For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ మొరటు విషయాలతో మీకు మొదటికే మోసం జరుగుతుందని తెలుసా..

|

ప్రస్తుతం ఉన్న నాగరిక ప్రపంచంలో చాలా మంది చాలా రకాలుగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా మన దేశంలో అయితే మరీ భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఇలా ప్రతిరోజూ మనకు తెలిసే కొన్ని మొరటు పనులు లేదా అనాగరిక పనులు చేస్తుంటాం. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1) అడగకుండానే అభిప్రాయాలను చెప్పడం..

1) అడగకుండానే అభిప్రాయాలను చెప్పడం..

మీ మనసులో ఉన్నది చెప్పడం కొన్నిసార్లు మీకు సహాయపడుతుంది. కానీ అన్ని సందర్భాల్లో ఇది మంచిది కాదు. చాలా సందర్భాల్లో చాలా మంది మనకు మనకు ఉచిత సలహాలు ఇవ్వడం, వారి అభిప్రాయాలను మనపై రుద్దడం చేస్తుంటారు. అంతేకాదు మనం కూడా మన అభిప్రాయాలను కొన్నిసార్లు అవసరం లేకపోయినా ముందే చెప్పేస్తుంటాం. కానీ ఇది కరెక్టు కాదు. మీ అభిప్రాయాన్ని అడిగినప్పుడు మాత్రమే మీరు మాట్లాడటం మంచిది. లేకపోతే మీ చుట్టుపక్కల వారి మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు అసభ్యంగా ప్రవర్తించే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

2) పరిచయం చేయడంలో విఫలం..

2) పరిచయం చేయడంలో విఫలం..

Image curtosy

తొలిసారి ఒకరినొకరు కలుసుకున్న ఇద్దరు వ్యక్తులు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను మీరు కలిసినప్పుడు పరిచయం చేసుకోవడంలో విఫలమవుతుంటారు. అంతేకాదు మీకు తెలిసిన వారిని కూడా ఇతరులకు పరిచయం చేయడంలో విఫలమవుతారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. నలుగురితో పరిచయం పెంచుకుంటేను మనకు మంచిదని గుర్తుంచుకోవాలి.

 3) ఫోన్ చూస్తూ నడక..

3) ఫోన్ చూస్తూ నడక..

మీరు రద్దీగా ఉండే ప్రాంతాల్లో లేదా మార్కెట్ల వంటి చోట్ల ఫోన్ చూస్తూ నడుస్తుంటారు. లేదా ఫోన్ లో టైపు చేస్తూ నడవటం అంత మంచిది కాదని మీకు తెలిసినా మీరు మాత్రం వాటిని ఆపరు. పైగా మీ చుట్టూ ఉన్నవారితో అసభ్యంగా ప్రవర్తిస్తారు. కాని ట్రాఫిక్ జామ్ లేని చోట ఖాళీ చోట్ల కేవలం కొంత సమయం మీరు ఇలా చేయొచ్చు.

4) పబ్లిక్ టాయ్ లెట్సులో ఫోన్ కాల్స్ మాట్లాడటం..

4) పబ్లిక్ టాయ్ లెట్సులో ఫోన్ కాల్స్ మాట్లాడటం..

ఈ మధ్యన స్మార్ట్ ఫోన్లు, చిన్న ఫోన్ల ధరలు తగ్గినప్పటి నుండి ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటోంది. ఇంటికి మరుగుదొడ్డి లేకపోయినా సెల్ ఫోన్ మాత్రం కంపల్సరీగా ఉంటోంది. ఇక దీన్ని ఎక్కడబడితే ఎలా పడితే అలా ఎడాపేడా వాడేస్తున్నారు. ఈ మధ్య చాలా చోట్ల చాలా మంది పబ్లిక్ టాయ్ లెట్లలో కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నారు. ఇది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు.

5) సేవా స్థానాల్లో ఉన్నవారికి ‘‘ధన్యవాదాలు‘‘ కూడా చెప్పడం లేదు..

5) సేవా స్థానాల్లో ఉన్నవారికి ‘‘ధన్యవాదాలు‘‘ కూడా చెప్పడం లేదు..

మీరు సేవా స్థానాల్లో ఉండే వారితో సంభాషణలు చేసేటప్పుడు ‘‘దయచేసి‘‘ లేదా ‘‘ధన్యవాదాలు‘‘ అనే పదాల గురించే పట్టించుకోవడం లేదు. మీరు ఆహ్లాదకరమైన ఆహారాన్ని పొందడానికి సమయం పొందడమే కాకుండా, మీకు కావాల్సిన వాటిని సమయానికి అనుగుణంగా పొందగలుగుతుంటే మీరు మాత్రం అందుకు కారణమైన వారిని విస్మరిస్తున్నారు. ఇప్పటికైనా సేవ చేసే వారి వద్ద ధన్యవాదాలు లేదా దయచేసి వంటి పదాలను ఉపయోగించండి.

