Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Happy Children's Day 2022 : చాచాజీ కోట్స్ ను మీ చిన్నారులతో షేర్ చేసుకోండి...
బాలల దినోత్సవ శుభాకాంక్షలను మీ పిల్లలకు ఇలా చెప్పండి..
మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన 'బాలల దినోత్సవంగా' జరుపుకుంటాం. ఈరోజంటే చిన్నపిల్లలందరికీ ఎంతగానో ఇష్టం. ప్రపంచ దేశాలన్నీ ఈ బాలల దినోత్సవాన్ని నవంబర్ 20వ తేదీన జరుపుకుంటే మనం మాత్రం చాచాజీ పుట్టినరోజు అయిన నవంబర్ 14వ తేదీనే జరుపుకుంటాం. ఎందుకంటే మన దేశానికి తొలి ప్రధానిగా సేవలందించిన జవహార్ లాల్ నెహ్రుకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం.

ఆయన జీవితంలో తాను ఎక్కువ కాలం జైళ్లలోనే గడిపారంట. దీని వల్ల తనకు ఉన్న ఒక్కగానొక్క కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఆయన ఎక్కువ సమయం గడపలేకపోయారు. కానీ తను దేశంలోని పిల్లలందరినీ కన్న బిడ్డలుగా ప్రేమించే స్వభావంతో ఉండేవారు.

'పిల్లలతో గడిపే సమయంలో నా మనసు హాయిగా ఉంటుంది. నాకు వారితో ఉన్నప్పుడల్లా ఏదో పవిత్రమైన స్థలంలో ఉన్నట్లు అనిపిస్తుంది. వారితో లభించే శాంతి, ఆనందం ఎక్కడ లభించవు' అని నెహ్రు అనేవారు. పిల్లలను జాతి సంపదగా భావించి, అందరూ వారి భవితవ్యం కోసం పని చేయాలని చాచాజీ తరచుగా చెప్పేవారు. అందుకే మన దేశంలో తన పుట్టినరోజు సందర్భంగా బాలలంతా పండగా చేసుకుంటారు. ఈ నేపథ్యంలో మీ చిన్నారులకు పండిట్ జవహార్ లాల్ నెహ్రు చెప్పిన కొన్ని ముఖ్యమైన కోట్స్ గురించి తెలియజేయండి.. మీరు కూడా ఓ సారి గుర్తు చేసుకోండి...
బాలల దినోత్సవం గురించి మీరు తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయాలు..

మనం చేసేవే..
‘పిల్లలు ఎలా ఉండాలో..
పేరేంట్స్ నేర్పడానికి బదులు..
వారే ఆచరిస్తే మంచిది..
ఎందుకంటే వారు చేసేవే పిల్లలు చేస్తారు కాబట్టి..'
- జవహార్ లాల్ నెహ్రు

ఫలితం ఎలా ఉంటుందో..
‘ధైర్యంగా పని చేసే వారే విజయం సాధిస్తారు..
ఫలితం ఎలా ఉంటుందో భయపడేవారిని
ఎప్పటికీ విజయం వరించదు'
- జవహార్ లాల్ నెహ్రు

ఏం సాధించామనేది ముఖ్యం..
‘కాలానికి కొలమానం సమయం గడిచిపోవడం కాదు..
ఆ సమయంలో మనం ఏం సాధించామనేది ముఖ్యం'
- జవహార్ లాల్ నెహ్రు

ఎక్కువ విశ్రాంతి..
‘ఎక్కువ విశ్రాంతి అనేది ఎప్పటికీ అనర్థమే'
- జవహార్ లాల్ నెహ్రు

ఫలితం దానంతట అదే..
‘మనం చేసే పనిని ఇష్టపడితే..
ఫలితం దానంతట అదే వస్తుంది..'
- జవహార్ లాల్ నెహ్రు

వినయంగా ఉండటం..
‘విద్యతో పాటు వినయంగా ఉండటం కూడా నేర్చుకోవాలి'
- చాచాజీ నెహ్రు

మరింత గట్టిగా..
‘ఒకసారి దెబ్బ పడిన తర్వాత కూడా..
జాగ్రత్తపడకపోతే.. ఆ వ్యక్తి తర్వాత
మరింత గట్టిగా దెబ్బ తింటాడు..
అప్పుడు పుంజుకోవడం కష్టమవుతుంది'
- జవహార్ లాల్ నెహ్రు

మంచి లక్ష్యాలను..
‘బాల్యంలో మంచి అలవాట్లు అలవడితేనే..
పెద్దయ్యాక మంచి లక్ష్యాలను సాధించగలరు'
- చాచాజీ నెహ్రు

లక్ష్యం సాధించలేని..
‘లక్ష్యం సాధించలేని జ్ణానం నిరుపయోగమైంది'
- జవహార్ లాల్ నెహ్రు

విజయానికి ఒక గుణపాఠంగా..
‘ఓటమి ఎదురవ్వగానే నిరాశ పడకూడదు..
అది విజయానికి ఒక గుణపాఠంగా మారాలి'
- చాచాజీ నెహ్రు
సాధారణంగా ప్రపంచ బాలల దినోత్సవాన్ని నవంబర్ 20వ తేదీన జరుపుకుంటారు. కానీ మన దేశంలో మాజీ ప్రధాని పండిట్ జవహార్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా అంతకంటే ఆరు రోజుల ముందే అంటే నవంబర్ 14వ తేదీన జరుపుకుంటాం.



Click it and Unblock the Notifications