Latest Updates
-
తమిళనాడు స్టైల్ చేపల కూర..ఒక్కరే మొత్తం తినేసేంత రుచిగా ఉంటది -
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు
ప్రెగ్నెన్సీ సమయంలో నిద్రలేని రాత్రులకు గుడ్ బై చెప్పడం ఎలా ?
గర్భాదరణ సమయంలో నిద్రలేమి సమస్య అసౌకర్యంగా ఉన్నప్పటికీ, ఆ సమయంలో ఇది ఒక సాదారణ సమస్యే. అయితే ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? అనేది చాలామందిని వేధించే సమస్య ?
నిద్రలేమి అనేది సాదారణ నిద్ర లేదా ఎక్కువ సేపు నిద్ర లేకుండా ఉంటుంది. ఈ నిద్ర రుగ్మతకు కారకాలు చాలా విస్తృతమైన పరిధిలో ఉన్నాయి. నిద్రలేమిని నివారించటానికి, ఎదుర్కోవటానికి సొంత పద్దతులు అవసరం. అలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. ఇది పెద్ద సమస్యగా అనిపించదు.
జెట్ లాగ్ లేదా పనిగంటలలో మార్పు వలన నిద్రలేమి రావచ్చు. ఇది శరీరంలో నొప్పి లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి వంటి రుగ్మతలను (GERD) ప్రేరేపిస్తుంది. ఈ సమయంలో వేగంగా నిద్ర రావటం, వాంతులు అవటం జరగవచ్చు.

నిద్రలేమి కారణంగా పీడకలలు, నిద్రలో నడక, వెర్రి లేదా భయాల వంటి మానసిక రుగ్మతలు రావచ్చు. ఉత్ప్రేరకాలు, నిర్జలీకరణ మరియు వ్యాయామం లేకపోవడం వంటి బాహ్య కారకాలు కూడా నిద్రలేమికి దోహదం చేస్తాయి.
గర్భధారణ సమయంలో ఒక విస్తారమైన పరిధిలో నిద్రలేమి కారకాలు బిడ్డకు సంబంధించి ఉండకపోవచ్చు. గర్భిణీ తల్లి గర్భధారణ తర్వాతి దశలలో ఆమె ఉదర పరిమాణం పెరుగటం మరియు పిల్లవాడిని మోసే సమయంలో కొంత ఇబ్బంది ఉండవచ్చు.

కొంత మంది తల్లులు శిశువు బరువు కారణంగా వెన్ను నొప్పికి గురి అవుతారు. అలాంటప్పుడు నిద్రలేమి సమస్య రావచ్చు. తల్లి మూత్రనాళంపై శిశువు బరువు పడితే తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లవలసి వస్తుంది. అలాంటప్పుడు నిద్ర లేక నిద్రలేమి సమస్య వస్తుంది.
ఆందోళన అనేది గర్భధారణ సమయంలో నిద్రలేమికి కారణం కావచ్చు. అలాగే హార్మోన్ల మార్పులు కూడా గర్భధారణ సమయంలో నిద్రలేమికి కారణం అవుతాయి. సహజంగా ఒక తల్లి రాత్రి సమయంలో తరచుగా మేలుకొని ఉంటుంది. ఒక తల్లికి నిద్రలేమి గురించి ఆందోళన ఉంటుంది. అలాగే శిశువుకు హాని కలుగుతుందేమో అనే భయం ఉంటుంది. ఈ భయం నిద్రలేమిని తీవ్రతరం చేయవచ్చు.

కాబట్టి గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో నిద్రలేమి ఎలా ఎదుర్కోవాలి? అసౌకర్యమైన పరిమాణం,బొడ్డు బరువు మరియు ఆకృతి, పడుకునే స్థానాలను మార్చటం వంటి కారకాలు అసౌకర్యం లేదా నొప్పికి కారణం అవుతాయి.
*పక్కకు తిరిగి పడుకొని కడుపు దగ్గర కుషన్ లేదా మృదువైన దిండు పెట్టాలి.
*రాత్రి సమయంలో పడుకోవటానికి ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచి నిద్ర పడుతుంది.

*సంగీతం కూడా మంచి నిద్రకు సహాయపడుతుంది. సహజమైన ద్వనులతో పాటు పక్షుల ద్వనులను వింటే మంచి నిద్రకు సహాయం చేస్తుంది.
*రాత్రి సమయంలో పిండిపదార్ధాలను తక్కువ మోతాదులో తీసుకుంటే మెదడులో సెరోటోనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దాంతో మంచి నిద్ర వస్తుంది.
కాబట్టి, గర్భధారణ సమయంలో నిద్రలేమిని నయం చేయడానికి ఈ ఉపాయాలను ప్రయత్నించండి.



Click it and Unblock the Notifications
