For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేడు ప్రపంచ మానవతా దినోత్సవం : చరిత్ర, ప్రాముఖ్యత విశేషాలు..

మానవతావాదం ఐక్యతను ప్రసాదిస్తుంది. ఇది స్వేచ్ఛ, జ్ఞానం, నీతి కోసం హేతువు, ఐక్యత తప్పకుండా ఉండాలి. ఐక్యత వల్ల కూడా సహనం కూడా పెరుగుతుంది. కానీ ప్రస్తుత సమాజంలో చాలా మందిలో ఐక్యత కొరవడింది. ప్రతి దానికి

|

ప్రస్తుత సమాజంలో మానవత్వం అనేది మచ్చుకైన కనిపించడం కష్టమైపోయింది. మానవత్వం చాలా చోట్ల మంటగలుస్తూనే ఉంది. చాలా మంది బిజీ లైఫ్ పేరిట మానవత్వ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నారు. కానీ కొందరు మాత్రం మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అందరికంటే ముందుగా మన దేశ సైనికులు అసాధారణ సేవలందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ తో సహా పలు రాష్ట్రాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను సైనికులు, ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది అత్యంత సాహసోపేతంగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందరి మన్ననలు సైతం అందుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆగస్టు 19న ప్రపంచ మానవతా దినోత్సవం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మానవతా ప్రయత్నాలను గౌరవించేందుకు.. సంక్షోభంలో ఉన్న ప్రజలకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనను ప్రచారం చేసేందుకు సమాయత్తం అయ్యింది. ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడంలో వారి నిరంతర సహకారాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉంది.

మానవతా దినోత్సవాన్ని ఎప్పుడు ప్రకటించారంటే..

మానవతా దినోత్సవాన్ని ఎప్పుడు ప్రకటించారంటే..

2003లో ఇరాక్ దేశంలోని బాగ్దాద్ లోని ఐక్యరాజ్యసమితి ముఖ్య కార్యాలయంలో ప్రమాదవశాత్తు బాంబు పేలడంతో అప్పటి సెక్రెటరీ జనరల్ కు ఇరాక్ ప్రత్యేక ప్రతినిధి సెర్గియో వియర డి మెల్లోతో సహా 21 మంది వారి అనుచరులు అక్కడికక్కడే మృతి చెందారు. అందుకు గుర్తుగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆగస్టు 19న ప్రపంచ మానవత్వ దినోత్సవంగా ప్రకటించారు. మానవతా సిబ్బందిని గుర్తించేందుకు, మానవీయ కారణాల కోసం తమ ప్రాణాలు కోల్పోయిన వారికి అంకితమిచ్చే ప్రత్యేకమైన రోజు ఈరోజు. ఇది ప్రపంచం మొత్తం మానవత్వ కృషికి స్ఫూర్తినిచ్చే అవకాశముంది.

అసహనం అల్లకల్లోలానికి కారణం :

అసహనం అల్లకల్లోలానికి కారణం :

మనిషిలోని సహనం సామాజిక శాంతికి కారణమవుతుంది. అదే మనిషిలోని అసహనం అల్లకల్లోలానికి కారణమవుతుంది. శాంతియుత నైతిక జీవనం సాగించేందుకు సహనం తప్పనసరి. అదే మానవత్వపు ఉత్తమ లక్షణం. మానవతావాదంలో ప్రేమకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. సూర్యరశ్మిలా మలయమారుతంలా ప్రేమానుభావం మానవ లోకాన్ని అలముకోవాలి. హ్యూమన్ మ్యూచువల్ కో ఆపరేషన్, అవగాహన నుంచి వచ్చేదే ప్రేమ. ఇదే మనిషి ఆటవిక ప్రవృత్తిని నాశనం చేసి, స్వార్థాన్ని నిర్మూలించి మనిషిని మనిషిగా నిలబెడుతుంది.

మానవతా వాదంతో ఐక్యత..

మానవతా వాదంతో ఐక్యత..

మానవతావాదం ఐక్యతను ప్రసాదిస్తుంది. ఇది స్వేచ్ఛ, జ్ఞానం, నీతి కోసం హేతువు, ఐక్యత తప్పకుండా ఉండాలి. ఐక్యత వల్ల కూడా సహనం కూడా పెరుగుతుంది. కానీ ప్రస్తుత సమాజంలో చాలా మందిలో ఐక్యత కొరవడింది. ప్రతి దానికి స్వార్థం పెరిగిపోయింది. డబ్బుతోనే ప్రతిదాన్ని ముడిపెడుతున్నారు. డబ్బే సర్వస్వం కాదని అందరూ గుర్తుంచుకోవాలి.

Read more about: insync ఇన్సింగ్
English summary

World Humanitarian Day 2019 : History, Theme and Significance

Patience in man causes social peace. The impatience of the same man causes turbulence. Patience is essential to a peaceful moral life. That is the best feature of humanity. Love has a very important place in humanism. Like the sunshine, the love of the human world must be wandering. Human Mutual Co Operation This is the same man who destroys his natural instincts, eradicates selfishness and makes man a man.
Desktop Bottom Promotion