Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
మీ బిడ్డను ఒంటరిగా ఎందుకు నిద్రింపజేయాలి?

మీకు ఎంత ప్రయివసీ కావాలో....మీ బిడ్డకు కూడా అంత ప్రయివసీ వుండాలి. మీరు తల్లితండ్రులైనంత మాత్రాన మీ బిడ్డ ఏం చేస్తోందోనని ఎల్లపుడూ చెక్ చేయాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ నుండి బిడ్డను ఒక బేబీగా తెచ్చారు. కాని నేడు ఒక స్వతంత్రత కల వ్యక్తిగా రూపొందిస్తున్నారు. మీ పిల్లాడు మీకు తెలియకుండా ఒక పర్సనల్ డైరీ రాయాలనుకోవచ్చు లేదా ఒక పుస్తకం చదవాలనుకోవచ్చు. ఒక్కొక్క సారి చక్కగా ఆలోచించుకోవాలంటే కూడా ఒంటరితనం కావాలి. మీ పిల్లాడు సృజనాత్మక కలవాడైతే తప్పక ఒక ప్రత్యేక బెడ్ రూమ్ ఏర్పరచండి. చాలామంది తల్లితండ్రులుతమ బిడ్డ ఒంటరిగా పడుకోవాలంటే వ్యతిరేకిస్తారు. అది వారి బందుత్వంలో దూరం తెస్తుందనుకుంటారు. తమ బిడ్డ జీవితంలో తాము మిస్ అయిపోతున్నామంటారు.
కాని, మీకు తెలియనిదేమంటే......మీనుండి దూరంగా నిద్రింపచేస్తున్నంత మాత్రాన పిల్లాడిని మీరు ఎక్కడికో పంపేయటం లేదు. మరి కొద్ది రోజులలో పిల్లాడు కోరుకొనే అంశాన్ని మీరు వాడికి అందజేస్తున్నారు. మీ పిల్లాడు మీకు తెలియకుండా ఏం చేస్తున్నాడో అనిమీరు ఎపుడూ వాడిని వాచ్ చేస్తూ వుండాలని మీరేమీ ఖంగారు పడకండి. అతని దైనందిన చర్యలపై ఒక కన్ను వేస్తూనే వుండండి. వాడు పడుకునే గది బోల్టు లేదా గొళ్ళెం తొలగించండి. ఇక వారు తమ రూమ్ లాక్ చేసుకోలేరు. పిల్లల గదిలో టెలివిజన్ ఎపుడూ పెట్టద్దు. ఒక సారి పెడితే ఇక వారు అందులో ఏం చూస్తున్నారనేదానిపై మీ నియంత్రణ వుండదు.
ఈ ప్రయివసీ మీ పిల్లాడికే కాదు. మీ ప్రయివసీ కూడా మీరు చూసుకోవాలి? మీ జీవిత భాగస్వామితో సరదాగా వుండాలని మీకన్పించదా? మీకు మీ భాగస్వామికి కూడా కొన్ని మధుర క్షణాలుండాలికదా?ఎదిగే పిల్లలు వున్న నింటిలో భార్యా భర్తలు చర్చించుకునే అంశాలు చాలా వుంటాయి. పిల్లలకు అర్ధం లేని భయాలు అంటే చీకటి భయం, లేదా దెయ్యాల భయం లేదా రాక్షసుల భయం వంటివి పోవాలంటే వారు ఒంటరిగా కూడా పడుకోవాలి. అటువంటి భయాలు వారికి సరి కాదు. మీరు ఏమైనా ఇటువంటి భయాలు వాడికి చెపితే వెంటనే వాటికి సవరణలు చెప్పేయండి.
మీ బిడ్డను ఎలా పెంచారనేది వాడు పెద్దవాడైతే గాని తెలియదు. కనుక వారికి సరియైన మార్గం చూపండి.



Click it and Unblock the Notifications