గర్భధారణ సమయంలోఒత్తిడి తగ్గించుకోవడానికి చిట్కాలు

గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలలో కనిపించే అత్యంత సాధారణ సమస్య ఒత్తిడి. గర్భం పొందిన మహిళలు ఎలాగైనా సరే ఒత్తిడిని కలిగించే పనులకు దూరంగా ఉండాలి. అధిక ఒత్తిడికి గురైనప్పుడు, కడుపులో పెరిగే పిండం మీద అధిక ప్రభావం చూపుతుంది. గర్భిణీ స్త్రీలు, ఒత్తిడితో ఉన్నప్పుడు, ఆమె ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే శిశువు పుట్టుకలో లోపాలాను ఏర్పడవచ్చు.

మహిళ గర్భిణీగా ఉన్నప్పుడు, ఆమె ఎల్లప్పుడూ ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉండాలని నిర్ధారించుకోవాలి. తన చుట్టూ జరిగే కొన్నిముఖ్యమైన విషయాలు ఆమెలో ఆందోళనకు గురిచేయడం వల్ల కడుపులో పెరిగే పిండం మీద సమస్యలకు దారి తీస్తుంది. గర్భధారణ సమయంలో గర్భిణీ అధిక ఒత్తిడికి లోనైనప్పుడు తల్లి మరియు కడుపులో పెరిగే బిడ్డ మీద కూడా మరిన్నిసమస్యలకు దారితీస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, గర్భధారణ సమయంలో స్త్రీలు ఒత్తిడికి లోనైనప్పుడు, ఆమెలో బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది, అలాగే హార్ట్ రేట్ కూడా అమాంతం పెరిగి శిశువు గర్భంలో అణచివేయబడుతుంది. గర్భధారణ సమయంలో ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడానికి మీరు ముందుగా చేయల్సింది, మీరు అలవాట్లు, జీవనశైలిని మార్చుకోవాలి. మీరు ఒత్తిడి జీవితంతో గడుపుతున్నట్లైతే, మీరు ఒత్తిడి తగ్గించుకోవడానికి మార్గాలు కనుక్కోవాలి.

దాంతో, గర్భధారణ సమయంలో ఒత్తిడిని కంట్రోల్ చేయవచ్చు. గర్భిణీ స్త్రీ ఒత్తిడిన కంట్రోల్ చేయడానికి కొన్నిఉత్తమమైన మార్గాలను బోల్డ్ స్కై క్రింది విధంగా లిస్ట్ చేయబడింది. ఈ మార్గాలను అనుసరించడం వల్ల హెల్తీ ప్రెగ్నెన్సీ పొందడానికి సహాయపడుతుంది. మరి ఆ ఉత్తమమైన మార్గాలేంటో ఒక సారి పరిశీలిద్దాం..

ఎక్కువగా నవ్వాలి:

ఎక్కువగా నవ్వాలి:

ఎక్కువగా నవ్వడం వల్ల మీలో సంతోషాన్ని కలిగిస్తుంది మరియు ఒత్తిడిని చాలా త్వరగా తగ్గించుకోవచ్చు. సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ కొరకు మీరు హ్యాపీ నవ్వడానికి ప్రయత్నించండి.

యోగా:

యోగా:

గర్భిణీ స్త్రీలు యోగా చేయడం వల్ల వారి మనస్సు మరియు శరీరం రిలాక్స్ గా ఉంటుంది. గర్భణీ స్త్రీ చేయవల్సిన కొన్ని యోగాసనాలున్నాయి, వాటిని ప్రయత్నించి ఆరోగ్యకరంగా గర్భంను పొందవచ్చు.

స్నేహితులతో కలిసి ఉండటం:

స్నేహితులతో కలిసి ఉండటం:

గర్భధారణ సమయంలో, తప్పనిసరిగా స్నేహితులతో టచ్ లో ఉండాలి. వారు మీలో అనుకూల ఆలోచనలను తీసుకురాగలవు. దాంతో గర్భిణీలో ఒత్తిడిని దూరంగా ఉంచుకోవచ్చు.

బుక్ చదవాలి:

బుక్ చదవాలి:

గర్భధారణ సమయంలో విసుగు చెందకుండా కొన్ని ట్రెండీ మరియు సెన్షేషల్ బుక్స్ ను చదవాలి . అది మీరు సంతోషకరంగా ఆలోచించడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతాయి

డేట్:

డేట్:

డేట్ నైట్స్ ఎప్పుడూ కొత్తగానే ఉంపటుంది. ఇద్దరు వ్యక్తులు చాలా దగ్గరగా, మరియు సఖ్యతగా మెలగడానికి డేట్ నైట్ చాలా ముఖ్యం. గర్భిణీలో సంతోషకరమైన వాతావరణ కల్పించడం భర్త మరియు కడుపులో శిశువు ద్వారా కల్పించవచ్చు.

షాపింగ్:

షాపింగ్:

గర్భిణీ స్త్రీ బోర్ ఫీలవుతున్నప్పుడు, షాపింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. షాపింగ్ లో మీకు మరియు మీకు పుట్టబోయే బిడ్డకు అవసరం అయ్యే వస్తువులను కొనుగోలు చేయవచ్చు. గర్భధారణ సమయంలో ఒత్తిడిని నియంత్రించడానికి ఇది ఒక ఉత్తమైన మార్గం.

మీఅంతట మీరు అందంగా తయారవ్వడం:

మీఅంతట మీరు అందంగా తయారవ్వడం:

గర్భధారణ సమయంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి, బ్యూటీపార్లర్ల ప్రమేయం లేకుండా మీ అంతట మీరు అందంగా తయారవ్వండి.

