Latest Updates
-
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే.. -
మీ జన్మ నక్షత్రానికి ఏ దేవత అధిపతి తెలుసా? ఏ దేవతను పూజించాలి మీ స్టార్ ఏది? -
జూన్ 7 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి హెచ్చరిక.. నేటి గ్రహాల ప్రభావం ఇదే!
పచ్చి కూరగాయలు తింటూ.. ఆకలితో మృతిచెందిన వీగన్ రా ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్
గ్జానా శాన్సనోవా గురించి చాలా మంది పోషకాహార నిపుణులకు, మరీ ముఖ్యంగా వీగన్లకు తెలిసే ఉంటుంది. ఈ 39 ఏళ్ల మహిళ.. వీగన్ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్. దాదాపుగా దశాబ్దకాలం నుంచి ఆమె వీగన్ గా ఉంది. అంతే కాదు కేవలం పచ్చి కూరగాయలను మాత్రమే తింటూ ఉండేది. అయితే ఈ గ్జానా శాన్సనోవా కొన్ని రోజుల క్రితం ఆకలితో మరణించింది. ఆమె మరణం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సంవత్సరాల తరబడి పూర్తిగా పచ్చి కూరగాయలు, ఆకు కూరలు మాత్రమే తినడంవల్ల ఆకలితో ఆమె చనిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

రష్యాకు చెందిన గ్జానా శాన్సనోవా.. తన సోషల్ మీడియా అకౌంట్ లో పచ్చి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లపై రకరకాల వీడియోలు చేస్తుంది. ఆన్‌లైన్ లో గ్జానా డీ'ఆర్ట్ అనే పేరుతో గ్జానా శాన్సనోవా వీడియోలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. శాన్సనోవా ఆగ్నేయాసియా పర్యటనలో ఉండగా.. ఆస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. వైద్య చికిత్స పొందుతూ.. చివరికి జులై 21వ తేదీన మరణించినట్లు వార్తా కథనాలు చెబుతున్నాయి.
గ్జానా శాన్సనోవా తన ఇన్ స్టాగ్రామ్ లో తెలిపిన దాని ప్రకారం.. ఆమె దాదాపు పదేళ్లుగా పచ్చి కూరగాయలు, ఆకుకూరలనే తింటోంది. కొన్ని రోజుల క్రితం ఆమె శ్రీలంక టూర్ లో ఉన్నప్పుడు.. ఆరోగ్యం పాడైపోయి, అలసిపోయి కనిపించినట్లు తన స్నేహితుడు ఒకరు చెప్పుకొచ్చారు. కాళ్లు ఉబ్బిపోయాయని, శోషవచ్చినట్లుగా కనిపించిందని చెప్పారు. బలహీనపడిన ఆమెను ఆ టూర్ నిర్వాహకులు చికిత్స కోసం గదికి పంపించినట్లు వెల్లడించారు. కానీ అక్కడి నుంచి శాన్సనోవా తప్పించుకుని పారిపోయింది.. ఆతర్వాత శాన్సనోవాను ఫుకెట్ లో చూసినట్లు చెప్పారు తన స్నేహితుడు. అప్పటికి ఆమె మరింతగా బలహీనపడిపోయి, రోగిష్టిలా కనిపించిందన్నారు.
శాన్సనోవా అపార్ట్ మెంట్‌లోనే పై ఫ్లోర్ లో ఉండే తన స్నేహితురాలు ఒకరు.. శాన్సనోవాను బలవంతంగా చికిత్స ఇప్పించినట్లు చెప్పారు. శాన్సనోవా ఏదో ఒకరోజు శవమై కనిపిస్తుందని తాను ఎప్పుడూ భయపడేదాన్ని అని.. అలాగే జరిగినట్లు వెల్లడించారు. శాన్సనోవా.. కలరా లాంటి ఇన్ఫెక్షన్ తో చనిపోయినట్లు ఆమె తల్లి చెప్పారు. గ్జానా శాన్సనోవా చనిపోవడానికి.. తీవ్రమైన అలసట, పచ్చి శాకాహారం తన శరీరంపై తీవ్రమైన ఒత్తిడి పెంచిందని.. దీని వల్ల శాన్సనోవా చనిపోయి ఉండొచ్చని కూడ అన్నారు.
గ్జానా శాన్సనోవా గత ఏడేళ్లుగా.. స్వీట్ జాక్ ఫ్రూట్, జెయింట్, దురియన్ ను మాత్రమే తినేదని తన సన్నిహితుడు ఒకరు చెప్పినట్లు న్యూయార్క్ పోస్టు కథనం పేర్కొంది.
తను తీసుకునే ఆహారం పట్ల గ్జానా శాన్సనోవా ఎప్పుడూ ధీమాగానే ఉండేది. తన ఆహారం తనను మారుస్తుండటాన్ని గమనిస్తున్నానని చెప్పుకొచ్చేది. కొత్తగా మారిన నన్ను నేను ప్రేమిస్తున్నానంటూ చెప్పేది. ప్రస్తుతం అలవాట్లను మార్చి పాత అలవాట్లకు ఎప్పటికీ వెళ్లబోనని అనేది. గ్జానా శాన్సనోవా.. తన డైట్ గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చేది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications