Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పిల్లలకు బాదాం పాలు ఇవ్వడం ఎంతవరకు ఆరోగ్యకరం ?
కొంతమంది తల్లిదండ్రుల పిల్లల డైట్ లో ఆల్మండ్ మిల్క్ చేరుస్తూ ఉంటారు. పిల్లల్లో లాక్టోజ్ తక్కువ అవుతుందని ఉద్దేశ్యంతో ఆల్మండ్ మిల్క్ ఇస్తారు. అలాగే కొంతమంది పిల్లలకు అనిమల్ మిల్క్ వల్ల అలర్జీ ఉన్నా.. ఆల్మండ్ మిల్క్ ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారు.
ఇప్పుడు ఆల్మండ్ మిల్క్ పిల్లలకు మంచిదేనా అనేది ప్రతి ఒక్కరి అనుమానం. ఒకవేళ మీ పిల్లలు నట్ ఎలర్జీతో బాధపడుతుంటే ఆల్మండ్ మిల్క్ ఇవ్వకూడదు. కాబట్టి.. మీ పిల్లలకు ఆల్మండ్ మిల్క్ ఇవ్వడం మంచిదేనా, కాదా అన్నది డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

సాధారణంగా.. నట్ అలర్జీ వల్ల వాంతులు, డయేరియా, పొట్టలో నొప్పి, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, ర్యాషెస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మీ పిల్లలకు నట్ ఎలర్జీ ఉందో లేదో తెలుసుకోవడం చాలా అవసరం. అలాగే.. నట్ అలర్జీ వల్ల కొన్ని సార్లు చాలా ప్రమాదకర పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది.

అలాగే పిల్లలకు కొంత ఫ్యాట్ అవసరం అవుతుంది. కాబట్టి వాళ్లు హెల్తీగా పెరగాలంటే.. డైట్ లో ఫ్యాట్ చేర్చాలి. ఆల్మండ్ మిల్క్ పిల్లల పెరుగుదతలకు కావాల్సినన్ని పోషకాలు అందించడంలో సహాయపడదు. బాదాంలో చాలా పోషకాలు ఉంటాయి.. కానీ.. ఆల్మండ్ మిల్క్ లో వాటర్ ఉండటం వల్ల.. ఆల్మండ్స్ తో పోల్చితే.. దీనిలో తక్కువ పోషకాలుంటాయి.

ఒకవేళ మీ పిల్లలకు ఆల్మండ్ మిల్క్ ఇవ్వాలని మీరు భావిస్తే.. ఒకటిన్నర ఏడాది దాటిన పిల్లల డైట్ లో అదనంగా చేర్చాలి. అలాగే.. ఈ ఆల్మండ్ మిల్క్ ఇవ్వడానికి ముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

ఆల్మండ్ మిల్క్ లో పాస్ఫరస్, విటమిన్ బి, విటమిన్ ఏ, క్యాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. అలాగే ఒక కప్పుడు పాలు పిల్లలకు ఇవ్వడం వల్ల.. 33 శాతం క్యాల్షియం లెవెల్స్ అందుతాయి.

అలాగే ఆల్మండ్ మిల్స్ మీ పిల్లలకు ఎనర్జీని అందించి.. యాక్టివ్ గా ఉండటానికి సహాయపడుతుంది. కాబట్టి ఒకవేళ మీ పిల్లలకు ఆల్మండ్ మిల్క్ ఇవ్వాలనుకుంటే.. మంచిదే. కానీ.. డాక్టర్ ని మాత్రం సలహా తీసుకోవడం వల్ల.. ఎలర్జీలు, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు.




Click it and Unblock the Notifications