Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
గర్భవతులలో ఒత్తిడి పుట్టబోయే పిల్లల్లో ఆటిజానికి దారితీస్తుందా??
ఒత్తిడి మన ఆరోగ్యం మీద కలుగచేసే దుష్ప్రభావాలగురించి మనలో చాలా మందికి తెలుసు.మ్యాగజీన్లు, ఇంటర్నెట్ నిండా ఒత్తిడి వల్ల ఆరోగ్యం మీద కలిగే హాని గురించి సమాచారమే.మామూలు వారిలోనే ఒత్తిడి ఇంత దుష్ప్రభావాన్ని కలుగచేస్తే ఇక సహజంగానే గర్భిణీలలో ఒత్తిడి కలుగచేసే ప్రభావం ఏమీ వేరేగా ఉండదు.
గర్భం దాల్చి పిల్లల్ని కనేంతవరకూ అసలు తల్లీకీ, ఆమె కుటుంబానికీ చాలా ఒత్తిడితో కూడుకున్న సమయం.ఆరోగ్యం ఎలా ఉంటుందో అనీ, ప్రసవ వేదనని గురించి భయాలు,పిల్లలు పుట్టాకా వారి బాగోగులు ఎలాగ అనీ ఇలా రకరకాలుగా తల్లి భయపడుతూనే ఉంటుంది. ఇక భౌతికంగా ఆమె శరీరం మార్పు చెందడంవల్ల ఏర్పడే ఒత్తిడి ఈ భయాలకి అదనం.
గర్భిణీలలో ఒత్తిడి ఎక్కువయితే అబార్షన్లు, ప్రీ మెచూర్డ్ బేబీస్ కలగడం లాంటి పరిణామాలు ఎదురవుతాయి.అందువల్ల గర్భవతులు ఒత్తిడి నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఇటీవలే జరిగిన అధ్యయనంలో గర్భిణీ స్త్రీలలో ఉండే ఒత్తిడి వల్ల పుట్టబోయే పిల్లలలో ఎదుగుదల కి సంబంధించిన ఆటిజం లాంటి సమస్యలు,వారి ధారణా శక్తి,అభ్యాస నైపుణ్యాలు కొరవడడం లాంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని తెలుసుకున్నారు.
అసలు ప్రెగ్నెన్సీ సమయంలో ఒత్తిడి వల్ల పిల్లలలో ఆటిజం ఎలా కలుగుతుందో చూద్దాము.
పరిశోధకులు కొంత మంది తల్లుల మీద ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.ఆటిజం ఉన్న పిల్లల తల్లులని పరిశీలిస్తే వారి తల్లులు గర్భవతులుగా ఉన్నప్పుడు చాలా ఒత్తిడికి గురయ్యారని తెలిసింది.
ఎక్కువ ఒత్తిడి ని ఎదుర్కొన్న మహిళల్లో 5-హెచ్.టీ.టీఎ.ఎల్.పీ.ఆర్. అనే జన్యువుని గుర్తించారు. పిల్లలలో ఆటిజం వృద్ధి చెందడానికి కారణం ఈ జన్యువే.

ఆటిజం అంటే పిల్లలలో ఎదుగుదల, అభ్యాస క్రియలకి సంబంధించిన లోపం.దీని వల్ల పిల్లలలో నేర్చుకునే నైపుణ్యం కొరవడి వారు అన్నింటిలో వెనుకబడతారు.
ఆటిజం స్పెక్ట్రం డిజార్డర్ ఉన్న పిల్లలలో వల్ల భావ వ్యక్తీకరణ కష్టమవుతుంది. ఇంకా వీరు సంఘంలో త్వరగా ఇమడలేరు పైగా ప్రతీ పనినీ ఒకటికి రెండు సార్లు సరి చూసుకునే కంపల్సివిటీ అనే లక్షణం కలిగి ఉంటారు.ఒక్కోసారి వీళ్ళు తమని తాము గాయపరచుకోవడం వంటివి చేస్తుంటారు.
ఆందువల్ల అరోగ్యకరమైన శిశువు జన్మించాలంటే గర్భవతులు ఆ తొమ్మిది నెలలూ వీలైనంతగా ఒత్తిడికి దూరంగా ప్రశాంత వాతావరణంలో ఉండాలని పరిశోధకులు తేల్చారు.



Click it and Unblock the Notifications
