Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఏడాదిలోపు బేబీ డైట్ లో చేర్చాల్సిన హెల్తీ ఫుడ్స్
బుడిబుడి నడకలు, ముద్దు ముద్దు పలుకులతో మీ బేబీ పెరుగుతూ ఉంటే.. ఇంకాస్త జాగ్రత్త పెరుగుతుంది. బేబీ ఆరోగ్యంగా, యాక్టివ్ గా పెరగడం కోసం ప్రతి క్షణం.. జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. పెట్టే ప్రతి ఆహారం.. ఆరోగ్యకరం, పోషకమయం అయి ఉండాలని కోరుకుంటారు.
అయితే ఏడాదిలోపు బేబీ హెల్త్ కేర్ చాలా కష్టంగా ఉంటుంది. హెల్తీ డైట్ ఫాలో అవడం చాలా ఇబ్బందికరమైనది. ఘన పదార్థాలు తినడం నేర్చుకునేటప్పుడు.. ప్రతి ఒక్కటి తినడానికి ఎట్రాక్ట్ అవుతారు. కాబట్టి.. ఎలాంటి ఆహార పదార్థాలు మీ చిన్నారి ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా.. బేబీకి మొదటి ఏడాదిలో ఉన్నప్పుడు ఆహారం విషయంలో చాలా కేర్ తీసుకోవాలి.
మగబిడ్డ జన్మించాలంటే ఈ ఆహారాలు రెగ్యులర్ తినండి
బిడ్డ పెరుగుదలకు, మెరుగైన ఆరోగ్యానికి అవసరమైయ్యే పోషకవిలువలు అందించడం చాలా అవసరం. అలాగే మీరు పెట్టే ఆహారం.. చిన్నారి ఆడుకోవడానికి కావాల్సిన శక్తిని, మెదుడు చురుగ్గా పనిచేసే సత్తానిచ్చే ఆహారాలు అందివ్వాలి. కాబట్టి.. ఏడాదిలోపు పిల్లలకు పెట్టాల్సిన హెల్తీ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఎగ్స్
కోడిగుడ్లను కాస్త ఫ్రై చేసి.. వెజిటబుల్ గుజ్జుతో కలిపి మిక్సీ పట్టి.. ఏడాదిలోపు పిల్లలకు తినిపిస్తే.. వాళ్లకు అందాల్సిన పోషకాలు అందుతాయి.

తృణధాన్యాలు
తృణధాన్యాలు ఎక్కువ ఫైబర్, అనేక రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. కాబట్టి.. వీటి ద్వారా ఓట్స్ లేదా రైస్ తో పాటు ఉడకబెట్టి తినిపించడం వల్ల.. ఆరోగ్యంతో పాటు.. టేస్టీ ఫుడ్ పెట్టవచ్చు.

ఆకుకూరలు
స్పినాచ్, కేల్ వంటి ఆకుకూరలు పెట్టడం వల్ల మీ బేబీకి కొత్త టేస్ట్ అందుతుంది. ఘన పదార్థాలు తినడం మొదలుపెట్టిన తర్వాత.. ఈ ఫుడ్ మంచి ఆప్షన్.

బెర్రీస్
ఏడాదిలోపు పిల్లలకు పెట్టాల్సిన ముఖ్యమైన ఆహారాల్లో బెర్రీస్ ముఖ్యమైనవి. ఇవి చూడ్డానికి కలర్ ఫుల్ గా ఉంటాయి కాబట్టి.. మీ బేబీ వీటిని తినడానికి ఎట్రాక్ట్ అవుతాడు. కట్ చేసి తినిపించినా, జ్యూస్ చేసి తాగించినా మంచిదే.

సాల్మన్
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బిడ్డ పెరుగుదలకు చాలా అవసరం. ఇది సాల్మన్ లో పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి.. వండిన సాల్మన్ ఫిష్ ని మెత్తగా చేసి.. ఏడాదిలోపు పిల్లలకు పెట్టడం వల్ల.. పోషకాలు అందుతాయి. ఇది వారానికి ఒకసారైనా తినిపిస్తే మంచిది.

ఉల్లి, వెల్లుల్లి
ఏడాదిలోపు పిల్లలకు టేస్టీగా తినిపించడానికి ఉల్లి, వెల్లుల్లి చాలా ముఖ్యమైనవి. ఇవి బేబీకి రుచితో పాటు, పోషకాలు అందిస్తుంది.

పీనట్స్
పీనట్స్ తో కొంతమంది పిల్లలకు అలర్జీ అవుతుంది. కాబట్టి.. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంచెం కొంచెం తినిపించడం మంచిది. అయితే మిగిలిన ఆహారాలు పెట్టాక చివరగా.. దీన్ని ట్రై చేయండి. కాకపోతే.. అలర్జీ కాకుండా.. జాగ్రత్త పడాలి.



Click it and Unblock the Notifications