Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఆహారంపై అలర్జీ పిల్లల్లో మానసిక ఆందోళనకి కారణమా?
మీ బిడ్డ ఆందోళన రుగ్మతతో బాధపడుతున్నాడా? జాగ్రత్తగా ఉండండి, ఒక పరిశోధన ప్రకారం అది ఆహారం పట్ల అలర్జీ వల్ల రావచ్చు.
ఈ పరిశోధన ఫలితాలను బట్టి ఆహారం అలర్జీ వున్న పిల్లల్లో చిన్నపిల్లల ఆందోళన రుగ్మత ఎక్కువ ఉన్నట్లు తేలింది.
పరిశోధకులు ఆహారపు అలర్జీలు ముఖ్యంగా సామాజిక యాంగ్జయిటీ, సమాజంలో తిరస్కరణ,అవమానపు భయాలకు కారణమవుతాయని చెప్పారు.

కొలంబియా యూనివర్సిటీ రచయిత రీనీ గుడ్ విన్ మాట్లాడుతూ, " ప్రాణాంతకమైన వాటితో ఎలా జీవించాలా అన్న ఆలోచన ఆందోళనకి కారణం కావచ్చు, మరియు కొందరు పిల్లలు మిగతావారి కంటే తాము వేరు అన్న భావనతో సోషల్ యాంగ్జయిటీకి గురికావచ్చు. ఇది వారి వయస్సు, ఆహారపు అలర్జీలను పెద్దవారు ఎలా పరిష్కరిస్తున్నారన్నదానిపై ఆధారపడుతుంది." అని చెప్పారు.

జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ లో ప్రచురితమైన అధ్యయనంలో, వారి బృందం 4-12 ఏళ్ళ మధ్య రోగులైన చిన్నపిల్లలను, ఆహారం అలర్జీ ఉన్నవారు, లేనివారుగా మరియు వారిని సంరక్షించే వారి స్థితిని బట్టి విశ్లేషించారు.
ఆహారం అలర్జీ ఉన్న పిల్లల్లో, 57 శాతం మంది 48శాతం అలర్జీ లేని పిల్లల కన్నా ఆందోళన ఉన్నట్లు తెలిపారు.

ఆహారపు అలర్జీల లక్షణాలు, చిన్నప్పటి డిప్రెషన్ లక్షణాలతో కానీ, ఆందోళన మరియు సంరక్షకుల డిప్రెషన్ తో కానీ సంబంధం ఉన్నట్టు తెలియలేదు.
ఈ పరిశోధకుడు తర్వాత ఇవే ఫలితాలను కొంచెం పెద్దపిల్లల్లో, యువతలో , డిప్రెషన్ చాలా ఉన్నవారిలో, ఈ ఆహారపు అలర్జీల వల్ల ఎలాంటి ప్రభావాలు ఉన్నాయో పరీక్షించాలని భావిస్తున్నారు. ఎందుకంటే మొదట్లో ఉండే ఆందోళనే తర్వాత డిప్రెషన్ గా మారవచ్చు.



Click it and Unblock the Notifications