Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కలలో శవం కనిపిస్తే దాని అర్థమేంటో తెలుసా..? మీరే చనిపోయినట్టు కల వస్తే..!
స్వప్న శాస్త్రం ప్రకారం మనకు వచ్చే కలలు భవిష్యత్తు గురించి అనేక రకాల సంకేతాలన పంపుతుంది. కొన్ని కలలు భయాన్ని కలిగిస్తే మరికొన్ని కలలు సంతోషాన్ని కలిగిస్తాయ్. భయాన్ని కలిగించే కలలను మాత్రమే మనం గుర్తుంచుకుంటాం. కొంతమంది కలలు చూసిన వెంటనే మరిచిపోతారు. అయితే ఈ కలలు మనకు ఏమి సూచిస్తాయో తెలుసుకుందాం.
కలలు మనకు భయాన్ని ఆందోళనను కలిగిస్తాయ్. కలలో మీరు చనిపోయినట్లు వస్తే మీరు మీ జీవితంలో ప్రత్యక్షమైన మార్పులను చేసుకోవాల్సి వుంటుంది. తరచూ ఇవే కలలు వస్తే వీటి అర్థమేంటో తెలుసుకుందాం. నిద్రపోతున్నప్పుడు కలలో శవాన్ని చూసి చాలా మంది భయపడతారు. శకం కనిపిస్తే చెడు జరుగుతందని భావిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో శవం కనిపిస్తే శుభసూచకంగా చెబుతారు. కలలో శవాన్ని చూస్తే అది అతనికి మంచి సంకేతం. అనారోగ్యంతరో వున్న వ్యక్తి కలలో శవాన్ని చూస్తే ఆ వ్యక్తి త్వరలోనే వ్యాధి నుంచి విముక్తి కాబోతున్నాడని అర్థం.

ఒక వ్యాపారి కలలో శవాన్ని చూస్తే అతను వ్యాపారంలో చాలా లాాభాలు పొందబోతున్నాడని అర్థం. కలలో శవాన్ని చూడ్డం, ప్రతి కోణం నుంచి శుభమని చెప్పవచ్చు. ఎప్పుడైనా శవాన్ని చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి కలలు చాలా పవిత్రమైనవని అర్థం చేసుకోవాలి. మీరు చనిపోయినట్లు కలగంటే మీ జీవితంలో ముఖ్యమైన మార్పులు వస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. మీకు ఎప్పుడూ మంచి జరుతుందని సంకేతంగా భావించాలి.
మీరే చనిపోయినట్లు కలవస్తే మీరు అభివృద్ధి చెందుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయ్. గతాన్ని విడిచిపెట్టి పూలబాట వేసుకుంటారని అర్థం చేసుకోవాలి. మీరు మీ జీవితంలో సాధించాలనుకునేవి సాధించుకొని బలమైన వ్యక్తిగా మారబోతున్నారని అర్థం. మరణించినట్లు కలవస్తే కొన్ని బాధ్యతలను స్వీకరించమని కూడా సూచనగా భావించాలి. ఈ మార్పులు సంబంధం విషయంలో కావచ్చు, లేదంటే ఉద్యోగం విషయంలో కావచ్చు, ఈ మార్పుల వల్ల అశాంతికి గురౌతారు.
చనిపోయినట్ల కలవస్తే జీవితంలో అన్ని బాధలు తొలగిపోయినట్లేనని పండితులు చెబుతున్నారు. సర్పాలను చంపుతున్నట్టుగా, కుక్క, గాడిద, ఒంటె కనిపించడం, ఈ జంతువులపై ఎక్కినట్టుగా కలరావడం మంచిది కాదు. పక్షి మాంసాన్ని తినడం, నూనెను తాగడం, తల్లి గర్భంలో ప్రవేశిస్తున్నట్టుగా, చితిపైక ఎక్కడం, ఇంధ్ర ధనుస్సు విరిగినట్టుగా అనిపించడం అశుభాన్ని సూచిస్తుంది.

చెడు కలలు వస్తే ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా పండితులు వివరించారు. కలలో పాములు, లేదా ఏవైనా విషసర్పాలు, జంతువులూ కనబడితే గరుడవాహనం పైన కూర్చున్న విష్ణు మూర్తి ఫోటోకు పూజ చేయాలి. దయాలూ, భూతాలు లాంటివి కనిపిస్తే రాగి చెట్టు కింద వున్న గణపతి విగ్రహానికి పూజ చేయాలి. ఆర్థిక ఇబ్బందులు కలిగినట్లు కల వస్తే లక్ష్మీదేవిని పూజించాలి.
దిండుకింద లవంగాలను, లేదా పసుపు ప్యాకెట్‌ను పెట్టుకొని పడుకోవాలి. పీడకలలు ఎక్కువగా వస్తే దిండు కింద ఇనుప కత్తెర పెట్టుకొని పడుకోవాలి. చెడు కలలు రాకుండా వుండాలంటే దక్షిణం వైపు తల, ఉత్తరం వైపు పాదాలు పెట్టుకొని పడుకోవాలి. స్త్రీలకు చెడు కలలు రాకుండా వుండాలంటే జుట్టును కట్టుకొని పడుకోవాలి. మంచం కింద చెప్పులను, షూస్ లాంటివి పెట్టవద్దు.



Click it and Unblock the Notifications