Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
బ్రైట్ కలర్ కాదు, పిల్లలకు బ్రైట్ హెల్త్ బెనిఫిట్స్ అందించే దానిమ్మ..
దానిమ్మ ట్రెడిషన్ ఫ్రూట్. అంతే కాదు, బాగా పాపులర్ అయిన, బ్రైట్ కలర్ మరియు స్వీట్ ఫ్లేవర్ ఉన్నటువంటి ఫ్రూట్ . ప్రపంచం మొత్తంలో విరివిగా దొరుకుతుంది. ఇందులోని గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ వల్ల దీని వాడకం కూడా ఎక్కువే . పెద్దలకు మాత్రమే కాదు, పిల్లలకు కూడా ఇది ఒక సూపర్ ఫుడ్ గా సూచిస్తారు.
దానిమ్మలో వివిధ రకాల ఔషధగుణాలున్నాయి . అందుకే పిల్లలకు ఇది ఒక ఎక్సలెంట్ ఫుడ్ గా సూచిస్తారు. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే రిచ్ న్యూట్రీషియన్ కంటెంట్ వల్లే దీన్ని పిల్లల రెగ్యులర్ డైట్ లో అందివ్వడానికి సూచిస్తుంటారు . ఇది శరీరంలో ఎర్రరక్తకణాలు ఉత్పత్తికి గ్రేట్ గా సహాయపడుతుంది . మరియు రక్తంలో హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.
దానిమ్మలో ఎక్కువ న్యూట్రీషినల్ విలువలుండటం వల్ల, పిల్లలో ఆరోగ్యానికి అవసరం అయ్యే న్యూట్రీషినల్ విలువలు పొందడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. దానిమ్మ రోజూ పిల్లలకు అందివ్వడం వల్ల పిల్లలకు ఫైబర్ తో పాటు, విటమిన్ సి మరియు పొటాషియంలు పుష్కలంగా అందుతాయి . దానిమ్మలో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల మలబద్దకాన్ని నివారించుకోవచ్చు.
దానిమ్మలో ఉండే పొటాషియం కంటెంట్ వల్ల శరీరంలో ద్రవాలను బ్యాలెన్స్ చేసుకోవచ్చు . ఇది మజిల్ మరియు నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. అదే విధంగా, వీటన్నింటితో పాటు మరికొన్ని గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను కూడా పిల్లలకు అందిస్తుంది. మరి అవేంటో తెలుసుకుందాం...

ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది:
దానిమ్మ జ్యూస్ శరీరంలో బ్యాక్టీరియల్ మైక్రోఆర్గానిజమ్ తొలగించి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. దానిమ్మలో బయోకెమికల్స్ మరియు ఎంజైమ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలను అందిస్తుంది.

జీర్ణసమస్యలను నివారిస్తుంది:
చిన్న పిల్లల్లో వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే డయోరియా మరియు డీసెంటరీ వంటి జీర్ణ సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

ప్రేగుల్లోని వార్మ్స్ ను తొలగిస్తుంది:
ఇంటెన్సినల్ వార్మ్ పిల్లల్లో చాలా తరచుగా చూస్తుంటాము. ఈ వార్మ్ చిన్న ప్రేగుల్లోని న్యూట్రీషియన్స్ ను నాశనం చేస్తుంటాయి. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో దానిమ్మ జ్యూస్ ను అందించినట్లైతే ఇంటెన్సినల్ వార్మ్ ను తొలగించుకోవచ్చు.

జ్వరాన్ని నివారిస్తుంది:
దానిమ్మ జ్యూస్ ను అందివ్వడం వల్ల పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో జ్వరం, ఫ్లూ వంటివి నివారించబడుతాయి. అంతే కాదు పిల్లల పెరగుదలకు , ఎదుగుదలకు సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫీవర్ మరియు ఫ్లూ , కోల్డ్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

దంత సమస్యలను నివారిస్తుంది:
పిల్లల్లో తరచూ వచ్చే దంత సమస్యలను నివారించడంలో దానిమ్మ గ్రేట్ గా పనిచేస్తుంది. దాంత సమస్యలు మరియు ఓరల్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఇందులో ఉండే యాంటీ వైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు . ఓరల్ డిసీజ్ లను తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

లివర్ కు రక్షణ కల్పిస్తుంది:
దానిమ్మను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇది పిల్లల్లో కాలేయ సమస్యలను నివారిస్తుంది. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కాలేయం మీద ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించే కాలేయంను రక్షిస్తుంది.



Click it and Unblock the Notifications