Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
Today Rasi Phalalu :ఓ రాశి ఉద్యోగుల కష్టానికి ఇతరులకు క్రెడిట్...!
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మరాశిని బట్టి ఇవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?
రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ 'శుభకృత్' నామ సంవత్సరం, ఛైత్ర మాసంలో బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
ఈ రాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. మీ జీవితంలో కొన్ని పెద్ద మార్పులు జరగొచ్చు. అది వ్యక్తిగత లేదా వృత్తిపరమైన జీవితం అయినా, మీరు కొన్ని సానుకూల మార్పులను చూడొచ్చు. మీరు ఉద్యోగం చేస్తే, ఆఫీస్‌లోని బాస్ మీ కష్టాన్ని గమనించగలరు. ఈరోజు మీరు మీ పురోగతికి సంకేతాన్ని కూడా పొందొచ్చు. ఈరోజు వ్యాపారవేత్తలకు పెద్ద సవాలును తీసుకురావొచ్చు. కానీ మీరు ఈ కష్టాన్ని పూర్తి ధైర్యంతో ఎదుర్కొంటారు. మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో మంచి సామరస్యం ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు చాలా మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : డార్క్ బ్లూ
లక్కీ నంబర్ :31
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 2:45 నుండి రాత్రి 9:30 గంటల వరకు

వృషభరాశి : ఏప్రిల్ 20 - మే 20
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో కొత్త మలుపు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీరు ఇంటి పెద్దల ఆశీస్సులు పొందుతారు. మీ ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో పనిని జాగ్రత్తగా చేయాలి. మీరు చాలా ఓపికతో ఉండాలి. ప్రశాంతమైన మనస్సుతో మీ పనిని చేయడానికి ప్రయత్నించండి. మీరు మంచి ఫలితాలను పొందుతారు. మరోవైపు, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఈ కాలంలో ఆర్థిక పరంగా మంచి అవకాశాలను పొందుతారు. ఆరోగ్య పరంగా ఈ కాలం ఖరీదైనది.
లక్కీ కలర్ : లైట్ ఎల్లో
లక్కీ నంబర్ :25
లక్కీ టైమ్ : ఉదయం 7:20 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20
ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు ఆశించిన ఫలితాలను పొందొచ్చు. ప్రత్యేకించి మీ పని ఆస్తికి సంబంధించినది అయితే, ఈరోజు మీరు పెద్ద ఒప్పందం చేసుకోవచ్చు. మీరు మీ ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇస్తారు. మరోవైపు ఈరోజు ఉద్యోగులకు ఆఫీసులో పని భారం ఎక్కువగా ఉంటుంది. అయితే, మీరు చాలా యాక్టివ్‌గా కనిపిస్తారు. మీ పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామికి తగినంత సమయం ఇవ్వడానికి ప్రయత్నించండి. లేకపోతే మీ వైవాహిక జీవితంలో అసమ్మతి పెరుగుతుంది. మీరు ఒకరి భావాలను మరొకరు గౌరవించుకోండి. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :34
లక్కీ టైమ్ : ఉదయం 4 నుండి సాయంత్రం 5:15 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 21
ఈ రాశి వారిలో వివాహితులకు ఈరోజు శృంగార జీవితంలో స్థిరత్వం ఉంటుంది. ఈరోజు మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపగలుగుతారు. మీరు మీ సంబంధానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయం కూడా తీసుకోవచ్చు. ఈ రాశికి చెందిన వివాహితులకు ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. చాలా కాలం తర్వాత, మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని శృంగార క్షణాలను గడుపుతారు. గతానికి సంబంధించిన ఏదైనా మంచి జ్ఞాపకం మరోసారి రిఫ్రెష్ అవుతుంది. మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీరు ఈరోజు విలువైన వస్తువును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఈరోజు దానికి అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు ఈరోజు ఆర్థిక పెద్ద లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ : సాయంత్రం 5:05 నుండి రాత్రి 8:55 గంటల వరకు

సింహ రాశి (జూలై 22-ఆగస్టు 21):
ఈ రాశి వారికి ఈరోజు ఇంటి సభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తుంది. మీరు మీ తండ్రితో కూడా ఒక ముఖ్యమైన చర్చను కలిగి ఉండొచ్చు. మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటే, మీ ప్రియమైన వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే, మీ భాగస్వామితో వివాదాలను నివారించాలి. మీరు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని బలపరచుకోవాలి. ఉద్యోగస్తుల్లో మార్పు రాబోతోంది. త్వరలో మీకు మంచి అవకాశాలు రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు కొన్ని సమస్యలు వస్తాయి. దీంతో మీ మనస్సు చికాకుగా ఉంటుంది. ఈరోజు పెరుగుతున్న మానసిక ఒత్తిడి కారణంగా మీ శారీరక ఆరోగ్యం కూడా కొంత బలహీనంగా ఉంటుంది.
లక్కీ కలర్ : ఆరెంజ్
లక్కీ నంబర్ :4
లక్కీ టైమ్ : ఉదయం 9:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులు, తమ కష్టానికి తగిన ఫలితాలను పొందొచ్చు. మీరు గొప్ప పురోగతిని సాధించే అవకాశం ఉంది. ఆఫీసులో మీరు ఉన్నత పదవిని పొందొచ్చు. దీంతో పాటు మీకు కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. వ్యాపారస్తులకు ఈరోజు మంచి ఆఫర్లు రావొచ్చు. మీరు తెలివిగా వ్యవహరిస్తే, త్వరలో మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీ వ్యాపారం కొత్త దిశలో పయనిస్తుంది. మీ ఇంటి సభ్యులతో మీ ప్రవర్తన మర్యాదగా ఉండండి. మీరు మీ జీవిత భాగస్వామికి సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే, ఈరోజు దానికి సరైన రోజు. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యానికి సంబంధించినంతవరకు, మీకు నరాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండొచ్చు.
లక్కీ కలర్ : డార్క్ రెడ్
లక్కీ నంబర్ :12
లక్కీ టైమ్ : ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
Ketu Transit 2022 :తుల రాశిలోకి కేతువు సంచారం.. 12 రాశుల జీవితాలు ఎలా మారతాయంటే...!

