Latest Updates
-
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే!
నారీమణుల నడకను బట్టి శృంగార వాంఛలను అంచనా వేయొచ్చట...!
ఆడవారి నడకను బట్టి వారికి శృంగార కోరికలు ఏ మేరకు ఉంటాయో తెలుసుకోవచ్చట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత సమాజంలో చాలా మంది శృంగారం పట్ల ఎంతో ఆసక్తిని కలిగి ఉన్నారు. నవరసాలలో కూడా శృంగారానికే అధిక ప్రాధాన్యత ఉంది.

అయితే ప్రస్తుతం చాలా మంది వారి బిజీ ప్రపంచంలో పడిపోయి రొమాంటిక్ లైఫ్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు.

దీంతో వారికి లైంగిక పరంగా క్రమంగా ఆసక్తి తగ్గిపోతుంది. దీనికి స్త్రీ, పురుషులిద్దరూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవడమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే శృంగారం విషయంలో ఒక్కో వ్యక్తికి ఒక్కో రకమైన అభిప్రాయం, ప్రవర్తన అనేవి ఉంటాయి. ముఖ్యంగా మహిళల్లో శృంగార విషయాలపై ఆసక్తి అనేది మరోలా ఉంటుంది. వారి నడకను బట్టే వారిలో ఉన్న శృంగార కోరికలు, దక్షతను చెప్పొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకు సంబంధించి ఇటీవలే ఓ అధ్యయనం జరిపారు. అందులో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

శృంగార ప్రశ్నలు..
స్కాట్లాండ్ విశ్వవిద్యాలయంలోని కొందరు శాస్త్రవేత్తలు అమ్మాయిల నడకను బట్టి వారి శృంగార కోరికలను అంచనా వేయొచ్చని తెలిపారు. అందుకోసం వారు బహిరంగ ప్రదేశాలలో తిరిగే అమ్మాయిల ఫొటోలను తీశారు. అలాగే అందుకు సంబంధించిన ప్రత్యేక ప్రశ్నలను రూపొందించడమే కాదు.. వారి అభిప్రాయాలను కూడా రాబట్టారు.

నడుము తిప్పుతూ..
వారి పరిశోధనల ప్రకారం వయ్యారంగా నడమును తిప్పుతూ నడిచే వారికి శృంగార కోరికలు చాలా ఎక్కువగా ఉంటాయట. అయితే సైకాలజిస్టులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

లైంగిక కోరికలు..
మహిళల శరీర సౌష్టవం వారిలో లైంగిక అవయవాల పటిష్టత, దక్షతకు ప్రతీగా నిలుస్తుందని వారు నిర్వహించిన అధ్యయనంలో తేలిపోయింది. మొద్దుబారిపోయిన కండరాలకు, లైంగిక వాంఛలకు దగ్గర సంబంధాలు ఉన్నట్లు వారు స్పష్టం చేశారు.

ఆ సిగ్నల్స్ ద్వారానే..
లైంగిక అవయవాలు పటిష్టంగా ఉన్న మహిళల్లో ఆ కోరికలు అధికంగా ఉంటాయని, అయితే వారి పార్ట్ నర్ లో కూడా లైంగిక కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడే అది బయటపడుతుందని తెలిపారు. చాలా మంది మహిళలు వారి లైంగిక కోరికలను శరీర సిగ్నల్స్ ద్వారానే తెలియజేస్తారు..

రహస్యంగా మాట్లాడతారు..
చాలా మంది స్త్రీలు శృంగారంపై ఆసక్తి ఉన్నప్పటికీ, బహిరంగంగా మాట్లాడటానికి భయపడుతూ ఉంటారని, వారి పరిశోధనల్లో తేలింది. వారు అలాంటి ధోరణిని ఎందుకు కలిగి ఉంటారో కారణాలను కూడా చెప్పారు.

చిన్ననాటి నుండే..
చాలా మంది ఆడవారు చిన్ననాటి నుండే శృంగారం అనే పదంపై వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటారు. దీంతో వారు శృంగారంపై మాట్లాడేందుకు అంతగా ఆసక్తి చూపరు. అసలు ఆ కార్యం అంటేనే తప్పు అనే భావన వారిలో ఉంటుంది.

ఏకాంతంగా గడిపేందుకు..
మరికొందరు స్త్రీలయితే చిన్న వయసులోనే ఎదుర్కొన్న లైంగిక వేధింపుల కారణంగా, శృంగార చర్యపై కొంత వ్యతిరేక భావనను కలిగి ఉంటారు. వీరు వివాహం తర్వాత కూడా భర్తతో కలిసి ఏకాంతంగా గడిపేందుకు ఆసక్తి కూడా చూపించరు.

ఆనందం కనిపించదు..
కొందరు మహిళలు శృంగారం సమయంలో చాలా భయపడుతూ ఉంటారు. అందుకే వారిలో ఆ కార్యంలో పాల్గొన్నామన్న ఆనందం కూడా కనిపించదు. శృంగారంపై వారికి అవగాహన లేకపోవడం తదితర కారణాల వల్లే ఇలా జరుగుతుందని చెప్పొచ్చు.

ఇతర కారణాలు..
వారికి శృంగారంలో పాల్గొన్నప్పుడు అసౌకర్యంగా ఉండటం చికాకుగా ఉండటం మరియు లైంగిక చర్యలో స్రావాలు విడుదల కానప్పుడు కూడా శృంగారంలో పాల్గొన్నామన్న ఆనందమే వారిలో కనిపించదు. కొన్నిసార్లు అనారోగ్య కారణాలతో కూడా వారు శృంగారం పట్ల అనాసక్తిని చూపుతారు. ఇలాంటి సమస్యల నుండి బయటపడాలంటే వెంటనే వైద్యులతో కౌన్సెలింగ్ తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.



Click it and Unblock the Notifications











