Latest Updates
-
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు!
ఇలా నిద్రపోతే గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయట.. ఎందుకంటే?
మన జీవన విధానానికి సంబంధించి మన పెద్దలు ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పారు. మనం చేసే ప్రతి పని వెనుక ఒక శాస్త్రీయ కారణం ఉంటుందని వెల్లడించారు. అలాంటి వాటిల్లో మన పెద్దల నుంచి మనం తరచుగా వినే కొన్ని మాటలు ఏవంటే నిద్ర విషయంలో పాటించాల్సిన కొన్ని నియమాలు. మన పెద్దవాళ్లు మనకు తల అటు పెట్టకూడదు, తడి కాళ్లతో పడుకోకూడదు, తలగడ ఆ విధంగా వేసుకోకూడదు అని చెబుతుంటారు. అయితే వారు అలా చెప్పడానికి శాస్త్రీయ కారణాలు లేకుండా పోలేదు. ఈ స్టోరీలో మన పెద్దవారు నిద్ర విషయంలో మనకు చెప్పిన అంశాలు ఏంటి? వాటి వెనుక శాస్త్రీయ కారణాలు ఏంటి అనేది తెలుసుకుందాం.
1. ఉత్తర దిశగా తల పెట్టి నిద్రపోవద్దు
వేదాలలో ఉత్తర దిశలో తల పెట్టి నిద్రపోవడం మంచిది కాదని చెప్పబడింది. దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. భూమికి రెండు ప్రధాన అయస్కాంత ధ్రువాలు ఉంటాయి. ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం. ఉత్తర దిశలో నిద్రించే మన శరీరంలోని అయస్కాంత క్షేత్రం అసమతుల్యంగా మారుతుంది, ఇది రక్త ప్రవాహాన్ని గందరగోళం చేస్తుంది, తద్వారా గుండె సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా, భూమి అయస్కాంత ధ్రువం ఇనుమును ఆకర్షిస్తుందని శాస్త్రం చెబుతుంది. దీనివల్ల మెదడులో ఐరన్ అసమతుల్యతలు ఏర్పడి, తలనొప్పులు రావచ్చు. అందుకే మన పెద్దవాళ్ళు ఉత్తర దిశగా పడుకోకూడదు అని చెబుతుంటారు.

2. తడి కాళ్ళతో నిద్రించకూడదు
తడి కాళ్ళతో నిద్రించడం కూడా వేదాలలో తప్పనిసరిగా చెప్పబడింది. ఈ అలవాటుతో సంబంధం ఉన్న శాస్త్రీయ కారణం ఏటంటే.. తడి కాళ్ళతో పడక మీద నిద్రించడం వల్ల బ్యాక్టీరియా మరియు శిలీంద్రాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది పాదాల సమస్యలు లేదా "అథ్లెట్ ఫుట్" అనే ఇన్ఫెక్షన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇది చర్మంపై దురద, మంట మరియు పొలుసులు వంటి సమస్యలు సృష్టిస్తుంది. అందుకే తడి కాళ్లతో పడుకోకూడదని చెబుతుంటారు.
3. మురికి మంచంపై నిద్రించడం
"మంచం మీద కూర్చుని ఆహారం తినడం లేదా మంచం మీద తలదువ్వడం" వంటివి చేయకూడదని మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. ఇది కూడా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను తీసుకొస్తుంది. మురికి మరియు ధూళి ఉన్న మంచం మీద నిద్రించడం వల్ల చర్మంలో బ్యాక్టీరియా పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఇది మంచిగా నిద్రపోవడానికి కూడా అడ్డంకిగా మారుతుంది. అలాగే మంచంపై కూర్చొని తిన్నా, జుట్టు దువ్వినా మంచం మురికిగా మారడంతో పాటు అనారోగ్య సమస్యలకు కారణమవుతాయాని చెబుతున్నారు.
4. పూర్తిగా చీకట్లో నిద్రించడం
పెద్దలు చీకట్లో నిద్రపోవద్దని చెప్పేవారు. శాస్త్రజ్ఞుల పరిశోధన ప్రకారం, చీకట్లో నిద్రించడం సర్కాడియన్ రిథమ్‌ను సరిగా నిర్వహించేందుకు మంచిది. అయితే, కొందరు చీకటిలో భయపడతారు, అలాంటి వారు స్వల్ప వెలుతురులో నిద్రించడం వల్ల ఆరోగ్యకరమైన గాఢ నిద్ర పొందవచ్చు.
5. మెడపై చేతులు ఉంచి నిద్రించడం
పెద్దలు "మెడపై చేతులు ఉంచుకొని నిద్రించకూడదు" అని చెబుతుంటారు. దీనికి శాస్త్రీయ వివరణ ఏమిటంటే, మెడపై ఒత్తిడి వల్ల మన గుండె, ఊపిరితిత్తులు మరియు మెదడు గాయపడవచ్చు. ఇది నిద్రలో చికాకు, భావోద్వేగ అసమతుల్యత మరియు పీడకలలు రావడానికి దారితీస్తుంది.
ఈ విధంగా, పెద్దలు చెప్పే ప్రతి మాటకు, ప్రతి నియమానికి ఒక శాస్త్రీయ కారణం ఉంటుంది. వాటిని ఉట్టి మాటలుగా తీసిపోతే, అనేక ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. అందువల్ల, వారి మాటలను నమ్మడం, శాస్త్రీయ దృక్పథం నుండి వాటిని అర్థం చేసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది.



Click it and Unblock the Notifications











