Latest Updates
-
జీవితంలో 3 సార్లే స్నానం..అయినా ఈ మహిళల చర్మం అంత కాంతివంతంగా ఎలా ఉంటుందంటే? -
పెట్రోల్, డీజిల్ ధరల మోత.. సామాన్యుల జేబుకు చిల్లు, ఈ చిట్కాలతో ఖర్చు తగ్గించుకోండి! -
వాహనదారులకు భారీ షాక్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి, మీ నగరంలో తాజా రేట్లు ఎంతంటే? -
వాహనదారులకు భారీ షాక్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుల బడ్జెట్ తలకిందులు! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 16 మే 2026 -
డేటింగ్ యాప్లో పరిచయం.. వీడియో కాల్తో బ్లాక్మెయిల్! మీ ఫోన్లో ఈ యాప్స్ ఉంటే జాగ్రత్త -
ఢిల్లీలో సీఏ కిడ్నాప్… వెనుక ఉన్నది ఆర్మీ జవాన్ అని తెలిసి షాక్! అసలేం జరిగింది? -
ప్రతిసారీ బిర్యానీనేనా? ఈ వీకెండ్ కొత్తగా, రుచిగా చికెన్ తహారీ రుచి చూడండి! -
గ్రహాల అనుకూలతతో ఈరోజు ఈ రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..అదృష్టం మీ వెంటే! -
ఆయుష్మాన్ సర్వార్థ సిద్ధి యోగం: ఈరోజు ఈ రాశుల వారికి తిరుగులేదు.. అదృష్టం మీ తలుపు తడుతోంది!
డయాబెటిస్, బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..మృదువైన జొన్న ఢోక్లా ఎలా చేసుకోవాలంటే..
ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే మనకు ఇడ్లీ, దోశలే గుర్తొస్తాయి. కానీ ప్రతిరోజూ అవే తింటే ఎవరికైనా బోర్ కొడుతుంది..పైగా ఇప్పుడు ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి అందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా పెరిగిపోయింది. చిరుధాన్యాలతో (మిల్లెట్స్) చేసిన వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి ఆరోగ్య స్పృహ ఉన్న వారి కోసమే ఈ అద్భుతమైన, రుచికరమైన బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్ ఫుడ్ జొన్న ఢోక్లా. గుజరాతీ సంప్రదాయ వంటకమైన ఢోక్లాను,జొన్న పిండితో కలిపి చేస్తే ఆ రుచే వేరు. ఇది డయాబెటిస్ ఉన్నవారికే కాదు, బరువు తగ్గాలనుకునే వారికి కూడా బెస్ట్ ఆప్షన్.
జొన్న ఢోక్లా తయారీకి కావాల్సిన పదార్థాలు
జొన్న పిండి - అర కప్పు
బొంబాయి రవ్వ (సూజీ) -ముప్పావు కప్పు
పెరుగు -అర కప్పు
నీళ్లు - 1 కప్పు
కొత్తిమీర - అర కప్పు
పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ - 1 టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 1 టీస్పూన్
ఈనో ఫ్రూట్ సాల్ట్ - 1 టేబుల్ స్పూన్
జొన్న ఢోక్లా తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నెలో జొన్న పిండి, బొంబాయి రవ్వ, పెరుగు వేసి గరిటెతో బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, ఉండలు కట్టకుండా ఇడ్లీ పిండిలా మృదువుగా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల రవ్వ చక్కగా నానుతుంది.
-15 నిమిషాల తర్వాత ఆ పిండిలో కొత్తిమీర, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి-అల్లం పేస్ట్, కొద్దిగా నూనె వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఈ దశలో సన్నగా తురిమిన క్యారెట్, క్యాబేజీ లాంటి కూరగాయలను కూడా వేసుకోవచ్చు. దీనివల్ల పోషకాలు మరింత పెరుగుతాయి.
-ఒకేసారి ఎంతైతే ఢోక్లా చేయాలనుకుంటున్నారో అంత పిండిని మాత్రమే వేరే గిన్నెలోకి తీసుకుని, అందులో ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి సున్నితంగా కలపాలి.ఈనో వేసాక పిండిని ఎక్కువసేపు కలపకూడదు. వెంటనే ఒక ప్లేట్ కు కొద్దిగా నూనె రాసి, ఈ పిండిని అందులో సమానంగా పోయాలి. పిండి పైన కొద్దిగా ఎర్ర కారం చల్లుకుంటే చూడటానికి ఆకర్షణీయంగా, తినడానికి కారంగా బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్లేట్ ను స్టీమర్ లేదా ఇడ్లీ పాత్రలో పెట్టి పెద్ద మంట మీద 15-20 నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి.
-ఢోక్లా పర్ఫెక్ట్ గా ఉడికిందో లేదో చాకుతో గుచ్చి చూడండి. ఉడికిన తర్వాత బయటకు తీసి, పైన ఒక స్పూన్ నూనె చల్లండి. ఢోక్లాని చాకుతో చతురస్రాకారంగా లేదా మీకు నచ్చిన షేపులో ముక్కలుగా కట్ చేసుకోండి. అంతే జొన్న ఢోక్లా రెడీ.
-జొన్న ఢోక్లాకు మరింత రుచిని అద్దాలంటే తాలింపు పెట్టుకోవచ్చు. ఇందుకోసం ఒక చిన్న కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, నువ్వులు, కరివేపాకు వేసి వేయించి.. ఆ మిశ్రమాన్ని ఢోక్లా ముక్కలపై చల్లుకుంటే అద్భుతంగా ఉంటుంది. దీనిని పల్లీ చట్నీ లేదా పుదీనా చట్నీతో తింటుంటే స్వర్గమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