ఇష్టమైన వంటలను తినడం:

ఇష్టమైన వంటలను తినడం:

మీకు ఏవైనా తినాలనే కోరికలున్నప్పుడు, ఆరోగ్యకరమైన మార్గంలో వాటిని తీసుకోవడం మర్చిపోకండి . మీకు ఇష్టమైనవి ఆరోగ్యకరంగా తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడి నియంత్రించవచ్చు.

మసాజ్:

మసాజ్:

ఒత్తిడి తగ్గించుకోవడానికి మసాజ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది . అలాగే గర్భిణీ యొక్క మనస్సును రిలాక్స్ గా ఉంచుతుంది.

స్విమ్మింగ్:

స్విమ్మింగ్:

గర్భధారణ సమయంలో ఎనర్జీగా ఉండాలంటే స్విమ్మింగ్ ఒక ఉత్తమ మార్గం. స్విమ్మింగ్ వల్ల ఆరోగ్యం పొందడంతో పాటు, ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

ఆరోగ్యకరమైన ఆహారాలు అరటిపండ్లు వంటివి గర్భిణి స్త్రీలను ఒత్తిడి నుండి దూరంగా ఉంచుతుంది. అరటిపండ్లలో పొటాషియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల వీటిని మీరు తీసుకోవడం చాలా మంచిది.

శిశువు గురించి తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం:

శిశువు గురించి తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం:

గర్భిణీ స్త్రీ తన కడుపులో పెరుగుతున్నశిశువు గురించి తెలుసుకోవడానికి కొన్ని ప్రెగ్నెన్సీ బుక్స్ లేదా ఇంటర్నెట్ లో చదవడం మంచి మార్గం . ఇది ఆరోగ్యం గురించి తెలుసుకోవడంతో పాటు ఒత్తిడి నియంత్రించడానికి సహాయపడుతుంది.

మీ ఇంటిని రీ డెకరేట్ చేయండి:

మీ ఇంటిని రీ డెకరేట్ చేయండి:

కడుపులో పెరుగుతున్న శిశువును ఆహ్వానించడానికి మీ ఇంటిని రీడెకరేట్ చేసుకోవడం వల్ల, అది ఆమెలో పాజిటివ్ ఆలోచనలు మరియు యాక్టివ్ గా ఉండటానికి సహాయపడుతుంది.

పొట్ట చుట్టు చేతులతో స్పర్శించడం :

పొట్ట చుట్టు చేతులతో స్పర్శించడం :

గర్భిణీ స్త్రీ, గర్భధారణ సమయంలో తన బేబీ బంప్ ను రెండు చేతులతో సున్నితంగా స్పర్శించడం ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక ఉత్తమ మార్గం.

మంచి ఆహారం:

మంచి ఆహారం:

మంచి ఆహారం మిమ్మల్ని ఎల్లప్పుడు బెటర్ గా ఫీల్ అయ్యేలా సహాయపడుతుంది. ఒక మంచి ట్రీట్, మీకు నచ్చిన ఆహారాలను తీసుకోవడం వల్ల మీ మనస్సు ప్రశాతంగా మరియు ఒత్తిడి లేకుండా నియంత్రిస్తుంది.

సినిమా చూడటం:

సినిమా చూడటం:

మీ పార్ట్నర్ తో కలిసి ఒక అందమైన రొమాంటిక్ మూవీని చూడటం. గర్భధారణ సమయంలో మంచి రొమాంటిక్ మూవీలు చూడటం వల్ల ఒత్తిడిని నియంత్రించుకోచ్చు.

సోషియల్ సైట్స్ :

సోషియల్ సైట్స్ :

గర్భధారణ సమయంలో, ముఖ్యంగా గర్భిణీ ఇంట్లో ఉన్నప్పుడు, సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ చూడటం వల్ల టైం పాస్ చేసుకోవడానికి ఇది ఒక ఉత్తమమైన మార్గం.

క్లబ్స్ లో ఎక్కువగా ప్రమేయం కలిగి ఉండటం:

క్లబ్స్ లో ఎక్కువగా ప్రమేయం కలిగి ఉండటం:

మీఅంతట మీరు క్లబ్స్ లో ఎక్కువగా ప్రమేయం కలిగి ఉండటం మరియు మీతో పాటు మీ పార్ట్నర్ కూడా ఉండేలా నిర్ధారించుకోవాలి . గర్భధారణ సమయంలో ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇది ఒక ఫర్ ఫెక్ట్ మార్గం.

పాజిటివ్ గా ఆలోచించడం:

పాజిటివ్ గా ఆలోచించడం:

పాజిటివ్ గా ఉండటం మరియు పాజిటివ్ గా ఆలోచించడం అన్నది గర్భిణీ స్త్రీ తను మనస్సును సంతోషకరమైన వాతావరణంలో మలచుకోవడం వల్ల గర్భధారణ సమయంలో చాలా సహాయపడుతుంది.

ప్రేమగా ఉండటం :

ప్రేమగా ఉండటం :

మీ పార్ట్నర్ తో కలిసి సంతోషంగా ఉండటం అందుకోసం ఇంద్దరూ ఎక్కువ సమయం గడపడం వల్ల, గర్భధారణ సమయంలో ఒత్తిడిని నియంత్రించుకోవచ్చు.

Story first published: Wednesday, December 11, 2013, 16:01 [IST]
Desktop Bottom Promotion