Latest Updates
-
జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేస్తున్నాయి.. మీ ర్యాంక్ అంచనా వేసుకోవడం ఎలా? -
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే! -
ఎండల వేడికి తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో శరీరాన్ని చల్లబరచుకోండి! -
వైశాఖ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదేవతల ఆశీస్సులు! -
కమ్మని పెరుగు సేమియా..ఆహా ఏమి రుచి, తినరా మైమరచి.. -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. లక్ష్మీ కటాక్షం మీకేనా? - శుక్రవారం, 17 ఏప్రిల్ 2026 -
బ్రోకోలీ నిజంగా క్యాన్సర్ ను తగ్గిస్తుందా? డాక్టర్ చెప్పిన ఈ సీక్రెట్ తెలుసుకోండి! -
డీప్‌ఫేక్ ఫోటోలతో వేధిస్తున్నారా? 2 గంటల్లోనే డిలీట్ చేయించే మార్గమిదే! -
కర్ణాటక స్పెషల్ కుకుంబర్ అవలక్కి..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్! -
ఎండల వేడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో చల్లగా ఉండండి
పని ప్రదేశంలో.. మానసిక ఆరోగ్యం ఎలా పొందాలో తెలుసా? ఈ టిప్స్ పాటించండి!
ప్రతీ మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. శారీరకంగా ఎంత బలంగా ఆరోగ్యంగా ఉన్నా.. మానసిక ఆందోళనలు, సమస్యలు ఉంటే.. కోలుకోవడం చాలా కష్టం. అందుకే రేపు(అక్టోబర్ 10వ తేదీన) ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పని ప్రదేశంలో మనం మానిసిక ఆరోగ్యాన్ని ఎలా పొందాలి, అందుకోసం ఎలాంటి టిప్స్ పాటించాలనేది ఈరోజు తెలుసుకుందాం.
మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి?
మానసిక ఆరోగ్యం అంటే.. జీవితంలోని సాధారణ ఒత్తుళ్ళను తట్టుకొని, సమర్ధవంతగా, ఉత్పాదకంగా, ఫలవంతంగా పని చేయడమే. అలాగే ప్రమాదంలో ఉన్నప్పుడు సహచరులకు, సంఘానికి సహాకారం అందించడమే. ఒక మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉంటే.. ఎలాంటి సందర్భాల్లోనైనా, ఏ సమస్యనైనా ఎదుర్కోగలరు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచంలోని మొత్తం జనాభాలో 60% మంది ప్రజలు ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో 15% మంది మానసిక ఆరోగ్యంతో ఇబ్బందులు పడుతున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. దానికి గల కారణాలు, తీసుకోవాల్సిన చర్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
మానసిక అనారోగ్యానికి కారణాలు:
పని ప్రదేశంలో మానిసిక ఆరోగ్యం లేకపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. చేసే పనిలో సంబంధిత నైపుణ్యం లేకపోవడం, లేకా ఆ పనిపైన సరైన పట్టులేకపోవడం మానసిక అనారోగ్యానికి ఒక కారణమని చెప్పుకోవచ్చు.
> సంబంధిత పనిలో సిబ్బందుల కొరత ఉండడంతో పాటు అధిక పనిభారం, పనివేగం
> పని వేళల్లో లిమిట్ లేకపోవడం, అధిక సమయం పాటు పని ప్రదేశంలో గడపడం
> పని ప్రదేశంలో సహచర ఉద్యోగులతో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, అవివక్షత, అపార్థాలు కూడా దీనికి కారణం కావచ్చు
> ఉద్యోగ భద్రత లేకపోవడం, జీతం సరిపోకపోవడం వంటివి కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి
> అలాగే పని ప్రదేశంలో హింస, వేధింపులు, బెదిరింపులు, గౌరవం లేకపోవడం, తక్కువ స్థాయిలో ప్రమోషన్ ఇవ్వడం వంటివి కూడా మానసిక అనారోగ్యానికి గురి చేస్తాయి.
మానసిక ఆరోగ్యం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
ఏ సంస్థ అయినా సరైన రీతిలో గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు ఎదగాలంటే తప్పనిసరిగా ఆ సంస్థలో పని చేసి ఉద్యోగులు మానసిక ఆరోగ్యంతో జీవించాల్సి ఉంటుంది. అందుకోసం ఆయా సంస్థలతో పాటు ఆ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. అవేంటంటే..
> పని ప్రదేశంలో ఉద్యోగులకు అనువైన వాతావరణాన్ని సృష్టించడం
> పని ప్రదేశంలో మానసిక అనారోగ్యానికి దారి తీసే వ్యవహారాలను గుర్తించి, వాటిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి
> ఉద్యోగికి ఏమైనా సమస్య ఉంటే.. ఆ సమస్యను తగిన రీతిలో సంస్థ నిబంధనల మేరకు పరిష్కరించాలి
> పనిలో ఉత్సాహవంతంగా పాల్గొనేందుకు, వారికి గౌరవం ఇవ్వడంతో పాటు వారి సూచనలను ఆచరణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తే.. ఈ సమస్యలకు పుల్ స్టాప్ పెట్టొచ్చు.
ఇవి మాత్రమే కాకుండా పని ప్రదేశంలో యాజమాన్యం తీసుకోవాల్సిన చిన్న చిన్న చర్యలు, స్నేహగుణం కూడా ప్రొడక్టివిటీని పెంచడంతో పాటు.. ఉద్యోగికి మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాయి.



Click it and Unblock the Notifications











