Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఎదిగే పిల్లలకు అందివ్వాల్సిన హెల్తీ ఫ్రూట్స్...
బేబీ పుట్టినప్పటి నుండి వారి కొన్ని నెలలు మరియు కొన్ని సంవత్సరాల వరకూ అత్యంత ముఖ్యమైనది . ఎందుకంటే పిల్లల పెరుగుదలకు మరియు ఎదుగుదలకు ఈ వయస్సులోనే ఎక్కువ పోషకాలు, విటమిన్స్, న్యూట్రీషియన్స్ అవసరం అవుతాయి . ముఖ్యంగా బేబీకి అందించే ఆహారాల్లో ఎక్కువగా ప్రోటీన్స్ మరియు ఫైబర్స్ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి.
బేబీకి అవసరం అయ్యే ప్రోటీన్స్ మరియు న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్స్ ఫ్రూట్స్ నుండి పుష్కలంగా అందుతాయి. బేబీకి అందించే రెగ్యులర్ ఫుడ్ లో ఫ్రూట్స్ ను జోడించడం చాలా అవసరం . ఇవి బేబీకి తక్షణ శక్తిని అందిస్తుంది మరియు వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఇది బేబీలో వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
బేబీకి అందించే ఆహారాల్లో వివిధ రకాల పండ్లను జోడించి అందివ్వొచ్చు . ఇవి బేబీ గ్రోత్ మరియు డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతాయి . అందువల్ల , ఈ ఆర్టికల్లో బేబీకి అందివ్వాల్సిన కొన్ని రకాల పండ్లగురించి వివరించడం జరిగింది . మరి ఆలస్యం చేయకుండా వీటి గురించి తెలుసుకొని, ఎదిగే పిల్లలకు ఈ పండ్లను అందివ్వండి..ఆరోగ్యంగా పెరగనివ్వండి...

బొప్పాయి: బొప్పాయి బేబీస్ కు చాలా గ్రేట్ ఫుడ్ . ఎందుకంటే ఇందులో విటమిన్ సి మరియు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లలకు చాలా అవసరం అవుతుంది. ముఖ్యంగా వారి ఎదుగుదలకు డైలీ బేస్ లో అందివ్వాల్సి ఉంటుంది . ఇందులో ఉండే సోలబుల్ ఫైబర్ బేబీలో మలబద్దకం నివారించి సులభంగా మోషన్ అయ్యేందుకు సహాయపడుతుంది.
ఆపిల్: ఆపిల్స్ బెస్ట్ ఫుడ్. బేబీ ఆరోగ్యంగా పెరగడానికి ఆపిల్స్ లో ఉండే పెక్టిన్ మరియు ఇతర విటమిన్స్ మరియు మినిరల్స్ ఎంతగానో సహాయపడుతాయి.

అవొకాడో: అవొకాడోను బేబీ డైట్ లో చేర్చడం వల్ల , అన్ శాచ్యురేటెడ్ ఫయాట్స్ ను నేచురల్ గా కలిగి ఉండటం వల్ల ఇది బేబీ ఆరోగ్యానికి ఎక్కువగా సహాయపడుతాయి . అవొకాడో తినిపించడం వల్ల పిల్లలో జ్ఝాపకశక్తి మరియు మెమరీ ఫంక్షన్ మెరుగ్గా ఉంటుంది.
అరటి: అరటి పండ్లలో కార్బోహైడ్రేట్స్ మరియు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ బౌల్ మూమెంట్ సరిగా అయ్యేందుకు సహాయపడుతుంది. అంతే కాదు ఇది చాలా సాప్ట్ గా ఉండటం వల్ల పిల్లలకు ఇది ఒక ఫర్ఫెక్ట్ ఫుడ్ గా చెప్పవచ్చు.
ఫ్రూనే: ఫ్రూనే లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. మరియు ఇది బౌల్ సమస్యలను నివారించడంలో మరియు మలబద్దకం నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ప్రూనేను ఆపిల్స్ తో జోడించి మ్యాష్ చేసి అందివ్వొచ్చు..



Click it and Unblock the Notifications