Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హెల్తీ ప్రెగ్నెన్సీ : వేర్లు ఉన్న కూరగాయలు గర్భవతులకు సురక్షితమేనా?
వేర్లతో ఉన్న కూరగాయలు, ఆకులు లేని బంగాళదుంప, క్యారెట్ వంటి ఆహార పదార్థాలు గర్భంతో ఉన్న ఆడ వారికి చాలా రకాల పోషకాలను అందిస్తాయి. గర్భంతో ఉన్న ఆడ వారు అధికంగా పోషకాలను కలిగి ఉన్న మరియు మంచి ఆహార నియమాలను పాటించటం వలన వారి ప్రసవ సమయంలో వచ్చే సమస్యల నుండి కొంచెం ఉపశమనాన్ని పొందవచ్చు.
గర్భంతో ఉన్న ఆడవారు అన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి మంచి ఆరోగ్య ప్రణాలికను తయారు చేసుకొని వాటిని పాటించాలి. ఈ ప్రణాళికలో వేర్లతో ఉన్న ఆహార పదార్థాలను కలపటం వలన గర్భ సమయంలో స్త్రీలకు కావలసిన పోషకాలను అందింపబడతాయి.
వేర్లతో ఉన్న కూరగాయలు ఎందుకు మంచివి
వేర్లతో ఉండే కూరగాయలు అన్ని భూగర్బంలో పెంచబడతాయి. ఇందులో క్యారెట్స్, కండ్ర గడ్డ (స్వీట్ పొటాటో), బీట్ రూట్స్, కసావ, అల్లం, ముల్లంగి, రూటబాగా వంటి ఇంకా ఎన్నో ఆహార పదార్థాలు భూగర్బంలో పెంచబడతాయి. భూగర్బంలో పెరిగే వేర్లతో ఉండే కాయగురాలలో ఆకులు, కాండాలు మార్పు చెందుతాయి మరియు కొన్ని బల్బ్ ఆకారంలో కూడా ఉంటాయి. ఉదాహరణకు- బంగాళదుంప, ఉల్లిగడ్డ వంటివి మార్పు చెందిన కాండము, ఆకులు కలిగి ఉంటాయి మరియు ఇవి బల్బ్ రూపంలో పెరుగుతాయి.
వేర్లతో ఉన్న కూరగాయలలో ఉండే మూలకాలు
'కొలరాడో పొటాటో అడ్మినిస్ట్రేటివ్' వారు తెలిపిన దాని ప్రకారం, ఒక బంగాళదుంపలో 110 క్యాలోరిలను కలిగి ఉండి మీ సగం రోజుకు కావాల్సిన విటమిన్ C, పొటాషియం, మరియు 'కెరోటినాయిడ్స్', 'అంతోసయనిన్స్' వంటి యాంటీ-ఆక్సిడెంట్స్'టో పాటు 2 గ్రాముల ఫైబర్'ని, ఇలా గర్భ సమయంల్లో కావలసిన అన్ని రకాల మూలకాలను అందిస్తాయి. వీటి నుండి వచ్చే ఫైబర్'ల వలన రక్తంలోని లిపిడ్స్ స్థాయిలను పెంచుతాయి మరియు రక్తంలోని చక్కెర స్థాయిలను సమన్వయ పరుస్తాయి. క్యారెట్ అధికంగా విటమిన్ 'A' కలిగి ఉంటుంది మరియు ఇందులో బీటా-కెరోటిన్, విటమిన్'C'లు అధికంగా ఉంటాయి. గర్భ సమయంలో వచ్చే ఇబ్బందుల నుండి ఇవి కొద్దిగా ఉపశమనాన్ని కలిగిస్తాయి. గర్భంతో ఉన్న ఆడవారు తినే ఆహారాన్ని తయారు చేసేటపుడు ఉల్లిపాయని తప్పనిసరిగా వాడాలి. కారణం ఇందులో గర్భంతో ఉన్న ఆడ వారికి కావలసిన విటమిన్'C', 'ఫోలేట్', 'పొటాషియం', 'మాంగనీస్' మరియు 'ఫైబర్' వంటి మూలకాలు అధికంగా ఉంటాయి. ఒక ఉల్లిపాయ ఎలాంటి ఫాట్'ని అందించకుండా కేవలం 110 క్యాలోరీలను అందిస్తాయి. వేర్లతో ఉన్న కూరగాయలని తినటం వలన అంటువ్యాదుల సంక్రమణకి దూరంగా ఉండవచ్చు.

కలిగే వ్యాధులు మరియు వాటికి నివారణ
గర్భంతో ఉన్న ఆడవారు వేర్లతో ఉన్న ఆహార పదార్థాలను తినటం వలన 'టాక్సోప్లాస్మొసిస్' అనే వ్యాధిని రాకుండా చేస్తాయి, ఈ అంటువ్యాధి కలుషితమైన మృత్తికలో ఉండే 'టాక్సోప్లాస్మా గొంగీ' అనే బాక్టీరియా పరాన్నజీవుల నుండి సంక్రమిస్తుంది. దీని అర్థం మీరు తినే ఆహర ప్రణాళిక నుండి వేర్లతో ఉన్న కాయగూరలను పూర్తిగా తీసేయమని కాదు.

ప్రమాదాల నుండి రక్షణ పొందుటకు ఏం చేయాలి?
'టాక్సోప్లాస్మొసిస్' అనే వ్యాధి రాకుండా ఉండటానికి, వేర్లతో ఉన్న ఆహార పదార్థాలను కొంత బలంతో రాస్తూ కడగాలి లేదా వాటి పైన ఉండే పొరని పూర్తిగా త్రోలగించాలి. అంతేకాకుండా మీరు పచ్చి మాంసాన్ని లేదా రాయి పైన శుభ్రపరచిన మాంసాన్ని మరియు వేర్లతో ఉన్న ఆహార పదార్థాలను కడిగిన తరువాత ఎలాంటి అంటువ్యాధులు వ్యాపించకుండా మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.

వేర్లలో ఉండే పోషకాలను పొందటానికి సూచనలు
వేర్లతో ఉండే ఆహార పదార్థాలలో చాలా రకాల పోషకాలు ఉంటాయి, కానీ ఇందులో ఎక్కువ శాతం పోషకాలు వాటి పైన ఉండే పొర లోనే ఎక్కువగా ఉంటాయి. కావున మీరు ఎక్కువ శాతం పై పోరని తోలగించకండి లేదా కొంత మేరకు మాత్రమే పై పొరని తోలగించండి.
వేరు ఉన్న కురగాయాలలో ఉండే పోషకాలను పొందటానికి మరొక మార్గం వాటిని ఉడక బెట్టడం. దీని వలన వీటి పైన ఉండే వ్యాధి కారకాలు అన్ని తోలగిపోతాయి మరియు పైన పొర తీయవలసిన అవసరం కుడా లేదు.

మంచి ఆకారంలో ఉన్న, నునుపైన మరియు స్పుటమైన క్యారెట్'లను తీసుకోండి. రంగు వత్తుగా ఉండి మరియు ఆకుపచ్చ రంగు మచ్చలు ఉంటే ఆవి తాజాగా ఉన్నాయని అర్థం. మెత్తగా,విరిగిన ముక్కలుగా ఉండే క్యారెట్ ముక్కలను తీసుకోకండి.



Click it and Unblock the Notifications