Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
నిద్రపోయే ముందు ఇలా చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయ్.. ఈ రాత్రే ట్రై చేయండి..!
రోజంతా మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పాజిటివ్‌గా మాత్రమే ఆలోచించాలి. రోజంతా ఉల్లాసంగా వుండే పడుకునే ముందు నెగిటివ్ ఆలోచనలు వచ్చినా, ఏడ్చినా బాధపడ్డా మీ మెదడుపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. అప్పుడు రోజంగా పాజిటివ్‌గా ఆలోచించినా ఫలితం వుండదు. రాత్రి మనము కేవలం విశ్రాంతిని మాత్రమే తీసుకోము. నిద్రపోయిన తరువాత మెదడులో చాలా మార్పులు వస్తాయ్. అప్పుడు సబ్‌కాన్షియస్ మైండ్ యక్టివేట్ అవుతుంది. మన మనసులో అనుకున్న విషయాలు కలల రూపంలో వస్తాయ్.

రాత్రిపడుకునే ముందు ఐదు నిమిశాలు పాజిటివ్‌గా ఆలోచించాలి. ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా జాగ్రత్తపడాలి. ఇది చిన్న విషయమే అయినా మొత్తం జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. పడుకునే సమయంలో వెన్నుపూసలు వంచకుండా నిటారుగా వుంచి పడుకోవాలి. పదిసార్లు చాలా గట్టిగా శ్వాసను పీల్చుకొని వదిలివేయాలి. ఇలా చేయడం వల్ల మెదడులో శక్తి నిండిపోతూ వుంటుంది. దీంతో మెదడు చాలా ప్రశాంతంగా మారిపోతుంది.
మీరేదైతే కోరుకుంటారో దాని గురించే ఆలోచిస్తూ వుండాలి. మీకు నిద్రపట్టేవరకు పాజిటివ్‌గా ఆలోచిస్తూనే వుండాలి. ఈ చిన్న టెక్నిక్‌ను పడుకునే ముందు ఉపయోగించాలి. మెదడులో మనకు తెలియన సబ్‌కాన్షియస్ మైండ్ అని ఒకటి వుంటుంది. దీనికి కూడా ఒక బలహీనత వుంది. ఏది నిజం, ఏది అబద్దం అనే విషయాలను ఈ మెదడు పసిగట్టలేదు. ఈ సబ్‌కాన్షియస్ మెదడు, ఏది ఆలోచిస్తే అదే నిజమని అనుకుంటుంది. అదే విషయంపై గట్టిగా వుంటే అదే వాస్తవ జీవితంలో నిజమౌతుంది.
కాబట్టి నెగటివ్ విషయాలను ఆలోచిస్తే నెగటివ్‌గా జరుగుతుంది. మీరు నెగటివ్ ఆలోచనలను ఆలోచిస్తే అదే రియల్ అని అనుకుంటుంది. పరోక్షంగా మీ జీవితాన్ని కూడా అలాగే వుంచమని మీ సబ్‌కాన్షియస్ మెదడుకు చెబుతున్నారన్నమాట. మీరేదైతే జరగవద్దు అని అనుకుంటారో అదే జరుగుతుంది. మీ జీవితంలో మంచి జరగాలి అని మీరు అనుకున్నా ఇలాంటి ఆలోచనలవల్ల చెడు జరుగుతుంది.

నేను సంతోషంగా వున్నాను. నాకు అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటే మీ మెదడు, జీవితం కూడా అలాగే వుంటుంది. ఇలా ఆలోచించడం ద్వారా మీ జీవితానికి సంబంధించిన మొత్తం తీరును మార్చివేయవచ్చు. సబ్ కాన్షియస్ మైండ్‌కి సరైన ఆలోచనలను గనుక మనము ఇచ్చినట్టయితే అంతా మంచే జరుగుతుంది. మీ శక్తిని సరైన చోట ఖర్చు చేయండి.
జీవితంలో ఏది చేసిన మీ ఆలోచనలు చాలా ముఖ్యమన్న విషయాన్ని మరిచిపోవద్దు. రేపు గనుక మీ పరీక్ష వుంటే దాని గురించి టెన్షన్ పడకుండా అంతా బాగానే జరుగుతుంది, పరీక్ష బాగానే రాస్తానని రాత్రి పడుకునే ముందు అనుకోండి. రేపు మీకు ఏదైనా ముఖ్యమైన పని వున్నా.. దాని గురించి పడుకునే ముందు పాజిటివ్‌గా ఆలోచించండి. అంగా మంచి జరుగుతుందని అనుకున్నప్పుడు మీరు ఇక దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. నిద్రపోవడానికి, మేలుకవతో వుండడానికి మధ్య వుండే సమయం చాలా అద్భుతాలను చేస్తుంది. కాబట్టి ఆ కాలాన్ని చాలా చక్కగా వినియోగించుకోవాలి. ఇప్పటి నుంచే దీనిని ప్రాక్టికల్‌గా అమలు చేసే ప్రయత్నం చేయండి. దీని ఫలితాలను మీరు తప్పక చూస్తారు.



Click it and Unblock the Notifications