6) ఇతరులకు దారి ఇవ్వరు..

6) ఇతరులకు దారి ఇవ్వరు..

కొంతమంది ట్రాఫిక్ లో చిక్కుకుంటే చాలా చిరాకు పడతారు. ఇంకా కొంతమంది ఆనందిస్తారు. ఎందుకంటే వారు ట్రాఫిక్ లో చిక్కుకుని ఇతరులకు కొంచెం కూడా దారి ఇవ్వరు. ఇది చాలా అనాగరికమైనది. దీని వల్ల సమస్య మరింత జఠిలమవుతుందని తెలిసినా వారు ఏ మాత్రం పట్టించుకోరు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి. మీకు వీలు కాలేనప్పుడు ఇతరులకు వెళ్లే అవకాశముంటే కచ్చితంగా వారికి దారి ఇవ్వాలి.

7) చిరాకు పడటం..

7) చిరాకు పడటం..

మీరు ప్రతిరోజూ ఏదో ఒక విషయం పట్ల చిరాకు పడుతుంటారు. లేదా కోపం పడుతుంటారు. అందుకు ఏవేవో కారణాలుంటాయి. ఉదాహరణకు ఎవరైనా మీ గురించి తప్పుగా ప్రస్తవించినప్పుడు మీకు కోపం వస్తుంది. కానీ మీరు ఆ సమయంలో అద్దంలో చూసుకుంటే మీ ప్రతిబింబం చూస్తే మీకే చిరాకు పుడుతుంది. కాబట్టి ఆహ్లాదకరమైన ముఖాన్ని తయారు చేసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. మీ ముఖాన్ని అద్దంలో చిరునవ్వుతో చూసుకోండి. కొంతకాలం తర్వాత మీరు చిరాకు పడటం, కోపం పెంచుకోవడం వంటివి తగ్గించుకుంటారు.

8) బహిరంగంగా స్పీకర్ ఫోన్ ను ఉపయోగించడం..

8) బహిరంగంగా స్పీకర్ ఫోన్ ను ఉపయోగించడం..

ఈ మధ్యన చాలా మంది ఫోన్లలో మాట్లాడుతూ టెలిఫోన్ మర్యాదను మాయం చేస్తున్నారు. సాధారణంగా ఫోన్ లో స్పీకర్ ను ఎప్పుడు ఆన్ చేస్తారో అందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్యన చీటికి మాటికి బహిరంగ ప్రదేశాల్లో స్పీకర్ ఫోన్ ను వాడుతున్నారు. ఇది చాలామొరటుగా అనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ వాడండి. లేదా స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడండి.

9) ఇతరుల గురించి చెప్పడం..

9) ఇతరుల గురించి చెప్పడం..

చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇతరుల గురించి చెప్పి విసిగిస్తుంటారు. మీరు కూడా వారిలాగా కావాలి. మీరు మీలా ఉంటే ఏమి చేతకాని వారిలా అవుతారు. తల్లిదండ్రులు ఒక్కటే కాదు బంధువులు, స్నేహితులు కూడా ఇలాంటి వాటిలో ముందు ఉంటారు. ఎంతసేపు ఇతరుల గురించి చెబుతుంటారు కాని, మనకు ఏమి కావాలో అని అడగరు. అందుకే ముందు వారికి ఏమి కావాలో తెలుసుకోండి. వారికి అనవసరంగా ఇతరుల గురించి చెప్పకండి.

10) పొగడ్తలు..

10) పొగడ్తలు..

చాలా మందికి పొగడ్తలను అంగీకరించడం అనేది ఒక సవాలుగా ఉంటుంది. అది నమ్రత, ఆత్మగౌరవం లేకపోవడం లేదా ప్రశంసలకు అర్హులే అన్న భావన వల్ల అయినా, మన సన్నిహితుల నుండి మనం మంచి విషయాలు వినడం కష్టం. కానీ పొగడ్తలను మాత్రం పూర్తిగా తిరస్కరించలేం. అయితే అది అభద్రతలను శాశ్వితం చేయడమే కాదు. అది అనాగరికంగా కూడా అనిపిస్తుంది.

English summary

These Rude Things You Didn’t Realize You’re Doing Every Day

Here we talking about these rude things you didn’t realize you’re doing every day. Read on
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more