Latest Updates
-
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్ -
శని తిరోగమనం..ఈ 5 రాశుల వాళ్లు ఆ పని చేయకుంటే అగమాగం ఐపోతరు! -
రొటీన్ బజ్జీలు, పకోడీలు బోర్ కొట్టాయా? అయితే ఈసారి పొటాటో లాలిపాప్ ట్రై చేయండి -
రాత్రంతా తేనెలో ఓట్స్ నానబెట్టి ఉదయాన్నే తింటే ఏమవుతుందో తెలుసా? -
జీర్ణ సమస్యలను చిటికెలో మాయం చేసే పుదీనా రసం.. వేడి అన్నంలోకి అమృతంలా.. -
చేపల కన్నా 10 రెట్లు ఎక్కువ ఒమేగా-3 ఇచ్చే వెజిటేరియన్ ఫుడ్స్ ఇవే! -
దాబా స్టైల్ భూనా చికెన్ మసాలా..స్పైసీగా, జ్యూసీగా కేక టేస్ట్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినా, విన్నా చాలు.. గ్రహ దోషాల నుంచి సత్వర ఉపశమనం.! -
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.!
ఉదయం నిద్ర నుంచి లేస్తూనే వీటిని అస్సలే చూడొద్దు, చూస్తే దరిద్రం, అరిష్టం
ఉదయం నిద్రలేవగానే ఈ రోజు బాగుండాలని, ఏ సమస్యా రావొద్దనే అందరూ కోరుకుంటారు. ఉద్యోగంలో ఉన్న వారు అయితే.. ఈ రోజు సాఫీగా సాగిపోవాలని, సహోద్యోగుల నుంచి, ఉన్నత ఉద్యోగుల నుంచి ఎలాంటి సమస్యలు రాకూడదని అనుకుంటారు. వ్యాపారస్తులు అయితే.. ఈరోజు వ్యాపారం లాభదాయకంగా సాగాలనుకుంటారు. ఏ వృత్తిలో ఉన్న వారైనా తమ రోజంతా బాగుండాలనే కోరుకుంటూ నిద్ర లేస్తుంటారు.
ఉదయం లేస్తూనే ఆ రోజంతా చెడుగా గడిచిపోవాలని, సమస్యలు చుట్టు ముట్టాలని, తలపెట్టిన పనిలో అపజయం రావాలని ఎవరూ కోరుకోరు. కోరికోరి కష్టాలు కొనితెచ్చుకోరు. అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఉదయం లేవగానే కొన్ని రకాల చర్యలు పాటించాలి. అలాగే కొన్నింటికి వీలైనంత దూరంగా ఉండాలి.

తెలిసి చేసినా, తెలియక చేసినా కొన్ని పనులు చేయడం వల్ల అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఉదయం లేవగానే కొన్ని రకాల వస్తువులు చూడటం, కొన్ని పనులు చేయడం వల్ల ఆ రోజంతా కష్టాలమయం అవుతుంది. దరిద్రం వెంటే నడుస్తుంది. ఆ రోజంతా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కలహాలు మనం కోసం కాపు కాస్తాయి. మనం ఎంత మంచిగా మాట్లాడినా ఎదుటివారికి అందులో చెడు మాత్రమే కనిపించి తిరిగి మనకే చెడు జరుగుతుంది.
అందుకే వేదజ్యోతిష్యం ప్రకారం ఉదయం లేవగానే ఎట్టిపరిస్థితుల్లో కొన్ని పనులు చేయకూడదని అంటారు నిపుణులు. తెల్లవారుజామున నిద్రలేచిన తర్వాత కొన్ని వస్తువులు, కొన్నింటిని చూస్తే అది జీవితంలో దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. వాటి వల్ల జీవితంలో సమస్యలు కూడా వస్తాయిట. అయితే ఉదయం లేవగానే ఎలాంటి వస్తువులు చూడకూడదో, ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం ఇలా అస్సలే చేయవద్దు
చాలా మందికి ఉదయం లేవగానే కళ్లు మూసుకుని వెళ్లి లేదా బెడ్ పక్కనే అద్దం పెట్టుకుని ఉంటారు. నిద్ర నుంచి మెలకువ రాగానే అద్దంలో తమ ముఖం తాము చూసుకుంటార. ఇతరుల ముఖం చూడటం వల్ల ఆ రోజంతా ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి.. తమ ముఖం చూసుకంటేనైనా బాగుంటుందని కొందరు అనుకుంటారు.
కానీ శాస్త్రాల ప్రకారం ఇలా ఉదయం లేవగానే ఏదీ చూడకుండా మొదట అద్దంలో తమను తాము చూసుకోవడం ఎంత మాత్రమూ మంచిది కాదని చెబుతున్నారు. ఇలా చేయడం అంటే అశుభ సంకేతాన్ని సూచిస్తుందట. అద్దం వైపు చూసే బదులు రెండు అరచేతులను చూసుకోవడం చాలా మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. మెలకువ రాగానే కళ్లు రెండింటిని రుద్దుకుని, కొన్ని సెకన్ల పాటు అరచేతులను చూస్తే చాలా మంచిదని అంటున్నారు.
వంట పాత్రలు చూడటం
ఉదయం లేవగానే చాలా మంది స్త్రీలు చేసే పని ఇది. రాత్రి ఆలస్యం అయిందనో, లేదా ఇతర కారణాల వల్లో రాత్రి వండిన, తిన్న వంట పాత్రలను సింక్ లో వేసి ఉదయం లేవగానే కడుక్కోవచ్చని అనుకుంటారు. ఉదయం లేవగానే అలాగే నిద్ర మబ్బుతో కిచెన్ లోకి దూరిపోతారు. వంటపాత్రలనే మొదట చూస్తూ తోమడం ప్రారంభిస్తారు. ఇలా చేయడం ఏమాత్రమూ మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి.
రాత్రి వండిన, తిన్న వంట పాత్రలను తెల్లవారుజామున చూస్తే ఆర్థిక సమస్యలు వస్తాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. అలాగే జీవితంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయట. ఆర్థికంగా కలిసి రాకపోగా అనవసర ఖర్చులు పెరిగి సమస్యలు వస్తాయని అంటున్నారు శాస్త్ర నిపుణులు. రాత్రి వండిన, తిన్న పాత్రలను కాస్తంత ఆలస్యమైనా రాత్రి పూటే కడుక్కోవాలి. వాటిని అలాగే సింక్ లో పడేసి ఉంచడం వాస్తుపరంగా కూడా మంచిది కాదు.
నిద్రలేస్తూనే నీడను చూడటం
నిద్రలేస్తూనే బెడ్ లైట్ వెలుతురు వల్ల వచ్చే నీడను చాలా మంది చూస్తుంటారు. ఇలా చూడటం ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు నిపుణులు. అలాగే ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు సూర్యుడి వెలుతురి వల్ల కూడా నీడ వస్తుంది. ఆ నీడను కూడా చూడవద్దని శాస్త్రాలు చెబుతున్నాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications