Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
Jupiter Retrograde in Aquarius: జూన్ 20న కుంభంలో గురుడి తిరోగమనం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం..!
జూన్ 20వ తేదీ నుండి గురు గ్రహం కుంభ రాశిలోకి తిరోగమనం చెందనుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో గురుడికి విశేష స్థానముంది. గురుడి అనుగ్రహం ఉంటే విద్య, జ్ణానం, ఆదాయం సులభంగా లభిస్తుంది పండితులు చెబుతుంటారు.

అంతటి విశిష్టత కలిగి ఉన్న గురుడు జూన్ 20వ తేదీన తన స్థానాన్ని మారనున్నాడు. కుంభ రాశిలోకి తిరోగమనం చేయనున్నాడు. ఇక్కడే సెప్టెంబర్ వరకు సంచారం చేయనున్నాడు.

గురుడు ఇలా తిరోగమనం చేయడం వల్ల ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. కొన్ని రాశులపై సానుకూల ప్రభావం పడనుండగా.. మరికొన్ని రాశులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుందట.

ఈ నేపథ్యంలో కుంభ రాశిలోకి గురుడు తిరోగమనం వల్ల ఈ ఐదు రాశుల వారికి నెగిటివ్ ఫలితాలు రానున్నాయట. ఇంతకీ ఆ రాశులేవి.. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందో లేదో మీరే చూడండి...

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, విద్య, సంపదకు కారకంగా భావించే గురుడు మేష రాశి నుండి 11వ పాదంలో తిరోగమనం చెందనున్నాడు. ఈ స్థానం లాభదాయకమైనదే. కానీ గురుడు తిరోగమనం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వ్యాపారులు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ కాలంలో ఎవ్వరికీ అప్పులు ఇవ్వకూడదు. రుణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరి నుండి అప్పులను కూడా తీసుకోకండి.
పరిహారం : గురుడి అనుగ్రహం కోసం ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించే అనుకూల ఫలితాలు వస్తాయి.

మిధున రాశి..
గురుడు ఈ రాశి నుండి తొమ్మిదో స్థానం గుండా సంచారం చేయనున్నాడు. ఈ స్థానం ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలను సూచిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రాశి వారు బాగా కష్టపడితే మంచి ఫలితాలను పొందుతారు. అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండొచ్చు. ముఖ్యంగా మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ తండ్రికి ఈ సమయంలో ఎక్కువ సేవ చేయాలి.
పరిహారం: గురుడి తిరోగమనం సమయంలో మీరు గురువులను గౌరవించి, వారికి సేవలు చేయాలి.
Ketu Nakshatra Transit 2021: కేతువు అనురాధ నక్షత్రంలోకి ఎంట్రీ.. 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!
సింహ రాశి..
ఈ రాశి నుండి గురు గ్రహం ఏడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ స్థానం దాంపత్య జీవితానికి సంబంధించినదిగా భావిస్తారు. ఈ సమయంలో వివాహితులకు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామితో గొడవలు ఉండొచ్చు. కాబట్టి మీరు ఈ సమయంలో మీ పార్ట్ నర్ ఫీలింగ్స్ ను చాలా ఆలోచనాత్మకంగా వ్యక్తపరచాలి. ముఖ్యంగా మీ భాగస్వామిని ఇబ్బంది పెట్టే ఏ పనిని చేయకండి.
పరిహారం : గురువారం రోజున పసుపు వస్తువులను దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి గురుడు మూడో స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుడి ప్రభావం వల్ల మీరు ఈ సమయంలో మాటలను స్పష్టంగా మాట్లాడటం కూడా కష్టంగా మారుతుంది. మీ కుటుంబ జీవితంలో తోబుట్టువులతో విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మాట్లాడే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఈ కాలంలో మీ ధైర్యం, శౌర్యం కూడా తగ్గిపోవచ్చు.
పరిహారం : గురుడి అనుగ్రహం కోసం పసుపు రంగు వస్త్రాలను దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మీన రాశి..
ఈ రాశి నుండి గురుడు 12వ స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీరు శుభకార్యాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు. మీరు చేపట్టిన పనులు, ప్రారంభించే పనుల్లో కూడా అడ్డంకులు ఎదురవుతాయి. మీ ఇంట్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. దీని వల్ల మీకు ఒత్తిడి తగ్గిపోతుంది. అయితే మీరు ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. శుభ కార్యాల నిమిత్తం ఎక్కువ పర్యటనలు చేసే అవకాశం ఉంటుంది.
పరిహారం : గురువారం రోజున గురు మంత్రాలను జపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.



Click it and Unblock the Notifications