Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భిణీలు తులసి తినడం వల్ల పొందే అద్భుత ప్రయోజనాలు..
తులసి అంటే తెలియని వారుండరు. హిందుసాంప్రదాయంలో తులసికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక్క సాంప్రదయాంలోనే కాదు, ఔషధ పరంగా కూడా తులసి బాగా ప్రసిద్ది. పురాతన కాలం నుండి తులసిని అనారోగ్యాలకు ఉపశమనం కలిగించడంలో తులసిని ఔషధ మొక్కగా ఉపయోగించే వారు. వంటల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సూప్స్, సలాడ్స్ లో చేర్చి మంచి సువాసన, రుచితితో తినాలని కోరుకుంటారు .
ఆరోగ్యం విషయంలో సాధారణ వ్యక్తులకే కాదు, గర్భిణీలకు కూడా ఉపయోగడపతుంది. పుట్టబోయే బిడ్డలో కార్టిజోల్ డెవలప్ మెంట్ కు సహాయపడుతుంది. గర్భిణీలు తులసి తినడం వల్ల పొందే ప్రయోజనాలను ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది. గర్భిణీలు తులసి తినడం సురక్షితమా కాదా అన్న విషయం తెలుసుకోవాలి.
తులసి అంటే పాపులర్ ఔషధ మూలిక . ఇందులో అనేక మెడిసినల్ లక్షణాలున్నాయి. ఆకుపచ్చరంగులో ఉండే ఈ సువాసన భరితమై ఆకుల్లో మంచి ఫ్లేవర్ ఉండటం వల్ల వివిధ రకాల సూప్స్, సలాడ్స్ మరియు ఇతర కుషన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంకా తులసిలో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉన్నాయి. ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్, మినిరల్స్ ఎక్కువ. ఇతర న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువ. అందుకే తులసి ప్రెగ్నెన్సీ డైట్ లో సూపర్ ఫుడ్ గా సూచిస్తున్నారు .
గర్భధారణ సమయంలో తులసి తినడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ :

బ్లడ్ క్లాట్ నివారిస్తుంది:
తులసిలో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా అవసరంమరియు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి, సురక్షితమైన ప్రెగ్నెన్సీకి అవసరం. విటమిన్ కె గర్భిణీల్లో రక్తం గడ్డకుట్ట నివారిస్తుంది. ఎక్కువ బ్లీడింగ్ కాకుండా నివారిస్తుంది.

పొట్టలో బిడ్డ ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది:
తులసిలో విటమిన్ ఎ, అధికంగా ఉంటుంది, ఇది బిడ్డ పెరుగుదలకు గ్రేట్ గా పనిచేస్తుంది మరియు ఫీటస్ డెవలప్ మెంట్ కు సహాయపడుతుంది. తులసిలో ఉండే విటమిన్ ఎ, పుట్టబోయే బిడ్డలో హార్ట్, కళ్ళు, ఊపిరితిత్తులు, మరియు ప్రధాణ నాడీవ్యవస్థ యొక్క డెవలప్ మెంట్ ను ప్రోత్సహిస్తుంది.

పుట్టబోయే బిడ్డలో ఎముకల ఏర్పాటుకు సహాయపడుతుంది:
తులసిలో ఉండే మాంగనీస్ పుట్టబోయే బిడ్డలో ఎముకలు మరియు కార్టిలేజ్ ఏర్పాటుకు సహాయపడుతుంది. ఇంకా మ్యాంగనీస్ పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది . ఇది యాక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది . ఇది తల్లిలో సెల్యులర్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

ఆరోగ్యకరమైన రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది:
తులసిలో ఉండే పొల్లెట్ కంటెంట్ ప్రెగ్నెన్సీ సమయంలో అవసరమయ్యే అదనపు రక్తాన్ని అందిస్తుంది. ఇంకా, ఇది బేబీ పుట్టుకలో లోపాలను నివారిస్తుంది.

అనీమియాను నివారిస్తుంది:
తులసిలో ఐరన్ పుస్కలంగా ఉంటుంది. ఐరన్ హీమోగ్లోబిన్ ప్రోత్సహించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ను ప్రోత్సహిస్తుంది. దాంతో గర్భిణీల్లో అనీమియా సమస్య ఉండదు, ఇది తల్లిలో అవసరమయ్యే ఎనర్జీని అందించి, అలసటను తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications