Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
గర్భధారణ సమయంలో బెల్లం తినడం వల్ల పొందే ప్రయోజనాలు
ప్రెగ్నెన్సీ డైట్ లో చేర్చుకోవాల్సి ఖచ్చితమైన ఆహారాల్లో బెల్లం ఒకటి. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి.. కాబోయే తల్లులు ఖచ్చితంగా తీసుకోవాలి. గర్భధారణ సమయంలో బెల్లం తినడం చాలా సేఫ్. ఐరన్ డెఫిసియెన్సీ, అనీమియా వంటి రిస్క్ కి దూరంగా ఉండాలంటే.. బెల్లం తింటూ ఉండాలి.
బెల్లం తీసుకోవడం వల్ల కడుపులోని బిడ్డ హెల్తీ వెయిట్ మెయింటెయిన్ చేయడానికి సహాయపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన బ్రెస్ట్ మిల్క్ కి ఇది సహాయపడుతుంది. 7నెలల ప్రెగ్నెన్సీ తర్వాత రెగ్యులర్ గా బెల్లం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, క్రోనిక్ డిసీజ్ లను నివారిస్తాయి. అలాగే బెల్లం చర్మానికి కూడా మంచిది. ప్రీరాడికల్స్ తో పోరాడి వయసు ఛాయలు కనిపించకుండా అరికడుతుంది. అంతేకాదు.. ప్రకాశవంతమైన చర్మ సౌందర్యం పొందడానికి సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీలు బెల్లం ఖచ్చితంగా తినాల్సిన అవసరమేంటో ఇప్పుడు చూద్దాం..

బ్లడ్ ప్యూరిఫై
గర్భధారణ సమయంలో.. బెల్లం తీసుకోవడం వల్ల బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. గర్భస్థ శిశువు ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది.

అనీమియా
బెల్లం తీసుకోవడం వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ పెరుగుతాయి. దీనివల్ల అనీమియా రిస్క్ తగ్గించుకోవచ్చు. అలాగే ఇమ్యునిటీ పవర్ పెంచి.. అనేక హెల్త్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది.

కీళ్ల నొప్పులు
బెల్లం తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్లకు పోషణ అందించి.. బలంగా చేస్తుంది. అలాగే గర్భధారణ సమయంలో వేధించే కీళ్ల నొప్పులు నివారిస్తుంది.

నీటినిల్వను తగ్గిస్తుంది
బెల్లంలో ఉండే పొటాషియం, మినరల్స్ శరీరంలో వాటర్ రిటెన్షన్ ను తగ్గిస్తుంది. అలాగే పొటాషియం ఎలక్ట్రోలైట్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది. వాపు, నొప్పులను నివారిస్తుంది.

హెల్తీ ప్రెగ్నెన్సీ
బెల్లంలో ఫోలేట్ ఉంటుంది. గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో అవసరం. కడుపులో శిశువు ఎదుగుదల, పెరుగుదలకు సహకరిస్తుంది.

బీపీ
బెల్లంలో సోడియం తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ రిస్క్, గుండె సంబంధిత సమస్యలని కూడా తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications