వత సంబంధం కోసం ఎదురుచూస్తారు. వీరు వివాహం చేసుకోవడానికి ఉత్తమ వయస్సు 20 సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంది.

సింహా రాశి
ఈ రాశి వారు వివాహం విషయంలో చాలా నిబద్ధతను కలిగి ఉంటారు. వారి భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవడంలొ కచ్చితమైన స్పష్టతను కలిగి ఉంటారు. వీరు 25 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంటే అన్ని విషయాల్లో కలిసి వస్తుంది.

కన్య రాశి..
ఈ రాశి వారు అన్ని విషయాలలో పరిపూర్ణంగా ఉండాలి. వీరికి వివాహ బంధం లేదా ఉద్యోగంలో రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలో బాగా తెలుసు. వీరు వివాహం చేసుకోవడానికి సరైన వయసు 25 నుండి 27 సంవత్సరాలు.

తుల రాశి..
ఈ రాశి వారు వివాహం కోసం చాలా ఓపికగా ఉండాలి. వీరి వివాహానికి సంబంధించినంతవరకు సరైన వయసు 20 సంవత్సరాల నుండి ప్రారంభమవుతుంది.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు చాలా బిజీగా ఉంటారు. వీరు కొన్నిసార్లు అభద్రత, నమ్మకం లేకపోవడం వంటి కారణాల వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక వీరి వివాహ వయసు విషయానికొస్తే వీరు 24 నుండి 26 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోవడం ఉత్తమం. అయితే వీరు ప్రేమ వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు ఎక్కువ స్వేచ్ఛ కోసం ఆరాటపడతారు. వీరు చాలా నిబద్ధతను కలిగి ఉంటారు. ఈ కారణంగా వీరురు ఎప్పుడైనా ఏదైనా సంబంధం లేదా బాధ్యతలతో ముడిపడి ఉండటానికి ఇష్టపడరు. అయితే 30 ఏళ్లు పైబడిన తర్వాత వివాహం చేసుకోవడం ఉత్తమం. అప్పుడు వీరి వివాహంలో ప్రేమ లభిస్తుంది.

మకర రాశి..
ఈ రాశి వారికి పని మరియు ఇంటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో బాగా తెలుసు, కాబట్టి స్థిరత్వం యొక్క ఆలోచన వీరిని భయపెట్టదు. వారు ఏ వయస్సులోనైనా వివాహం చేసుకోవచ్చు. కానీ వీరు ప్రాధాన్యతనిచ్చే దానిపై ఆధారపడి ఉంటుంది. వారు 20-25 మధ్య వివాహం చేసుకోవచ్చు.

కుంభ రాశి
ఈ రాశి వారు జీవనశైలిని ఎన్నుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆలస్యంగా వివాహం చేసుకోవడమే వీరికి మంచిది. వారు 30 ఏళ్లు పైబడిన ఏ సమయంలోనైనా వివాహం చేసుకోవచ్చు.

మీన రాశి..
ఈ రాశి వారు తమ జీవితంలో అవసరమైన ప్రతిదాన్ని కలిగి ఉన్న తర్వాతే వివాహం చేసుకోవాలని భావిస్తారు. కానీ వీరి వివాహ వయస్సు కేవలం 26 సంవత్సరాలు.



Click it and Unblock the Notifications
