Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
గర్భధారణ సమయంలో ఆకలిని పెంచటానికి చిట్కాలు
సాదారణంగా గర్భిణీ స్త్రీల విషయంలో ఆకలి లేదని ఒక ఫిర్యాదు ఉంటుంది. కానీ ఇది వదిలి వేసే ఒక సాధారణ సమస్య కాదు. గర్భం సమయంలో మీకు పుట్టే బిడ్డ పెరుగుదల మరియు అభివృద్ధి కోసం మీరు ఎక్కువ ఆహారం తీసుకోవలసిన అవసరం ఉంది. ఆకలి అకస్మాత్తుగా తగ్గటానికి ప్రధాన కారణం మీ శరీరంలో సంభవించే తీవ్రమైన హార్మోన్ల మార్పులు అని చెప్పవచ్చు. గర్భం సమయంలో మీరు మరియు మీ శిశువు ఇద్దరి ఆరోగ్యానికి మరియు ఆకలి పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవటం ముఖ్యం.
ఆరోగ్యవంతమైన ఆహార అలవాట్లు ఉండాలి. మీరు భుజించే ఆహారంలో చాలినంత పోషకాలు ఉండేలా చూసుకోవాలి. గర్భం సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం అనేది ముఖ్యమైన విషయం. సమతుల్యమైన ఆహారం మీ శిశువు యొక్క మానసిక మరియు శారీరక అభివృద్ధిని నిర్ణయించే కీలక కారకంగా ఉంటుంది.
ఆకలిని నియంత్రించి బరువు తగ్గించే 20 బెస్ట్ ఫుడ్స్:క్లిక్ చేయండి
మొదటి త్రైమాసిక సమయంలో వేవిళ్ళు మరియు ఇతర అసౌకర్యాల వలన ఆకలి తగ్గవచ్చు. కానీ, మీరు వేవిళ్ళు కాలం నుంచి కోలుకోన్నాక మీకు సహజంగా ఆకలి లేకపోతె అప్పుడు ఆకలి పెరగటానికి చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మీకు గర్భం సమయంలో ఆకలి పెరగటానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఉన్నాయి.

చిన్న భోజనం తినాలి
మీ గర్భం సమయంలో ఆకలిని పెంచే ప్రయత్నంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశాలలో ఒకటి. మీ కడుపు నిండటానికి ఒక భారీ భోజనంనకు బదులుగా చిన్న భోజనం తినాలి.

తేలికపాటి వ్యాయామం
గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం వలన మీ శారీరక ఫిట్నెస్ మెరుగుపరచటమే కాకుండా గర్భం సమయంలో ఆకలిని పెంచుతుంది. వ్యాయామం చేసే ముందు గర్భం సంబంధించిన ఏ వైద్య సమస్యలు లేవని నిర్ధారించుకోవడానికి మీ డాక్టర్ ని కలవండి.

ఆహారాన్ని ఇష్టంగా తినండి
ఆకలి తగ్గటానికి మీ మానసిక వైఖరి కూడా కారణం కావచ్చు. మీరు గర్భవతి ఉన్నప్పుడు కొన్ని ఆహారాలు తినాలనే కోరిక ఉండటం మామూలే. మీరు ప్రత్యేకంగా ఏదైనా తినాలని భావిస్తే,దానిని తినండి. మీరు సంతృప్తిగా ఉండటానికి మరియు గర్భధారణ సమయంలో ఆకలి పెరగటానికి సహాయం చేస్తుంది.

వేవిళ్ళు
గర్భిణీ స్త్రీల విషయంలో వేవిళ్ళు వలన ఆకలి కోల్పోయినట్లు భావిస్తుంటారు. ఇది కొంత మంది స్త్రీలలో చివరి త్రైమాసికం వరకు ఉండవచ్చు. కాబట్టి మీ వేవిళ్ళు నిర్వహించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటే గర్భం సమయంలో ఆకలి పెరుగటానికి సహాయం చేస్తుంది.

యోగ:
యోగ సాధన అనేది గర్భధారణ సమయంలో ఆకలిని పెంచటానికి ఒక మంచి ఆలోచన. ఆకలిని పెంచటానికి ప్రత్యేకంగా రూపొందించబడిన అనేక ఆసనాలు ఉన్నాయి. కానీ,కేవలం ఒక ప్రొఫెషనల్ యోగ శిక్షకుడు ద్వారా మాత్రమే యోగ సాధన చేయాలని గుర్తుంచుకోండి.

ఆరోగ్యకరమైన స్నాక్స్
గర్భంతో ఉన్నప్పుడు ఒక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ఒక మంచి ఆలోచన. మీ ఆహారంలో కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ ను చేర్చండి.మీ జీర్ణ వ్యవస్థకు ఒక చిన్న ప్రేరణ కలిగి ఆకలిని ప్రేరేపిస్తుంది. గర్భధారణ సమయంలో ఆకలి పెరుగటానికి సహాయం చేస్తుంది.

జంక్ ఆహారం మానుకోండి
గర్భధారణ సమయంలో జంక్ ఫుడ్ పూర్తిగా మానివేయాలి. జంక్ ఆహారాలు మీకు మరియు మీ శిశువుకు మంచిది కాదు. అంతేకాకుండా,అది ఆకలిని కూడా తగ్గిస్తుంది. జంక్ ఫుడ్ తీసుకోవడం తగ్గించడం ద్వారా గర్భధారణ సమయంలో ఆకలిని పెంచవచ్చు.

కొత్త వంటకాలను ప్రయత్నించండి
మీరు రొటీన్ వంటకాలతో విసుగు చెంది ఉంటే అప్పుడు మీరు కొత్త వంటకాలకు ప్రయత్నించవచ్చు. మీ ఆహారంలో రుచి మరియు మార్పు ఖచ్చితంగా మీ ఆకలిని పెంచుతుంది. కానీ, గర్భధారణ సమయంలో తినడానికి ఆరోగ్యకరముగా ఉండే వాటిని ఎంచుకోవాలని గుర్తుంచుకోవాలి



Click it and Unblock the Notifications