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22
ఈ రాశి వారికి ఈరోజు సాధారణం కంటే మెరుగైన రోజు అవుతుంది. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ఉన్నతాధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పని వేగవంతమవుతుంది. మరోవైపు, వ్యాపార వ్యక్తులు పెద్ద కస్టమర్లతో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని పొందొచ్చు. దీంతో మీ ఆర్థిక పరిమితులను కూడా ఈరోజు అధిగమించొచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలలో మంచి సామరస్యం ఉంటుంది. మీరు మీ ప్రియమైన వారి నుండి మానసిక మద్దతు పొందుతారు. మీరు ఇంట్లోని చిన్న సభ్యులతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీరు అనవసరమైన చింతలను విడిచిపెట్టి, మీ ముఖ్యమైన పనులపై దృష్టి పెట్టాలి.
లక్కీ కలర్ : లైట్ గ్రీన్
లక్కీ నంబర్ :20
లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21
ఈ రాశి వారికి ఈరోజు వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉండొచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో, సంభాషణ ద్వారా వారి మనస్సును తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మరోవైపు మీ శృంగార జీవితంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు మీ భాగస్వామితో చిన్న విషయంలో వాగ్వాదం జరగొచ్చు. మీ భాగస్వామి మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించకపోవడమే మంచిది. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీరు తెలివిగా ఖర్చు చేస్తారు. మీరు డబ్బు లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండండి. పని విషయంలో మిశ్రమ ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. మరోవైపు, వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.
లక్కీ కలర్ : గ్రీన్
లక్కీ నంబర్ :17
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21
ఈ రాశి వారిలో ఉద్యోగులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. బహుశా మీ కష్టానికి మరొకరు క్రెడిట్ తీసుకుంటారు. ఇది కాకుండా, వారు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి కూడా ప్రయత్నించొచ్చు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందొచ్చు. మీ పెండింగ్ పనులను ప్రారంభించడానికి చాలా కష్టపడతారు. మరోవైపు మీరు మీ ప్రియమైనవారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. వీలైతే, ఈరోజే ఇంట్లో గెట్ టు గెదర్ ప్లాన్ చేసుకోండి. ఇది మీ పరస్పర సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీరు తెలివిగా ఖర్చు చేయాలి. ఆరోగ్య పరంగా ఈరోజు గుండె జబ్బులు ఉంటే జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ కలర్ : ఎల్లో
లక్కీ నంబర్ :15
లక్కీ టైమ్ : ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19
ఈ రాశి వారిలో విద్యార్థుల చదువులకు కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. మీ ఈ సమస్య తాత్కాలికమే అయినప్పటికీ, మీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ పెద్దలు మరియు ఉపాధ్యాయుల సహాయంతో మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మరోవైపు ఉద్యోగులు ఓవర్ టైం పని చేయాల్సి ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల ఆప్యాయత మరియు మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో, మీరు షాపింగ్ మొదలైన వాటికి కూడా వెళ్ళొచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు చాలా ఫిట్ గా మరియు ఎనర్జిటిక్ గా అనిపించొచ్చు.
లక్కీ కలర్ : రోజ్
లక్కీ నంబర్ :11
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 10 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించొచ్చు. మీ ఆరోగ్యం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ బద్ధకం మరియు సోమరితనం కారణంగా, మీ ఏదైనా ముఖ్యమైన పని ఈ రోజు అసంపూర్తిగా మిగిలిపోతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ముందు మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. వ్యాపారస్తులు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల కోరిక మేరకు పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది. మీ వైవాహిక జీవితంలో ప్రేమ మరియు ఉత్సాహం లోపించొచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ జీవిత భాగస్వామిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా మంచిగా ఉంటుది. అయితే ఆదాయానికి మించి ఖర్చులు చేయొద్దు.
లక్కీ కలర్ : స్కై బ్లూ
లక్కీ నంబర్ :10
లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 6:30 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20
ఈ రాశి వారిలో వ్యాపారులకు చాలా అదృష్టకరమైన రోజు. మీ పని వేగవంతమవుతుంది. ఉద్యోగాలు చేసే వారికి కూడా ప్రగతి దారులు తెరుచుకుంటాయి. ఈరోజు మీరు పెద్ద కంపెనీ నుండి మంచి ఆఫర్‌ను పొందే బలమైన అవకాశం ఉంది. ఈరోజు మీరు ఆర్థిక పరంగా అదృష్టం యొక్క మద్దతును పొందొచ్చు. మీ ఆదాయం పెరగొచ్చు. ఇది కాకుండా, మీరు ఏదైనా పాత రుణాన్ని వదిలించుకోవచ్చు. ఈరోజు మీరు మానసికంగా చాలా మంచి అనుభూతి చెందుతారు. మీ విజయానికి ఇంటి పెద్దలు గర్వపడతారు. మరోవైపు, మీ జీవిత భాగస్వామి మద్దతు పొందడం మీ ఆనందాన్ని పెంచుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
లక్కీ కలర్ : వైట్
లక్కీ నంబర్ :12
లక్కీ టైమ్ : సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంటల వరకు
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications











