For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మే డే 2020 కోట్స్, విషెస్, మెసెజెస్ ను షేర్ చేయండి... ప్రపంచ కార్మికులను ఏకం చేయండి..

|

ప్రపంచ కార్మికులారా ఏకం కండి... ఐక్యమత్యాన్ని చాటండి... అన్న నినాదం మార్మోగిన రోజు మే డే రోజు. యావత్ ప్రపంచం మే 1వ తేదీన కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఈ కార్మికుల పండుగను ఏ ఒక్క దేశానికో.. లేదా ఏ ఒక్క సంఘటనకో పరిమితం చేసే పరిస్థితి లేదు.పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేక కార్మిక వర్గం నినదించిన రోజు మే డే. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదని మహాకవి శ్రీశ్రీ అన్నాడు. మన సమాజ గతిని... పురోగతిని శాసించేది.. నిర్దేశించేది శ్రామిక వర్గం. ఆ శ్రమే వెట్టిచాకిరికి గురైనప్పుడు ఏమౌతుంది. శ్రామికుడు దోపిడీకి గురైనప్పుడు ఏం జరుగుతుంది. కష్టించి పని చేసే చేతులు పిడికిళ్లు బిగిస్తాయి.. భూకంపాలను తీసుకొస్తాయి..ఉద్యమాలు పుట్టుకొస్తాయి.

ఈ మే డే కార్మికులు సాధించిన విజయానికి నిలువెత్తు నిదర్శనం. అయితే ఈ ఉద్యమం మొట్టమొదటి అగ్రరాజ్యం అయిన అమెరికాలోని షికాగోలోని హే మార్కెట్ లో 1886వ సంవత్సరంలో కార్మికుల హక్కుల కోసం మొదలై అంచెలంచెలుగా అన్ని దేశాలకు వ్యాపించింది. అలా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఉద్యమ ఫలితంగానే ప్రతి సంవత్సరం మే 1వ తేదీన కార్మిక దినోత్సవం పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా మే డే యొక్క అద్భుతమైన కోట్స్, సందేశాలను మీ బంధుమిత్రులకు, స్నేహితులకు, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి...

కార్మికుడా..

కార్మికుడా..

నీవు లేకపోతే మాకు ఇవేవీ సాధ్యమయ్యేవి కావు

‘‘శ్రమైక జీవన సౌందర్యం..

అందరికీ 8 గంటల పనిదినం..

వారానికొక సెలవు దినం‘‘

కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు...

మిత్రమా...

మిత్రమా...

‘‘ఓటమి నీ రాత కాదు..

గెలుపు ఎవడి సొత్తు కాదు..‘‘

నేడే మేడే.. కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు

శ్రమించి చూడు.

శ్రమించి చూడు.

‘‘ నిన్న మరిచి నేడు శ్రమించి చూడు..

రేపు తప్పకుండా గెలుపు తలుపు తడుతుంది‘‘

కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు...

మీకు గొప్ప సమయం..

మీకు గొప్ప సమయం..

‘‘మీరు చాలా కష్టపడ్డారు. మీ కృషి మరియు అవిరామ ప్రయత్నాలు మాత్రమే దేశాభివృద్ధికి సహాయపడ్డాయి. మీకు గొప్ప సమయం ఉంది.

మీకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. "

ఎప్పటికీ మరచిపోలేము..

ఎప్పటికీ మరచిపోలేము..

‘‘ప్రపంచ వీరులకు, దేశానికి, మీరు పని చేసిన కార్యాలయానికి మీ సహకారాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము. ప్రపంచంలోని కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు‘‘

అన్నింటా మే‘మే‘..

అన్నింటా మే‘మే‘..

‘‘అన్నింటా మే‘మే‘..

యంత్రమై కదిలా‘డే‘..

మానవ మనుగడకు ఊపిరినయ్యా!

కాల గమనంలో ఓ పుటగా మిగిలా!

కదిలాడే యంత్రంలా కరిగిపోతున్నా..

దయలేకపోయనే ఈ జగతికి‘‘

కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు...

కార్మికుడే రారాజు

కార్మికుడే రారాజు

‘‘కార్మికుల కష్టానికి ఫలితం దక్కిన రోజు..

స్ఫూర్తిని రగిలించే రోజు..

ప్రపంచవ్యాప్తంగా పండగ రోజు ఈరోజు..

కరోనా వంటి సమయంలోనూ కార్మికుడే రారాజు‘‘

కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు...

నీచంగా బతికే బదులు..

నీచంగా బతికే బదులు..

‘‘ఒకరి కాలికింద బానిసల నీచంగా బతికే బదులు..

లేచి నిలబడి ప్రాణం విడిచిపెట్టడం మేలు‘‘

కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు...

కరోనాను కట్టడి చేయడలో..

కరోనాను కట్టడి చేయడలో..

‘‘కార్మికుడు సైనికుడిగా..

కార్మికుడు రథసారథిగా..

కార్మికుడు ప్రజల వారధిగా..

కరోనాను కట్టడి చేయడలో తన వంతుగా

ఎన్నో బాధ్యతలను నెరవేరుస్తున్న ఓ కార్మికుడా నీకు వందనం..‘‘

కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు...

శ్రమను గౌరవిద్దాం...

శ్రమను గౌరవిద్దాం...

‘‘శ్రమను గౌరవిద్దాం..

శ్రమను గుర్తిద్దాం..

శ్రమ చేద్దాం..‘‘

కార్మికులందరికీ మే డే శుభాకాంక్షలు...

English summary

May Day 2020: Quotes, Wishes And Messages That Will Empower You

May Day is observed on 1 May every year. The day marks the revolution led by several labourers and workers demanding for improved reduced working hours and better work conditions.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more